ETV Bharat / state

మంటగలిసిన మానవత్వం - అందరు చూస్తుండగానే తమ్ముడిని కొట్టి చంపిన అన్నలు - LAND DISPUTE KILLED A MAN - LAND DISPUTE KILLED A MAN

Man Was Killed in Land Issue in Narayanpet : నాట్ల పాటలు వినిపించే గట్టుపై చావు కేకలు మార్మోగాయి. నారుపోసి నీరు పెట్టాల్సిన పొలంలో, నెత్తురు ఏరులై పారింది. హలం పట్టి దుక్కి దున్నాల్సిన చేతులే, కనికరం లేకుండా ప్రాణం తీశాయి. భూమి కోసం తలెత్తిన గొడవలో విచక్షణ కోల్పోయిన అన్నదమ్ములే కిరాతకులుగా మారారు. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నా కనికరం లేకుండా తోడబుట్టిన వాడి ఆయువు తీశారు. ఈ విషాద ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది.

Man Killed in Land Issue in Narayanpet
Man Killed in Land Dispute in Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 14, 2024, 2:00 PM IST

Man Was Killed in Land Dispute in Telangana : డబ్బుపై ఆశతో మానవ సంబంధాలను మంటగలుపుతున్నారు అనడానికి ఈ ఘటన ఒక నిదర్శనం. భూమి కోసం కుటుంబ విలువలు మరచి, విచక్షణా రహితంగా దాడి చేశారు. కొట్టొద్దని కాళ్లావేళ్లా పడినా కనికరించలేదు. తన భర్తపై దెబ్బపడొద్దని తాను అడ్డం పడినా వదిలిపెట్టలేదు. కేవలం భూమిలో సాగుకు పని మొదలు పెట్టినందుకే ఇంతటి దారుణానికి ఒడిగట్టారు. కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నా కర్రలతో దాడి చేసి ఏకంగా ప్రాణాలే తీశారు ఆ అన్నదమ్ములు. ఓ కుటుంబానికి పెద్ద దిక్కును దూరం చేశారు.

నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలంలోని చిన్నపొర్ల గ్రామంలో భూ తగాదాలు ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. గ్రామానికి చెందిన గువ్వల సంజప్ప ఉపాధి కోసం హైదరాబాద్‌లో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల ఉన్న పొలం సాగు చేసుకునేందుకు సొంతూరికి వెళ్లాడు. అయితే తమకున్న నాలుగున్నర ఎకరాల భూమికి సంబంధించి అన్నదమ్ముల మధ్య వివాదం కొనసాగుతోంది. రెండేళ్లుగా తమ దాయాదాలతో భూమి విషయమై గొడవ జరుగుతోంది.

సాగు మొదలెట్టినందుకు సంపేశారు : ఇదే అంశంపై సంజప్ప పోలీసులను ఆశ్రయించగా, సివిల్​ కేసు కావడంతో కోర్టుకు వెళ్లాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే గురువారం పొలానికి వెళ్లిన సంజప్ప, విత్తులు నాటేందుకు ప్రయత్నించాడు. గమనించిన దాయాదులు అక్కడికి చేరుకుని గొడవ చేశారు. సంజప్పతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే నలుగురైదుగురు ఒకేసారి కర్రలతో విచక్షణ మరిచి సంజప్పపై దాడి చేశారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడని, ఆయనను కొట్టొద్దని స్థానికులు అడ్డుకున్నా వదలకుండా చితకబాదారు.

Land disputes at Kumuram Bheem Asifabad : భూతగాదాలతో ప్రత్యర్థుల దాడిలో ఇద్దరు మృతి

చట్టపరంగా తేల్చుకోకుండా దాడులకు ఎగబడి : తీవ్ర గాయాలైన సంజప్పను స్థానికులు, కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే తీవ్ర గాయాలు కావటంతో పరిస్థితి విషమించి, చికిత్స పొందుతూ సంజప్ప ప్రాణాలు విడిచాడు. భూ తగాదాలో ప్రాణాలు పోయేలా సంజప్పపై దాడి చేయటం విమర్శలకు దారితీసింది. పొలం ప్రస్తుతం హత్యకు గురైన సంజప్ప పేరునే ఉందని, అయినా చట్టపరంగా తేల్చుకోకుండా కిరాతకంగా వ్యవహరించి ప్రాణం తీశారని కుటుంబసభ్యులు వాపోయారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

ప్రాణాల మీదకు తెచ్చిన ఆస్తి తగాదాలు.. సోదరులు వేధిస్తున్నారని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ప్రాణాలను హరిస్తోన్న భూ వివాదాలు.. పెరుగుతున్న నేరాల తీవ్రత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.