ETV Bharat / state

'మేడిగడ్డ ఒప్పందాలు ముగిశాయి - పనులు చేయాలంటే కొత్త కాంట్రాక్ట్ ఇవ్వాల్సిందే' - medigadda barrage problems

Medigadda Barrage Issue Update : మేడిగడ్డ బ్యారేజిని తనిఖీ చేసి నిర్ధారించాలని సూచిస్తూ నీటిపారుదలశాఖకు ఎల్​అండ్​టీ సంస్థ లేఖ రాసింది. కాగా ఆ సంస్థతో ఒప్పందాలు 2022లో ముగిశాయని, కొత్తగా ఏవైన పనులు చేపట్టాలంటే నూతన ఒప్పందాలు చేసుకోవాలని తెలిపింది. దీంతో మేడిగడ్డ విషయంలో ఆ సంస్థ ఇప్పడు లేఖ రాయడం చర్చనీయంశంగా మారింది.

Medigadda Barrage Issue
L&T Organization letter on Medigadda Barrage Issue
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 6, 2024, 3:02 PM IST

Medigadda Barrage Issue : మేడిగడ్డలోని ఏడో బ్లాకును పరీక్షించి దానితో పాటు పూర్తిగా బ్యారేజీ వచ్చే వర్షాకాలం వరదలకు తట్టుకోగలదా? సురక్షితమేనా? అన్నది నిర్ధారించుకోవాలని గుత్తేదారు ఎల్​అండ్​టీ సంస్థ నీటిపారుదల శాఖకు ఈ నెల 1న లేఖ రాసింది. ఆ శాఖ ప్రతిపాదించినట్లుగా కాఫర్​డ్యాం నిర్మాణం బ్యారేజీకి భద్రత కల్పించగలదని భావిస్తే, తాము అందజేసిన అంచనాకు సర్కార్ (ఖర్చును భరించడం) ఆమోదం తెలిపితే కాఫర్​డ్యాం నిర్మాణం చేపడతామని పేర్కొంది.

దీన్ని బట్టి వచ్చే వర్షాకాలం వరదలో బ్యారేజీ మొత్తానికి నష్టం వాటిల్లినా తమ బాధ్యత కాదని ఆ సంస్థ చెప్పకనే చెప్పిందని నిపుణులు పేర్కొంటున్నారు. బ్యారేజీలోని ఏడో బ్లాకు కుంగిన తర్వాత పునరుద్ధరణ బాధ్యత మీదంటే మీదని నిర్మాణ సంస్థ, నీటిపారుదలశాఖ పరస్పరం ఆరోపించుకున్న విషయం అందరికి తెలిసిందే. ఈ విషయంలోనే జనవరి 18, 22 తేదీల్లో కాళేశ్వరం ఎత్తిపోతల, రామగుండం ఇరిగేషన్ సర్కిల్ ఎస్​ఈ రాసిన లేఖలకు సమాధానంగా నిర్మాణ సంస్థ వైస్​ప్రెసిడెంట్ సురేశ్​కుమార్​ ఈ లేఖ రాశారు.

మేడిగడ్డలో పని పూర్తైనా తొలగించని కాఫర్‌ డ్యాం - విజిలెన్స్‌ విచారణలో ఆసక్తికర విషయాలు

ఇందులోని ప్రధానాంశాలు ఇవీ :

  • మేడిగడ్డ బ్యారేజీ కాఫర్​డ్యాం నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంతో అంచనా వేసి దీంతోపాటు పునరుద్ధరణ పనులకు అదనంగా ఒప్పందం చేసుకోవాలని 2023 నవంబరు 24న లేఖ రాశాం. డిసెంబరు 2న మరో లెటర్ రాశాం. కాఫర్​డ్యాంకు అయ్యే ఖర్చుపైన, ఇన్వేస్టిగేషన్​ పునరుద్ధరణ పనులకు వేరే ఒప్పందం, వర్క్​ఆర్డర్​కు సంబంధించి నీటిపారుదలశాఖ నుంచి ఎలాంటి సమాధానం లేదు.
  • కాంట్రక్ట్​గా బ్యారేజీ పనిని 2019 జూన్​ 21 వరకు పూర్తిచేశాం. దీన్ని ప్రారంభించి ఆపరేషన్​లోకి తీసుకువచ్చారు. నీటిపారుదలశాఖ 2021 మార్చి 15వ తేదీనా పని పూర్తయినట్లు సర్టిఫికెట్​ కూడా జారీ చేసింది. అందులో 2020 జూన్​ 29వ తేదీ వరకు పని పూర్తయినట్లు పేర్కొంది. 2020 జూన్​ 29 నుంచి డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ మొదలై 2022 జూన్​ 28 తేదీకి పూర్తయింది.
  • అయినప్పటికీ ప్రస్తుతం తెలంగణ సర్కార్​కు, నీటిపారుదలశాఖకు అండగా ఉండేందుకు 5రకాల పనులను ఎల్​అండ్​టీ చేసింది. ఏడో బ్లాక్ రాప్ట్​కు ఎలక్ట్రికల్‌ రెసిస్టివిటీ పరీక్ష చేసే పనిని ఎస్​ఈ సూచన మేరకు ముంబయికి చెందిన డైనోసార్​ కాంక్రీట్ ట్రీట్​మెంట్ ప్రైవేట్​ లిమిటెట్​ సంస్థకు అప్పగించాం. ఈ సంవత్సరం జనవరి 4వ తేదీనా ఆ సంస్థ పని మొదలుపెట్టి 9న పూర్తి చేసింది. గ్రౌండ్ పెనట్రేటింగా రాడార్ (జీపీఆర్​) పరీక్షను నీటిపారుదలశాఖ సూచనమేరకు పార్సన్ ఓవర్​సీస్​ ప్రైవేట్​ లిమిటెడ్​కు సంస్థకు ఇచ్చాం. ఈ పని పురోగతిలో ఉంది. 7వ బ్లాక్ ఎడవగట్టువైపు అప్రోచ్ రోడ్​, దెబ్బతిన్న బ్లాక్​ను వేరు చేసేందుకు నీటి మళ్లింపు పని, డీవాటరింగ్, శుభ్రం చేసే పనులు చేశాం.

మేడిగడ్డ పూర్తయినట్టా కానట్టా - విజిలెన్స్‌ విచారణలో ఆసక్తికర విషయాలు

బ్యారెజీ డిజైన్ పూర్తి బాధ్యత నీటిపారుదలశాఖదే :-

  • జియలాజికల్‌, జియోటెక్నికల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఫలితాలను ప్రాజెక్టు డిజైన్​, డ్రాయింగులతో కలిపి నీటిపారుదలశాఖ సమీక్షించడం, పరీక్షించడం ప్రభుత్వం సరైన చర్య. గతేడాది అక్టోబరు 21వ తేదీనా ఆ సంఘటన జరిగినప్పటి నుంచి ఆరు, ఏడు, ఎనిమిది బ్లాకులను రెగ్యులర్​గా సర్వే చేస్తున్నాం. 2023 నవంబరు 28న జరిగిన సమావేశంలో ఈ వివరాలు అందజేశాం. పర్యవేక్షణ రికార్డులను కూడా అటాచ్ చేస్తున్నాం.
  • బ్యారేజీ ఎగువన. దిగువన ఆఫ్రాన్​/ప్లింత్ కనెక్షన్​ను కాఫర్​డ్యాం పూర్తయిన తర్వాత నీటిపారుదలశాఖ పరిశీలించాల్సి ఉంది. అయినప్పటికీ గ్లాస్​ టేల్​ మానిటరింగ్ ఇంకా జరుగుతుంది. ఈ వివరాలను ప్రాజెక్టు వద్ద ఇరిగేషన్​ అధికారులకు అందించాం.
  • డిఫెక్ట్ లయబిలిటీ పిరియడ్​ 2022 జూన్ 28న పూర్తయింనందున రాప్ట్​కు ఎంత నష్టం వాటిల్లింది. ఎంతవరకు కదిలింది అన్నది నీటిపారుదలశాఖ అంచనా వేయాల్సి ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు హైడ్రాలిక్​ స్ట్రక్చర్​ వైఫల్యం ఎలా ఉందో పరిశీలన చేయాల్సిన బాధ్యత డ్యాం యజమాని అయిన నీటిపారుదలశాఖ పరిధిలోనే ఉంది. ప్రాజెక్టు పూర్తి చేసి అప్పగించినందున దీని పని, నిర్వహణ తదితర అంశాలన్నీ ఆ శాఖ పరిధిలోనే ఉన్నాయి. కమిటీ నివేదికను పరిగణలోకి తీసుకుని నీటిపారుదలశాఖకు అండగా నిలిచేందుకు తగిన కార్యచరణను ఎల్​అండ్​టీ సంస్థ చేపట్టినట్లు పైన అంశాలను బట్టి స్పష్టమవుతుంది.
  • కాఫర్‌డ్యాం పనిని వేగవంతం చేయాలని, పునరుద్ధరణ పనుల పూర్తికి వీలుగా జియోటెక్నికల్‌ ఇన్వెస్టిగేషన్‌ వేగవంతం చేయాలని జనవరి 18తేదీనా, జనవరి 22న ఈఈ, ఎస్‌ఈ లేఖలు రాశారు. అయితే ఈ పని చేయడానికి అయ్యే ఖర్చుకు సంబంధించి మేం ఇచ్చిన అంచనా వ్యయం ప్రతిపాదన ఆమోదానికి ఇంకా ఎదురు చూస్తున్నాం. ఈ పనులు వేగవంతం చేయడానికి ప్రత్యేక ఒప్పందం, వర్క్‌ ఆర్డర్‌ ఇవ్వాలని డిసెంబరు 2తేదీనా రాసిన లేఖలో కోరాం. దీనిని గుర్తుచేస్తూ మీతో పాటు ఈఎన్సీ, ఈఈలకు జనవరి 23వ తారికుల్లో మళ్లీ లేఖలు రాశాం.
  • జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్​ చేయడానికి కాఫర్​డ్యామ్​ అవసరం. దీంతో తాత్కాలిక కాఫర్​డ్యాం ఏర్పాటు చేసి ఏడో బ్లాక్​లో జియోఫిజికల్​ పరిశీలనను మేమే పూర్తి చేశాం. ఇతర బ్లాకులలో జియోఫిజికల్​ ఇన్వెస్టిగేషన్ చేయడానికి తాత్కాలిక అప్రోచ్ రోడ్డు పనులు, తాత్కాలిక కాఫర్​డ్యాం పనులు నడుస్తున్నాయి.
  • ఈ సంవత్సం జూన్​ నుంచి వచ్చే వరదలకు ఏడో బ్లాక్​తో పాటు మొత్తం బ్యారేజీ సురక్షితంగా ఉంటుందా? వరదకు తట్టుకోగలదా? అన్నది డ్యాం యజమానిగా నీటిపారుదలశాఖ పరీక్షించుకొని నిర్ధారించుకోవాలి. నీటిపారుదలశాఖ గత నవంబరు 14న రాసిన లేఖలో ప్రతిపాదించిన కాఫర్​డ్యాం, బ్యారేజీ భద్రతకు సరిపోతుందని భావిస్తే, మేము ఇచ్చిన ఆర్థిక ప్రతిపాదనకు అంగీకారం తెలిపితే ఎల్​అండ్​టీ కాఫర్​డ్యాం వర్క్​ని చేపడుతుంది.

మేడిగడ్డ బ్యారేజ్ అధ్యయనానికి కమిటీ - ప్రభుత్వానికి నీటిపారుదల శాఖ ప్రతిపాదన

అంగీకరిస్తే సర్కార్​దే పూర్తి ఖర్చు : నిర్మాణ సంస్థ బాధ్యత లేదని కాఫర్‌డ్యాంకు అయ్యే ఖర్చుని నీటిపారుదలశాఖ భరిస్తే, దెబ్బతిన్న ఫియర్స్‌తోపాటు ఏడో బ్లాక్‌ పునరుద్ధరణ, ఇంకా ఏమైనా దెబ్బతిని ఉంటే వాటి మరమ్మతులకు అయ్యే మొత్తాన్ని కూడా ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని ఆ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. డిఫెక్ట్‌ లయబిలిటీ పీరియడ్‌లోనే దెబ్బతిన్న ఏడో బ్లాక్‌ మరమ్మతుల గురించి తాము లేఖ రాసినా నిర్మాణ సంస్థ చేయలేదని, దీని ప్రకారం డిఫెక్ట్‌ లయబిలిటీ పీరియడ్‌ పొడిగింపులో ఉన్నట్లేనని నీటిపారుదల శాఖ చెప్పినప్పటికీ, బ్యారేజీ యజమాని నీటిపారుదలశాఖేనని, వచ్చే వరదకు మరింత దెబ్బతింటే తమ బాధ్యత కాదని ఎల్‌అండ్‌టీ స్పష్టం చేసినట్లయింది.

గతేడాది ఏప్రిల్​లో రాసిన లేఖ : 2022 జూన్‌ 28తో తమ డిఫెక్ట్‌ లయబిలిటీ సమయం పూర్తయిందని పేర్కొన్న ఎల్‌అండ్‌టీ సంస్థ, ఏడో బ్లాకులోని 17, 18, 19, 20 వెంట్స్‌కి దిగువన ఏర్పడిన నీటిబుడగలను వెంటనే ఆపడంతోపాటు చెల్లాచెదురైన సీసీ బ్లాకులను ఓ పద్ధతికి తేవాలని, యుద్ధప్రాతిపదికన ఈ పనులు చేపట్టాలని ఆ ఏడాది ఏప్రిల్‌ 28న బ్యారేజీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ తమకు రాసిన లేఖ గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావించకుండా విస్మరించింది.

తాజాగా ఎల్‌అండ్‌టీ రాసిన లేఖ ప్రకారం కూడా ఏడో బ్లాక్‌ మరమ్మతులపై ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ లేఖ రాసిన తేదీ డిఫెక్ట్‌ లయబిలిటీ పీరియడ్‌లోనే ఉంది దాన్ని చూస్తే ఒప్పందం ప్రకారం 2022లోనే ఏడో బ్లాక్‌ మరమ్మతు పనులను చేపట్టాల్సి ఉంది. సంబంధిత ఇంజినీర్లు కూడా ఈ సమస్య లేఖ రాసి చేతులు దులుపుకున్నారు. తర్వాత 2023 అక్టోబరులో బ్యారేజీ కుంగి ఫియర్స్‌ దెబ్బతినగా అప్పుడు ఎలాంటి చర్యలు చేపట్టకుండా, ఇప్పుడు మొత్తం బ్యారేజీ భద్రత గురించి నీటిపారుదలశాఖను హెచ్చరిస్తూ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.

మరో 15 రోజుల్లో మేడిగడ్డ బ్యారేజ్​ ఘటనపై సమగ్ర నివేదిక : విజిలెన్స్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.