ETV Bharat / state

మహాలక్ష్మీ పథకం మేడారం జాతరకు కూడా వర్తిస్తుంది : డిప్యూటీ సీఎం భట్టి - free ride for women in medaram

Medaram Jatara Free Bus Scheme : మహాలక్ష్మీ పథకం కింద ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళలకు ఫ్రీ బస్సు పథకం మేడారం జాతరకు నడపనున్న ప్రత్యేక బస్సుల్లో వర్తిస్తుందా లేదా అన్న సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో వనదేవతలను దర్శించుకోవడానికి వెళ్లే మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

Special Buses for Medaram Jatara
Medaram Jatara Free Bus Journey
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 27, 2024, 1:49 PM IST

Updated : Jan 27, 2024, 4:21 PM IST

Medaram Jatara Free Bus Scheme : దేశంలోనే ప్రసిద్ధి చెందిన ఆదివాసీ గిరిజన జాతరగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడారం జాతర పేరొందింది. వన దేవతలైన సమ్మక్క, సారలమ్మలను లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటున్నారు. ఫిబ్రవరి 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జరిగే ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలు సహా ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఝార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు.

Medaram Jatara Special Buses : మరోవైపు ఈ జాతరకు మహిళలకు ఉచిత బస్సు పథకం వర్తిస్తుందా? లేదా అనే విషయంపై గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. హాలక్ష్మీ పథకం కింద ప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్రీ బస్సు స్కీం మేడారం జాతరకు కూడా వర్తింస్తుందని స్పష్టం చేశారు.

మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అందిస్తున్న ఆర్టీసీ రానున్న మేడారం, ఇతర జాతరలకు నడిపే ప్రత్యేక బస్సుల్లో ఉచితంగా ప్రయాణాన్ని తొలగించి ఛార్జీలు వసూలు చేస్తామని టీఎస్ఆర్టీసీ ప్రతిపాదించింది. రాష్ట్ర బడ్జెట్‌కు సంబంధించి ఉపముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్కతో ఇటీవల రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఆర్టీసీ ఉన్నతాధికారులు సమావేశమైన సందర్భంగా ఈ విషయం చర్చకు వచ్చినట్లు తెలిసింది. ప్రత్యేక బస్సుల్లో టికెట్లకు డబ్బులు వసూలు చేస్తే సంస్థకు ఆదాయం పెరుగుతుందని ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచినట్లు సమాచారం.

జనసంద్రంగా మేడారం జాతర - భక్తులతో కిటకిటలాడుతున్న వనదేవతల గద్దెలు

Special Buses for Medaram Jatara : అయితే ఈ ప్రతిపాదనను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తిరస్కరించారు. మహాలక్ష్మీ పథకం కింద ప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్రీ బస్సు పథకం మేడారం జాతరకు కూడా వర్తిస్తుందని స్పష్టం చేశారు. దేవతలను దర్శించుకోవడానికి ఉచితంగా బస్సులో ప్రయాణం చేయవచ్చని స్పష్టం చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణం విధానాన్ని అమలు చేయాల్సిందేనని, మేడారం సహా ఏ జాతరకైనా మహిళా ప్రయాణికుల నుంచి టికెట్‌ ఛార్జీలను వసూలు చేయవద్దని తెలిపారు. ఆ ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు.

మేడారం జాతరకు రెండువేల ఆర్టీసీ బస్సులు : మంత్రి సీతక్క

మేడారం జాతరకు కోటి మందికి పైగా భక్తులు తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికోసం ఆర్టీసీ ప్రత్యేకంగా 6,000 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి రెండు వేల సిటీ బస్సులను పంపించే దిశగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ బస్సుల్లో మహిళలందరికీ ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

జనసాగరంగా మేడారం జాతర - రెండు రోజుల్లో లక్షకు పైగా భక్తులు

ఫిబ్రవరి 21 నుంచి మేడారం మహా జాతర - ఏర్పాట్ల కోసం రూ.75 కోట్ల నిధుల విడుదల

Last Updated : Jan 27, 2024, 4:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.