Toopran Sub Registrar Arrest in Illegal Registration : మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కూచారం గ్రామంలోని వెయ్యి గజాల స్థలానికి సంబంధించిన ఫేక్ రిజిస్ట్రేషన్ ఘటనలో గతంలో నలుగురితో సహా, తాజాగా సబ్ రిజిస్ట్రార్‌తో కలిపి మొత్తం 9 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినున్నట్లు ఎస్ఐ కరుణాకర్ రెడ్డి తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం, హైదరాబాద్‌కు చెందిన మల్లవరపు అరుణ్ కుమార్ అనే వ్యక్తి మరో 8 మందితో కలిసి నగరంలోని మోతీనగర్‌కు చెందిన సురావజ్జుల సత్యనారాయణ, అతని భార్య స్వాతికి మండలంలోని కూచారం శివారులోని సర్వే నెం. 225, 226లో వెయ్యి గజాల స్థలాన్ని రూ.80 లక్షలకు నకిలీ పత్రాలు సృష్టించి విక్రయించారు. అప్పటికే ఆ భూమి అసలు యజమాని దుర్గ అనే మహిళ పేరిట రిజిస్ట్రేషన్ జరిగింది.
Illegal Registration Sub-Registrar Arrested : అయితే నిందితులు హైదరాబాద్ రాంనగర్‌కు చెందిన లక్ష్మీ అనే మహిళకు డబ్బు ఎర చూపి, తన ఆధార్ కార్డును దుర్గగా మార్ఫింగ్ చేసి సత్యనారాయణ అతని భార్య స్వాతిలకు లక్ష్మీ చేత అక్రమ రిజిస్ట్రేషన్ చేశారు. సత్యనారాయణ మూర్తి లింక్ డాక్యుమెంట్ కోసం ఆరా తీయగా, అమ్మిన వ్యక్తులు పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో, సందేహం వచ్చింది.
తాము కొనుగోలు చేసిన ప్లాట్ దగ్గరకు వెళ్లగా, ఆ స్థలం వేరే వ్యక్తుల పేరుతో బోర్డు ఉండటంతో, అసలు విషయం బయటపడింది. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సత్యనారాయణ గత నెలలో పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టిన పోలీసులు పిట్ల సాయి కుమార్, వేముల ప్రభాకర్, నంగునూర్ లక్ష్మీ, డాక్యుమెంట్ రైటర్, తూప్రాన్ సబ్ రిజిస్ట్రార్ సనత్‌నగర్ రమణలను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.
పిల్లల పార్క్ స్థలం అక్రమ రిజిస్ట్రేషన్ - ఆందోళనకు దిగిన కమ్యునిటీ వాసులపై దౌర్జన్యం