ETV Bharat / state

మేడిగడ్డ బ్యారేజీ దిగువన భారీ నీటి ఊటలు - అడుగడుగున సమస్యలే - Medigadda Barrage Repairs - MEDIGADDA BARRAGE REPAIRS

Medigadda Barrage Issue : మేడిగడ్డ బ్యారేజ్​కు తాత్కాలిక మరమ్మతుల్లో కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. 20వ పియర్​ వద్ద భారీ బుంగను అధికారులు గుర్తించారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఈ ప్రాంతాన్ని గుర్తులతో నిషేధిత ప్రదేశంగా ఏర్పాటు చేశారు. ఏడో బ్లాక్​లో నాలుగు గేట్లను కటింగ్ చేసే తొలిగించే యోచనలో అధికారులున్నారు. మరోవైపు ఈ రోజు 20వ గేటు కటింగ్​ పనులు ప్రారంభమయ్యాయి.

Medigadda Barrage Issue
Medigadda Barrage Issue (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 25, 2024, 10:48 PM IST

Medigadda Barrage Temporary Repairs Today : మేడిగడ్డ బ్యారేజీ తాత్కాలిక పునరుద్ధరణ చర్యల్లో భాగంగా రోజుకో సమస్య ఎదురువుతోంది. ఒక సమస్యను పరిశీలించి, ముందడుగు వేసే క్రమంలో మరో సమస్య తలెత్తుతుంది. బ్యారేజీలో దెబ్బతిన్న, కుంగిన ఏడో బ్లాక్ ప్రాంతంలో విభిన్న సవాళ్లు ఎదురవుతుండగా ఇంజినీరింగ్ అధికారుల పనితనంతో ముందుకు సాగాల్సిన పరిస్థితి వస్తోంది.

మూసిఉన్న గేట్లను ఎత్తే ప్రక్రియలో 15వ గేటును ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఎత్తారు. 16వ గేటు ఎత్తే క్రమంలో ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. మిగతా గేట్లను ఎత్తడానికి సమాయాత్తం అవుతూ, ఏడో బ్లాక్ ప్రదేశంలో పునరుద్ధరణ చర్యలను సాగిస్తున్నారు. ఇందులో పలు పనులు సాగుతుండగా సమస్యలు ఎదురువుతున్నాయి.

ఏడోబ్లాక్​ ప్రాంతంలో నీటి ఊటలు : శుక్రవారం పనులు చేస్తుండగా 20వ పియర్ వద్ద భారీ బుంగను ఇంజినీరింగ్ అధికారులు గుర్తించారు. ఇందులో మట్టిని పోసి పూడ్చివేశారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, పూర్తిస్థాయి పరిశీలన, బుంగల సమస్య తీరే వరకు ఈ ప్రాంతాన్ని గుర్తులతో నిషేధిత ప్రదేశంగా ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో పలు చిన్న చిన్న బుంగలు ఏర్పడగా వాటిని సైతం పూడ్చి వేసి పరిశీలన చేస్తున్నారు.

మేడిగడ్డ బ్యారేజీ దిగువన ఏడోబ్లాక్ ప్రాంతంలో భారీగా నీటిఊటలు వస్తున్నట్లు తెలుస్తోంది. నీటిఊటలను గుర్తించి, నీటిని నియంత్రిచడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బ్యారేజీ దిగువన సీసీ బ్లాక్ అమరిక పనులు కొనసాగిస్తున్నారు. ఏడో బ్లాక్ ప్రాంతంలోకి నీటి ప్రవాహం రాకుండా నీటి మళ్లింపు పనులను చేస్తున్నారు.

Officials Plan To Cut And Remove 4 Gates : ఏడోబ్లాక్​లో ఏడుగేట్లను ఎత్తే ప్రక్రియ మిగిలి ఉండగా నాలుగు గేట్లను ఎత్తివేసే పరిస్థితి లేనందున కటింగ్ చేసి తొలగించే యోచనలో అధికారులున్నారు. 18,19,20,21 పియర్ గేట్లు ఎత్తడానికి వీలు లేకపోవడంతో వాటిని తొలగించడానికి కటింగ్ పనులతోనే తొలగించనున్నారు. శనివారం 20వ గేటు కటింగ్ పనులు ప్రారంభించారు. మూడు గేట్లను సాధారణంగా ఎత్తడానికి వీలుగా ఉన్నట్లు అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. 16,17,22 గేట్లను కటింగ్ కాకుండా సాధారణంగా ఎత్తిడానికి ప్రయత్నించనున్నారు.

యుద్ధప్రాతిపదికన మేడిగడ్డ మరమ్మతులు - వచ్చే వారం బ్యారేజీ పరిశీలనకు సీఎం రేవంత్‌రెడ్డి - MEDIGADDA BARRAGE REPAIRS

మేడిగడ్డలో మళ్లీ ఆంక్షలు : మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిన్న రోజు నుంచి మీడియా, సామాన్య ప్రజలు లోపలికి వెళ్లకుండా ఆంక్షలు ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంక్షలను ఎత్తివేసింది. తాజాగా మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ చర్యలు చేపడుతున్న నేపథ్యంలో అనధికార ఆంక్షలను కొనసాగిస్తున్నారు. బ్యారేజీ నిర్మాణ సంస్థ ప్రైవేటు సిబ్బందితో లోపలికి వెళ్లనివ్వకుండా కట్టడి చేస్తుంది. సంబంధిత శాఖ అధికారులను సంప్రదించడానికి ప్రయత్నిస్తే అందుబాటులోకి రావడం లేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సూచన, ఆదేశాలు లేనప్పటికీ మేడిగడ్డ ప్రాంతంలో అనధికార ఆంక్షలు సాగుతున్నాయి.

మేడిగడ్డకు కొత్త సమస్యలు - ఏడో బ్లాక్‌ ప్రాంతంలో భారీ బుంగ - Medigadda Barrage Repairs

మేడిగడ్డ నుంచి నీటి ఎత్తిపోతలకు ప్రత్యామ్నాయాలపై సర్కార్‌ ఫోకస్ - కన్నేపల్లి వద్ద సరిపడా నీటిమట్టం ఉండేలా కసరత్తు! - Water Diversion to kannepalli

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.