ETV Bharat / state

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఎలా వెళ్లాలో తెలుసా? - ఇదిగో రూట్ మ్యాప్ - Sammakka Sarakka Jatara 2024

Medaram Jatara Route Map 2024 : మేడారం సమక్క- సారక్క మహాజాతరకు రంగం సిద్ధమవుతోంది. ఆదివాసీ సంప్రదాయబద్ధంగా నిర్వహించే జనజాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరి వరంగల్, ఇతర ప్రాంతాలనుంచి వచ్చే భక్తులు మేడారానికి ఎలా వెళ్లాలి? తిరుగు ప్రయాణం, పార్కింగ్ సదుపాయాలు, క్యూలైన్లు ఎక్కడెక్కడ తదితర విశేషాలు మీకోసం.

Medaram Jatara 2024
Medaram Jatara 2024
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 19, 2024, 1:54 PM IST

Updated : Feb 19, 2024, 2:29 PM IST

Medaram Jatara Route Map 2024 : వనంలో ఉన్న దేవతలు జనం మధ్యకు వచ్చే శుభ సమయం ఆసన్నమైంది. జంపన్నవాగు జన సంద్రంగా మారే ఘడియలు సమీపిస్తున్నాయి. దట్టమైన అడవులు, కొండకోనల నడమ మేడారం సమ్మక్క- సారక్క జాతర సాగనుంది. వరంగల్‌కు 110 కిలోమీటర్ల దూరంలో ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారంలో కొలువైన వనదేవతలకు రెండేళ్లకోసారి మాఘ మాసంలో పార్ణమికి ముందు ఈ జాతర జరుగుతుంది.

తెలంగాణ కుంభమేళాగా పేరొందిన ఈ మహాజాతరకు పిల్లా పెద్దా అంతా కుటుంబ సమేతంగా కదులుతారు. కోటిమందికిపైగా వచ్చే భక్తులతో మేడారం (Medaram Jatara 2024) భక్తజన సంద్రమవుతుంది. ఈసారి జాతరకోసం తెలంగాణ ప్రభుత్వం రూ.110 కోట్లు వెచ్చించి విస్తృత ఏర్పాట్లు చేసింది. జాతర సజావుగా జరిగేందుకు పోలీసు శాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మరి వరంగల్, ఇతర ప్రాంతాలనుంచి వచ్చే భక్తులు మేడారానికి ఎలా వెళ్లాలి? తిరుగు ప్రయాణం, పార్కింగ్ సదుపాయాలు, క్యూలైన్లు ఎక్కడెక్కడ తదితర విశేషాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మేడారం వెళ్లడానికి వీలు కావడం లేదా? - ఇంట్లో నుంచే వనదేవతలకు బంగారం సమర్పించండిలా

మరోవైపు వనదేవతలు గద్దెలపై ఆగమనానికి నెల రోజుల ముందు నుంచే భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. వ్యయ ప్రయాసలను లెక్కచేయక కుటుంబ సమేతంగా వచ్చి తల్లులను దర్శించుకుంటున్నారు. బంగారంగా కొలిచే బెల్లాన్ని కానుకగా సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. తమ కోరికలు నేరవేర్చితే ఎత్తు బంగారం సమర్పిస్తాం తల్లి అంటూ మొక్కుకుని, అవి తీరిన వెంటనే తమతో సరితూగే బెల్లాన్ని అమ్మవార్లకు ఇస్తుంటారు. తరతరాలుగా ఈ సంప్రదాయం నడుస్తోంది.

Sammakka Sarakka Jatara 2024 : మహాజాతరకు మరో రెండ్రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే లక్షల మంది భక్తులు వనదేవతలను దర్శించుకుంటున్నారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే జంపన్న వాగు నీటితో కళకళలాడుతోంది. ఈనెల 14వ తేదీన అధికారులు లక్నవరం సరస్సు తూములు తెరిచి సద్ది మడుగు చెరువుకు నీటిని వదిలారు. 17వ తేదీన సాయంత్రం సద్దిమడుగు చెరువుతూములు తెరవడంతో దెయ్యాల వాగు మీదుగా ముట్లగూడెం గ్రామాల సమీపంలోని జంపన్న వాగులోకి ప్రవహిస్తూ మేడారం వద్దకు నీళ్లు చేరాయి. నాలుగు చెక్ డ్యామ్‌లలో నీరు నిండేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. జంపన్నవాగులో స్నానాలు చేస్తున్న భక్తులు, వనదేవతల్ని దర్శించుకుంటున్నారు.

జనసంద్రంగా మేడారం జాతర - భక్తులతో కిటకిటలాడుతున్న వనదేవతల గద్దెలు

మరోవైపు మేడారం జాతరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బస్సులను నడిపిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 51 పాయింట్ల నుంచి, ఉమ్మడి వరంగల్​ జిల్లాలో 18 ప్రాంగణాల నుంచి టీఎస్‌ఆర్టీసీ (TSRTC) ప్రత్యేకంగా 6000 బస్సులను నడుపుతోంది. హనుమకొండ జిల్లా పరకాల ఆర్టీసీ డిపో నుంచి భక్తులు మేడారం వెళ్లేందుకు 260 బస్సులను నడపనున్నట్లు డిపో మేనేజర్ రవిచంద్ర తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉండటంతో పరకాల నుంచి మేడారం ప్రయాణించే పురుషులకు పెద్దలకు రూ.250, చిన్న పిల్లలకు రూ.140 టికెట్ ఛార్జీ వసూలు చేయనున్నట్లు రవిచంద్ర వివరించారు.

మరో రెండ్రోజుల్లో మహాజాతర - భక్తులతో జనసంద్రంగా మారనున్న మేడారం

వన దేవతల దర్శనానికి వేళాయే - 'మండమెలిగే'తో మహా జాతరకు సిద్ధమైన మేడారం

Last Updated : Feb 19, 2024, 2:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.