Mangalagiri Court 14 Days Remand for Former YCP MP Nandigam Suresh : వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ మరిన్ని చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న నందిగం సురేశ్ ప్రస్తుతం వెలగపూడిలో మరియమ్మ అనే మహిళ హత్య కేసును కూడా ఎదుర్కొంటున్నారు. తాజాగా ఈ మహిళ హత్య కేసులో నందిగం సురేశ్ ను పోలీసులు మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు సురేశ్ కు 14 రోజుల రిమాండ్ విధించింది.
2020లో రెండు వర్గాల మధ్య ఘర్షణ : బాపట్ల మాజీ ఎంపీ నందిగం సరేష్ ను హత్య కేసులో తుళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు. 2020లో వెలగపూడిలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో మరియమ్మ అనే మహిళ మరణించింది. అప్పట్లో ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేశారు. అప్పట్లో ఎంపీ నందిగం సురేష్ పేరును కూడా కేసులో చేర్చారు. అయితే వైఎస్సార్సీపీ అధికారంలో ఉండటంతో కేసు విచారణ ముందుకు సాగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు విచరాణ ప్రారంభమైంది.
బెయిల్ వచ్చినా విడుదల కాలేదు : టీడీపీ కార్యాలయంలపై దాడి కేసులో అరెస్టైన నందిగం సురేష్ ప్రస్తుతం గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్ కు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే పీటీ వారెంట్ పెండింగ్లో ఉండటంతో సురేష్ విడుదల కాలేదు. ఆయన్ను వెలగపూడిలో మరియమ్మ హత్య కేసులో అరెస్టు చేసేందుకు తుళ్లూరు పోలీసులు మంగళగిరి కోర్టులో పీటీ వారెంట్ కోసం దరఖాస్తు చేశారు. మంగళగిరి న్యాయస్థానం పీటీ వారెంట్ కు అనుమతించడంతో తుళ్లూరు పోలీసులు ఇవాళ నందిగం సురేష్ ను గుంటూరు జిల్లా జైలు నుంచి తరలించారు. మంగళగిరి న్యాయస్థానంలో నందిగం సురేష్ ను ప్రవేశ పెట్టారు. తాజాగా న్యాయస్థానం ఈనెల 21 వరకు ఆయనకు రిమాండ్ విధించింది.
నందిగం సురేష్ అక్రమ భవన నిర్మాణం- హైకోర్టులో విచారణ వాయిదా - HC On Nandigam Suresh Building
పరారీలో మాజీ ఎంపీ నందిగం సురేష్- ఫోన్ స్విచాఫ్, గాలిస్తున్న పోలీసులు - Nandigam Suresh Escaped