ETV Bharat / state

సైన్స్​ ల్యాబ్​లో ఆకతాయి ప్రయోగం - 25 మంది విద్యార్థులకు అస్వస్థత - Bapatla Kendriya Vidyalaya Accident

Bapatla Kendriya Vidyalaya Accident : ఆంధ్రప్రదేశ్​ బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ విద్యార్థి పిల్లచేష్టలు 25 మంది సహచరుల్ని అస్వస్థతకు గురి చేసింది. తరగతి గదిలో టీచర్‌ లేని సమయంలో ఇంటి నుంచి తెచ్చిన కొన్ని పదార్థాలను రసాయానాలను కలపడంతో వాయువులు వ్యాపించి పిల్లలు సొమ్మసిల్లి కింద పడిపోయారు. ప్రస్తుతం అందరూ కోలుకుంటున్నారు.

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 24, 2024, 3:06 PM IST

Updated : Aug 24, 2024, 10:57 PM IST

Toxic Gases Released in Science Lab at Bapatla
Bapatla Kendriya Vidyalaya Accident (ETV Bharat)

Toxic Gases Released in Science Lab at Bapatla : ఏపీలోని బాపట్ల జిల్లా సూర్యలంక వాయుసేనా కేంద్రం ఆవరణలోని కేంద్రీయ విద్యాలయలో 25 విద్యార్థులు అస్వస్థతకు గురికావడం తీవ్ర కలకలం రేపింది. స్కూల్​లోని సైన్స్‌ ఉపాధ్యాయురాలు సుజాత క్లోరోఫిల్‌ ఆమ్లం, నిమ్మ ఉప్పుతో ఓ ప్రయోగాన్ని విద్యార్థుల ఎదుట ప్రదర్శించారు. ఆమె బయటకు వెళ్లగానే నవ్య శ్రీ అనే విద్యార్థిని కాఫీపొడితో పాటు సాల్ట్​, శానిటైజర్, పంచదారను ఉపాధ్యాయురాలు తయారు చేసిన మిశ్రమానికి కలిపారు. దీంతో వాయువులు ఆరో తరగతి గదితో పాటు ఎదురుగా ఉన్న ఏడో క్లాస్​ గదిలోకి వ్యాపించాయి.

విషవాయువులు పీల్చిన 25 మంది విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. పలువురు స్పృహ తప్పారు. వెంటనే అప్రమత్తమైన టీచర్లు వాయుసేనా కేంద్ర ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం బాపట్ల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులకు చికిత్స అందిచడంతో 23 మంది కోలుకున్నారు. ఒక విద్యార్థి షణ్ముఖకు గుండె సమస్య ఉన్నట్లు ఈసీజీలో డాక్టర్లు గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం షణ్ముఖను గుంటూరులోని ఆస్పత్రికి అధికారులు తక్షణమే తరలించారు. మరో విద్యార్థిని మాధురికి ఫీవర్ రావడంతో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.

విద్యార్థులను పరామర్శించిన అదనపు కలెక్టర్‌ : టాక్సిక్ గ్యాస్ వెలువడటానికి కారణమైన మిశ్రమాన్ని విద్యాలయ ప్రిన్సిపల్‌ వైద్యశాల సూపరింటెండెంట్‌ సిద్ధార్థకు అందజేశారు. కెమికల్ మిశ్రమాన్ని పరీక్షల నిమిత్తం గుంటూరులో ప్రయోగశాలకు పంపించారు. జాయింట్‌ కలెక్టర్‌, బాపట్ల తహసీల్దార్‌ ఆస్పత్రికి వచ్చి స్టూడెంట్స్​ను పరామర్శించారు. సూర్యలంక వాయుసేనా కేంద్రం కమాండర్, గ్రూప్‌ కెప్టెన్‌ శ్రీవాస్తవ ప్రాంతీయ ఆసుపత్రికి వచ్చి సూపరింటెండెంట్‌ సిద్ధార్థతో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఏపీ సీఎం చంద్రబాబు ఆరా : ఈ ఘటనపై సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. అధికారులతో మాట్లాడి పిల్లల ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రాణాపాయం లేదని ఆఫీసర్లు సీఎంకు తెలిపారు. పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ ఆదేశించారు.

"నవ్య శ్రీ సాల్ట్, శానిటైజర్, పంచదార కాఫీపొడి ఇంటి దగ్గర నుంచి తీసుకువచ్చి మిశ్రమంలో కలిపింది. దీంతో ల్యాబ్​లో పొగలు వ్యాపించాయి. ఆ పొగ పీల్చడంతో మేము వాంతులు చేసుకున్నాం. అక్కడే కళ్లు తిరిగి కింది పడిపోయాం. మా టీచర్లు ఆస్పత్రికి తీసుకువచ్చారు." - విద్యార్థులు

ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్​ పాయిజన్ - 24 మంది విద్యార్థులకు అస్వస్థత

అనారోగ్యాల బారిన పడుతున్న గురుకుల విద్యార్థులు - ఒక్క రోజులోనే ముగ్గురికి అస్వస్థత - Gurukul Students illnesses

Last Updated : Aug 24, 2024, 10:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.