ETV Bharat / state

గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో అభివృద్ధే లక్ష్యంగా మాస్టర్ ప్లాన్-2050 - HMDA development news

Master Plan-2050 A Vision Document : రాష్ట్ర రాజధాని భాగ్యనగరంతో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్న కాంగ్రెస్​ ప్రభుత్వం ఆ దిశగా దృష్టి సారించింది. మాస్టర్​ ప్లాన్​-2050 పేరుతో విజన్​ డాక్యుమెంట్​ రూపొందించాలని రేవంత్​ రెడ్డి అధికారులను ఆదేశించారు.

Master Plan-2050 Vision Document
Master Plan-2050 Vision Document
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 28, 2024, 5:03 PM IST

Master Plan-2050 Vision Document : మాస్టర్ ప్లాన్-2050కి అనుగుణంగా విజన్ డాక్యుమెంట్ రూపొందించాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో అభివృద్ధే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా దృష్టి సారించింది. ఈ మేరకు సచివాలయంలో హెచ్​ఎమ్​డీఏ (HMDA)తో పాటు రాష్ట్ర మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు, త్వరలోనే నిర్మించబోయే రీజినల్‌ రింగ్‌ రోడ్డు పరిసరాలతో పాటు ఈ 2 ప్రాంతాల అభివృద్ధిపై అధికారులతో సీఎం చర్చించారు.

తెలంగాణ అభివృద్దికి మెగా మాస్టర్ ప్లాన్ - 2050 విజన్ దిశగా ముందుకు : సీఎం రేవంత్​రెడ్డి

HMDA : రీజినల్‌ రింగ్‌ రోడ్డు పూర్తయ్యాక అక్కడి వరకు ఉన్న ప్రాంతాలన్నింటిన హెచ్​ఎమ్​డీఏ (HMDA) పరిధిలోకి తీసుకు రావాలని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో ఆ దిశగా సీఎం దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. ఓఆర్​ఆర్​ (ORR) లోపలి ప్రాంతాలను ఒకే యూనిట్‌గా తీసుకుని అభివృద్ధి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. హైదరాబాద్‌ వెస్ట్‌, ఈస్ట్‌ అనే తారతమ్యాలుండకుండా నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా అభివృద్ధి జరిగేలా ఒకే ప్రణాళికలు రచించాలని తెలిపారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి నుంచి రీజినల్‌ రింగ్‌ రోడ్డు వరకు రేడియల్ రోడ్లకు ప్రణాళికలు చేయాలని సూచించారు. 2050 మాస్టర్‌ ప్లాన్‌, హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల అభివృద్ధిపై మరిన్ని కీలక అంశాలు సమీక్షలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది.

CM Revanth Reddy : తెలంగాణ అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్ తీసుకువస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) గతంలో వెల్లడించారు. త్వరలో 2050 విజన్‌ దిశగా ముందుకు వెళ్తున్నామని చెప్పిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌ ప్రపంచంతో పోటీ పడుతోందని, పెట్టుబడులకు అనువైన ప్రాంతమని స్పష్టం చేశారు. గత ముప్పై ఏళ్లలో రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ, నగర అభివృద్ది కొనసాగిందని రేవంత్ రెడ్డి వివరించారు.

ఏపీపై ఓ కన్నేసి ఉంచండి - వేస‌విలో తాగునీటి సమస్య రావొద్దు : సీఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో రీజినల్ రింగ్ రోడ్డును త్వరలోనే తీసుకువస్తామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రింగ్ రోడ్డు చుట్టూ మెట్రో రైల్‌ సదుపాయం కూడా కల్పిస్తామని హమీ ఇచ్చారు. తెలంగాణ అభివృద్దికి మెగా మాస్టర్ ప్లాన్ తీసుకువస్తున్నామని చెప్పారు. త్వరలో 2050 విజన్ దిశగా తాము ముందుకు వెళ్లనున్నట్లు తెలిపారు. అర్బన్, రూరల్ తెలంగాణను అభివృద్ధి చేస్తామని రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ నగరం ప్రపంచంతో పోటీ పడుతోందని, ఇక్కడ పెట్టుబడులకు అనువైన ప్రాంతమని, అందుకే మహానగరాన్ని అర్బన్, సెమీ అర్బన్, రూరల్‌ మూడు భాగాలుగా అభివృద్దిలో ముందుకు తీసుకెళ్తామని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

గృహజ్యోతి, గ్యాస్ సిలిండర్ పథకాలు ఈనెల 27 లేదా 29న ప్రారంభం

సర్కారీ లే అవుట్లు - ఔటర్‌ చుట్టూ 924.28 ఎకరాల్లో అభివృద్ధికి ప్రభుత్వం సన్నాహాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.