ETV Bharat / state

అంబులెన్స్‌ చోరీ చేసి బీభత్సం సృష్టించిన దొంగ - సినిమా రేంజ్​లో ఛేజింగ్‌ - చివరకు! - MAN STOLE AMBULANCE

హైదరాబాద్‌లో అంబులెన్స్‌ చోరీ చేసి హల్‌చల్‌ చేసిన దొంగ - సూర్యాపేట వరకు వెంబడించి దొంగను పట్టుకున్న పోలీసులు - పట్టుకునేందుకు యత్నించిన వ్యక్తిని అంబులెన్స్​తో ఢీకొట్టిన దొంగ

MAN STOLE AMBULANCE
MAN STOLE AMBULANCE (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 7, 2024, 12:17 PM IST

Updated : Dec 7, 2024, 12:33 PM IST

Police Chased Man Who Stole Ambulance in Hyderabad : హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై పోలీసులు యాక్షన్ మూవీ స్థాయిలో ఛేజింగ్‌ చేసి ఓ దొంగను పట్టుకున్నారు. హయత్​నగర్‌లో 108 వాహనాన్ని చోరీ చేసి, విజయవాడ వైపు పారిపోతున్న దొంగను పట్టుకునేందుకు పోలీసులు హై అలర్ట్‌ అయ్యారు. దొంగ.. అంబులెన్స్ సైరన్‌తో రయ్ రయ్​మంటూ అతి వేగంతో దూసుకెళ్తూ పోలీసులను ముప్పు తిప్పలు పెట్టాడు.

ఈ నేపథ్యంలో చిట్యాల వద్ద దొంగను పట్టుకునేందుకు యత్నించిన జాన్‌రెడ్డి అనే వ్యక్తిని అంబులెన్స్‌తో ఢీకొట్టాడు. దీంతో అతని పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తర్వాత కేటుగాడు కేతేపల్లి మండలం కోర్లపహాడ్ టోల్‌గేట్ వద్ద గేట్‌ను ఢీకొట్టాడు. ఈ క్రమంలో సూర్యాపేట మండలం టేకుమట్ల వద్ద రోడ్డుకు లారీలను అడ్డంగా పెట్టిన పోలీసులు, ఎట్టకేలకు దొంగను పట్టుకున్నారు. పట్టుబడిన నిందితుడు గతంలో పలు చోరీలు చేసినట్టు పోలీసులు గుర్తించారు.

Last Updated : Dec 7, 2024, 12:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.