Mandu Babu Funny Video at Machilipatnam Government Hospital in AP : తాగినప్పుడు కొంతమంది అస్సలు కంట్రోల్ లో ఉండరు. వారు ఏం చేస్తున్నారో కూడా వారికే తెలియదు. ఎవరి మీదకి పడితే వారి మీదకు గొడవకు వెళుతూ ఉంటారు. ఏది పడితే అది మాట్లాడుతుంటారు. వారు చెప్పిందే నిజం, ఇతరులు ఎంత మెుత్తుకొని చెప్పిన వినరు. ఆ పరిస్థితుల్లో వారు చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇలాంటి ఘటనలు చూసేందుకు సరదాగా ఉంటాయి. మత్తులో ఉన్న వారి విచిత్ర ప్రవర్తనను చూసి నవ్వుకున్న వారెెందరో.
రెడ్ వైన్ Vs వైట్ వైన్ - వీటి మధ్య తేడాలు మీకు తెలుసా? - Red Wine Vs White Wine
ఫుల్లుగా మద్యం కొట్టి వింత వాగుడు వారే వారిని తిట్టలేెం, కొట్టలేెం. ఎందుకంటే ఈ రెండు చేసినంత మాత్రాన వారి హంగామా మాత్రం తగ్గదు. తాగిన మత్తు పూర్తిగా వదిలిన తరువాతకానీ చేసిన తప్పు బోధపడదూ! ఇలాంటి సంఘటనలు మన చూట్టూ పక్కల తరచూ చూస్తునే ఉంటాం. తాజాగా అచ్చం ఇలాంటి సంఘటనే ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చోటుచేసుకుంది. ఓ మందుబాబు చేసిన హల్చల్ అంత ఇంతా కాదు. అతడి వీరంగానికి ఆసుపత్రి సిబ్బందే హడలెత్తిపోయారు.
అసలేం జరిగిందంటే : మద్యం మత్తులో ఓ వ్యక్తి మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాడు. తన వెంట తీసుకువచ్చిన కుక్క పిల్లను చూపించి నా పిల్లికి వైద్యం చేయ్యాలంటూ అక్కడి ఆసుపత్రిలోని క్యాజువాలిటీ వార్డు వద్ద హంగామా చేశాడు. అది పిల్లి కాదు మహాప్రభో కుక్క అని సిబ్బంది ఎంత మొత్తుకున్నా సదరు తాగుబోతు, ఇక్కడ వైద్యం చేయాల్సిందే అంటూ పట్టుబట్టాడు. ఇక్కడ మనుష్యులకు వైద్యం చేస్తారని, నీవు అంటున్న ఆ పిల్లిని వెంటనే పశు వైద్యాశాలకు తీసుకువెళ్లాలని సిబ్బంది సూచించారు. వారి మాటలను లెక్క చేయని మందుబాబు తాగింది మీర లేక నేనా చెబితే వినరా? అంటూ వారితోనే వాగ్వాదానికి దిగాడు. వెంటనే నా పిల్లికి వైద్యం చేయాలంటూ పట్టుపట్టాడు. ఎంత చెప్పిన వివకుండా ఆసుపత్రి వద్ద హల్చల్ చేశాడు.
అంతేగాక చూడండి నా చేతిలో ఉన్నది పిల్లి అంటూ అందరికి చూపించాడు. ఆసుపత్రి సిబ్బందితో పాటు అక్కడ ఉన్నవారు సైతం అది కుక్క అని ఎంత వాదిస్తున్నా అతను మాత్రం ఒప్పుకోలేదు. ఆ మద్యం మత్తులో అతను విచిత్ర ప్రవర్తనని చూసి అక్కడి వారు సరదాగా నవ్వుకున్నారు. అతడితో వాగ్వాదం చేస్తున్న వ్యక్తికి మాత్రం కోపం కట్టెలు తెచ్చుకుంది. అయినా సదరు మందుబాబు మాత్రం పంతం విడువలేదు. చివరికి చేసేదేమి లేక ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు అతడికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించి వేశారు. ప్రస్తుతం ఈ సంఘటన నెట్టింట వైరల్ అవుతుంది.
రూ.1.83 కోట్ల విలువైన అక్రమంగా తరలిస్తున్న మద్యం ధ్వంసం - police destroyed illegal liquor