ETV Bharat / state

శభాష్ - అభాగ్యులకు ఆత్మ బంధువు 'మన ఇల్లు'

అవ్వ, తాతలకు అండగా ఉంటున్న సత్యనారాయణ - చిరు ఉద్యోగం చేస్తూనే సామాజిక సేవ కార్యక్రమాలు

manaillu_old_age_home
manaillu_old_age_home (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 23, 2024, 10:04 PM IST

Mana Illu Old Age Home Launched by Kakinada District Youngster : కన్నవారినే పట్టించుకోని వాళ్లు ఉన్న ఈ రోజుల్లో కష్టాల్లో ఉన్న ప్రతి అవ్వ, తాతలకు ఆత్మ బంధువు అవుతున్నాడు ఆ యువకుడు. చేసేది చిన్న ఉద్యోగమే అయినా సేవలో పెద్ద మనసు చాటుకుంటున్నాడు. "మన ఇల్లు" అంటూ వినూత్న ఆశ్రమం కల్పించి సహృదయంతో పెద్దలకు సేవలు చేస్తున్నాడు. సేవే అసలైన అభిమతం, మానవత్వం అంటున్న కాకినాడ యువకుడు సత్యనారాయణ స్ఫూర్తి కథ ఇది.

సేవ చేయాలన్న తపన ఉండేలే కానీ ఆదాయంతో పని లేదని నిరూపిస్తున్నాడీ యువకుడు. దిక్కులేని స్థితిలో ఆసుపత్రుల్లో, రోడ్లపై పడి ఉన్న పెద్దవాళ్లను ఆదుకున్నాడు. మిత్రులు, తెలిసిన వారి సాయంతో వృద్ధులకు ఆశ్రమం ఏర్పాటు చేసి అండగా నిలబడ్డాడు. ఎన్నో అవాంతరాలు, సవాళ్లు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని ధైర్యంగా నిరాశ్రయులకు సేవలు అందిస్తున్నాడు.

'అద్వితీయ 2024' - సందడి చేసిన విద్యార్థినులు - వివిధ రంగాల్లో నైపుణ్య ప్రదర్శన

కాకినాడ జిల్లా తిమ్మాపురానికి చెందిన ఆ యువకుడి పేరు వీర వెంకట సత్యనారాయణ. మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో పుట్టి కుటుంబ పోషణ కోసం ఓ కొరియర్ సంస్థలో చిరుద్యోగిగా పని చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి సమాజ సేవ చేయడం ఇష్టం. తరగతి గదుల్లో ఉపాధ్యాయులు చెప్పే సామాజిక అంశాలు స్ఫూర్తి కల్పించేలా ఇతడిని ప్రేరేపించాయి.

ఓ రోజు మిత్రుడు ఇచ్చిన సమాచారం మేరకు కాకినాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు సత్యనారాయణ. అక్కడ ఓ వృద్ధురాలు అనారోగ్య సమస్యతో ఇబ్బందులు పడుతోంది. బాగోగులు చూసుకోవడానికి ఎవ్వరూ లేరు. విషయం తెలుసుకుని చలించిపోయాడు సత్యనారాయణ. ఆమెకు తనవంతు సాయం చేసినా అప్పటికే ఆరోగ్యం విషమించడంతో చనిపోయింది. ఆ సమయంలో అనాథగానే వెళ్లిపోతున్నాను అన్న ఆ వృద్ధురాలు మాటలు సత్యనారాయణను కదిలించాయి.

"ఓ ఆస్పత్రిలో వృద్ధురాలు చనిపోయే ముందు ఎలా బతికిన చివరికీ వృద్ధాశ్రమంలోనే చనిపోతున్న అని నాతో చెప్పింది. ఆమె బాధను చూశాకే నాకీ మన ఇల్లు పెట్టాలనే ఆలోచన వచ్చింది. అవ్వ తాతలు వృద్ధశ్రమంలో ఉంటున్నామనే ఆలోచన రాకుండా సొంత ఇంటిలో ఉంటున్నట్లు ఇక్కడ ఏర్పాట్లు చేశాం. స్నేహితులు, తెలిసిన వారు అండగా నిలబడుతున్నారు. దాతలు, ప్రభుత్వం స్పందించి ఆర్థిక సాయం చేస్తే మరింత మందికి సేవ చేస్తా" - సత్యనారాయణ, మన ఇల్లు నిర్వాహకుడు

అభాగ్యులు, నిరాశ్రయుల కోసం ఆశ్రమాన్నే నెలకొల్పాలనుకున్నాడు సత్యనారాయణ. కానీ, చిరుద్యోగిగా పని చేస్తున్న తనకి అది పెద్ద సవాల్‌. దాంతో తనలాంటి ఆలోచనలున్న ఫ్రెండ్స్‌, సన్నిహితులకు వృద్ధాశ్రమం గురించి వివరించారు. వాళ్లు సానుకూలంగా స్పందించి అండగా నిలవడంతో ఆశ్రమం ఏర్పాటు చేశాడు.

కాకినాడ జిల్లా పెద్దాపురంలోని దర్గా సెంటర్ సాయిబాబా గుడి వీధిలోకి రాగానే ఈ పెద్ద పెంకుటిల్లు దర్శనమిస్తుంది. గేటు తీసి లోపలికి వెళ్లగానే పచ్చటి మొక్కలు ఆహ్లాదం పంచుతాయి. ఆ పొదరింటిలోనే 32 మంది వృద్ధులు సంతోషంగా జీవిస్తున్నారు. అనాథాశ్రమం, వృద్ధాశ్రమం అనే భావన కలగకుండా మన ఇల్లు అంటూ ఆశ్రమానికి పేరు పెట్టి ప్రేమగా చూసుకుంటున్నాడు ఈ సహృదయుడు.

ఐడియా అదుర్స్​ - హైడ్రోజన్‌తో నడిచే హైబ్రిడ్​ స్కూటీ ఆవిష్కరణ - Hybrid Bike Runs with Hydrogen

స్నానాలు, ఆసుపత్రులకు తీసుకెళ్లి వైద్య సేవలు అందించడం, రోజు వారీ అవసరాలు తీర్చడం ఇలా ఎన్నో రకాలుగా అభాగ్యులుగా ఆదుకుంటున్నాడు సత్యనారాయణ. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అన్నితానై చూసుకుంటున్నాడని ఆశ్రయం పొందుతున్న పెద్దలూ చెబుతున్నారు. సత్యనారాయణ చేస్తున్న సేవ కార్యక్రమాలను గుర్తించి దాతలు సాయం చేస్తుంటే సన్నిహితులు అండగా ఉంటున్నారు. నిర్విరామంగా 'బాధ్యత' పౌండేషన్‌ని నడిపిస్తున్నాడని ప్రజలూ ప్రశంసిస్తున్నారు.

అయిన వాళ్ల వద్దనుకునే వదిలేస్తే బాధ్యతగా తీసుకుని అక్కున చేర్చుకుంటున్నాడు సత్యనారాయణ. పెద్దలను చిన్నపిల్లలుగా చూస్తూ అన్ని అవసరాలు తీర్చుతున్నాడు. ప్రభుత్వం లేదా దాతలు సాయం అందిస్తే మరింతమందికి సేవ చేస్తానని చెబుతున్నాడు ఈ యువకుడు.

ఎలక్ట్రికల్ వాహనా​లలో బ్యాటరీ పేలుళ్లకు చెక్ - సరికొత్త ఏఐ ఈ-బైక్ తయారుచేసిన విట్​ విద్యార్థులు - E Bike Designed by Prayana Startup

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.