Man was Burnt Alive in Bomb Blast at Medchal : పరిశ్రమలో బాంబ్ బ్లాస్టింగ్ జరిగి ఓ కార్మికుడు సజీవ దహనమైన ఘటన మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ఘటన సోమవారం జరగగా కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ బాంబ్ బ్లాస్టింగ్ ఘటనలో ఇంకా ఎవరికైనా ఏమైనా జరిగిందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మల్కాజిగిరిలోని కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని అంకిరెడ్డి పల్లి గ్రామ శివారులోని సాల్వో ఎక్సోజివ్స్ పరిశ్రమలో బిహార్‌కు చెందిన సోనూకుమార్ కార్మికుడు పని చేస్తున్నాడు. సాల్వో బాంబుల పరిశ్రమలో అతడు విధులు నిర్వర్తిస్తున్నాడు. విధులు నిర్వహిస్తున్న క్రమంలో సెప్టిక్ ఆసిడ్ ప్రిపరేషన్ డిటోనేటర్ల తయారీ కేంద్రంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో అందులో ఉన్న సోనూ కుమార్ సజీవ దహనం అయ్యాడు. ఈ ప్రమాదంలో మృతి చెందిన కార్మికుడి ఆనవాలు కూడా లేకుండా పూర్తిగా దగ్ధమైపోయాడు. ఈ పేలుడుకు ప్లాంట్ మొత్తం పూర్తిస్థాయిలో నేల మట్టం అయింది. దీంతో స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్లాంట్‌లో కార్మికుడు మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించి, ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇంట్లో సిలిండర్ బ్లాస్ట్- ఐదుగురు సజీవ దహనం- మృతుల్లో ముగ్గురు చిన్నారులు
మృతుడు బిహార్ వాసి : మృతుడు సంవత్సర కాలంగా ఇదే పరిశ్రమలో పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సోనూకుమార్ బిహార్ రాష్ట్రంలోని అన్సాన్పుర జిల్లా కేంద్రానికి చెందినవాడుగా గుర్తించి, అతని బంధువులకు సమాచారం అందించారు. అయితే ఘటన జరిగిన అనంతరం పరిశ్రమలోని ఘటనాస్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అసలు ఈ ప్రమాదం మానవ తప్పిదమా లేక పరిశ్రమలో ఏదైనా పొరపాటు జరిగిందా అన్న కోణంలో దర్యాప్తును పోలీసులు చేపట్టారు. కానీ ఈ ఘటన సోమవారం జరిగితే మంగళవారం నాడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Youth died after car explodes : భారీ శబ్దంతో కారులో పేలుడు.. వ్యక్తి సజీవ దహనం.. వాహనం దగ్ధం