11 Year Old Boy Killed By His Mother Lover : వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చుపెడుతున్నాయి. కొన్నిసార్లు అడ్డు వస్తారనే నెపంతో పిల్లలను బలి తీసుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఏపీలోని నెల్లూరు జిల్లాలో జరిగింది. బాలుడి హత్య ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. వివాహేతర సంబంధానికి బిడ్డ అడ్డుగా ఉన్నాడనే నెపంతోనే బాలుడిని హత్య చేసినట్లుగా కేసు దర్యాప్తులో గుర్తించారు.
స్థానిక పోలీస్ స్టేషన్లో గూడూరు డీఎస్పీ వీవీ రమణకుమార్ గ్రామీణ సీఐ కిషోర్ బాబు, ఎస్సై సురేశ్‌బాబుతో కేసు వివరాలను వెల్లడించారు. ‘చిల్లకూరు మండలంలోని వరగలి గ్రామానికి చెందిన బాలుడు కాతారి లాసిక్ (11) ఈ నెల 7న కనిపించడం లేదంటూ ఠాణాకు ఫిర్యాదు అందింది. మరుసటి రోజు నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం మండలం తిరుమలమ్మపాలెం వద్ద కండలేరు కాలువలో శవమై తేలాడు. దీనిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే బాలుడిది హత్యగా తేల్చారు.
ఇదీ జరిగింది : పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కోట మండలం కొక్కుపాడు గ్రామానికి చెందిన కాతారి అనీల్‌కు బాలుడి తల్లితో వివాహేతర సంబంధం ఉంది. దాంతో పాటు ఆమెకున్న ఆస్తిని సొంతం చేసుకునేందుకు తనతో పాటు వచ్చి ఉండాలని కోరాడు. బిడ్డను వదిలి రాలేనని ఆమె చెప్పడంతో లాసిక్‌ను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు.
ఈత నేర్పిస్తానని చెప్పి నీటిలో ముంచి : ఈ క్రమంలోనే ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడ్ని వరగలి గ్రామానికి చెందిన బైనా చరణ్ సాయంతో సమీపాన ఉన్న ఉప్పుటేరు వద్దకు ఈత నేర్పిస్తామని చెప్పి తీసుకెళ్లారు. ఇద్దరు కలిసి లాసిక్‌ను నీటిలో ముంచి ఊపిరాడకుండా చేసి చంపేశారు. మంగళవారం నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా’ డీఎస్పీ వివరించారు.
ఆ బంధానికి అడ్డొస్తోందని చెప్పి : కొద్ది రోజుల క్రితం ఇలాంటి ఘటనే తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తోందని ఓ తల్లి తన సొంత బిడ్డను కడతేర్చింది. వివరాల్లోకి వెళితే లింగాల మండలంలోని కొత్త కుంటపల్లి గ్రామంలో మల్లీశ్వరి అనే మహిళ అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో తరచూ ఫోన్ మాట్లాడేది. ఈ విషయాన్ని ఆమె భార్తకు కుమార్తెను చంపుతుందనే అనుమానంతో అడ్డుతొలగించుకోవాలని బావించింది. పూర్తి వార్తను చదివేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
ఆ బంధానికి అడ్డొస్తోందని కుమార్తెను హత్య చేసి - పాముకాటుతో చనిపోయిందని నమ్మించే యత్నం, చివరకు?