Medaram Jatara 2024 : సాధారణంగా ఏదైనా దూర ప్రాంతాలకు బయలుదేరితే జాతీయ రహదారుల వెంట దాదాపు 50 కిలోమీటర్ల పరిధిలో ఒక టోల్‌గేట్ ఉంటుంది. కానీ మేడారంలో సమ్మక్క, సారలమ్మ (Sammakka Saralamma Jatara 2024) వనదేవతలను దర్శించుకునేందుకు వాహనాల్లో వచ్చే భక్తుల నుంచి టోల్‌తో పాటు పర్యావరణ ఛార్జీ, పార్కింగ్ రుసుములు కూడా వసూలు చేస్తున్నారు. దీంతో భక్తులు 45 కిలోమీటర్ల పరిధిలోనే మూడు చోట్ల ఛార్జీలు చెల్లించాల్సి వస్తోంది.
Medaram Jatara Toll Charges 2024 : మేడారం మహాజాతర ఫిబ్రవరి 21న ప్రారంభమవుతుంది. ఇప్పటికే నిత్యం వేల మంది అమ్మవార్ల దర్శనానికి తరలివస్తున్నారు. వన దేవతలు సమక్క, సారలమ్మను దర్శించుకోని మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో భారీగా ప్రైవేట్ వాహనాలు మేడారానికి వరుస కడుతున్నాయి.
Medaram Jatara Parking Fee : ఈ క్రమంలో పార్కింగ్, టోల్ రుసుములతో పాటు అటవీశాఖ ఈసారి ప్రత్యేక తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణ ఛార్జీలు వసూలు చేస్తోంది. వన్యప్రాణుల రక్షణకు వినియోగించేందుకు, అటవీ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ఈ రుసుమును వసూలు చేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలియజేస్తున్నారు. కానీ ఇదేం బాదుడంటూ భక్తులు అసంతృప్తికి గురవుతున్నారు.
మేడారం సమక్క సారలమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు - తల్లులకు ముందస్తు మొక్కులు
పస్రా, ఏటూరునాగారం, తాడ్వాయిలలో తనిఖీ కేంద్రాలు : దాదాపు సంవత్సరం క్రితం ఏటూరునాగారం అభయారణ్యం పరిధిలోని మూడు మార్గాల్లో తాడ్వాయి ,పస్రా, ఏటూరునాగారంలో అటవీశాఖ తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వాటి వద్ద పర్యావరణ పరిరక్షణ ఛార్జీల కింద భారీ వాహనానికి రూ.200, లైట్ మోటార్ హెహికిల్‌కు రూ.50 చొప్పున వసూలు చేస్తోంది. ఇందుకుగాను రశీదును కూడా ఇస్తోంది. ప్రభుత్వ వాహనాలకు, స్థానిక వాహనాలకు మినహాయింపు ఉంది.
వరంగల్ నుంచి మేడారం వెళ్లేవారి నుంచి వారి వాహన స్థాయిని బట్టి ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం జవహర్‌నగర్ వద్ద జాతీయ రహదారిలో రూ.100 నుంచి రూ.200 వరకు టోల్ వసూలు చేస్తున్నారు. అక్కడి నుంచి తాడ్వాయి లేదా పస్రా వద్ద అటవీశాఖ ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రంలో ప్రవేశ రుసుం చెల్లించాలి. మరోవైపు మేడారంలో పంచాయతీ సిబ్బంది పార్కింగ్ ఛార్జీ వసూలు చేస్తున్నారు. వరంగల్ నుంచి వచ్చేవారు ఈ మూడుచోట్ల ఇలా రుసుములు చెల్లించాల్సి వస్తోంది. హైదరాబాద్ నుంచి వచ్చే వారికి మరో మూడు టోల్‌గేట్లు ఉంటాయి.
జనసంద్రంగా మేడారం జాతర - భక్తులతో కిటకిటలాడుతున్న వనదేవతల గద్దెలు
జాతర పూర్తయ్యే వరకైనా : మరోవైపు జాతరకు (Medaram Jatara 2024 ) పెద్ద ఎత్తున వాహనాలు వస్తుంటాయి. తనిఖీ కేంద్రాల వద్ద ట్రాఫిక్ సమస్యలు ఉత్పనమయ్యే ప్రమాదం ఉంది. జాతర పూర్తయ్యే వరకైనా టోల్ వంటి వాటిని నిలిపివేస్తే తమకు కాస్త ఊరట కలుగుతుందని భక్తులు కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి టోల్ వసూలుపై తగు నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
జనసాగరంగా మేడారం జాతర - రెండు రోజుల్లో లక్షకు పైగా భక్తులు
మహాలక్ష్మీ పథకం మేడారం జాతరకు కూడా వర్తిస్తుంది : డిప్యూటీ సీఎం భట్టి