Man killed Wife For Making Reels in Uppal : రియల్ లైఫ్‌ని"రీల్స్ లైఫ్"గా మార్చుకుంటూ కొంత మంది వాటికి బానిసలుగా మారుతున్నారు. తమ వీడియోలకు లైకులు, త్వరగా వైరల్ అయ్యేందు తహతహలాడుతూ సామాజిక మాధ్యమాలకు బంధీలైపోతున్నారు. పొద్దున లేచింది మొదలు ప్రతి విషయాన్ని ఇతరులతో పంచుకోవాలనే ఆతృతలో కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపలేక పోతున్నారు. సామాజిక మాధ్యమాలకు బానిసలుగా మారి వ్యక్తిగత జీవితాన్ని పట్టించుకోకుండా పోతున్నారు. దీంతో కుటుంబాల్లో గొడవలతో బంధాలు బీటలు బారుతున్నాయి.
అనుమానం పెంచుకుని : ఒడిశాకు చెందిన ప్రదీప్ బోలా, మధుస్మిత ప్రధాన్ దంపతులు. వీరికి రెండేళ్ల కుమార్తె. నాలుగేళ్ల క్రితం జీవనోపాధి కోసం హైదరాబాద్‌కి వచ్చారు. ఉప్పల్‌లోని భరత్‌నగర్‌లో అద్దె ఇంట్లో ఉంటూ ప్రదీప్ బోలా వంట మాస్టర్‌గా పని చేస్తున్నాడు. భార్య రీల్స్ చేస్తుండటంతో తరచూ దంపతుల మధ్య గొడవలవుతున్నాయి. మొబైల్‌లో గంటల తరబడి వీడీయో కాల్స్, ఫోన్ కాల్స్ మాట్లాడుతూ, చాటింగ్ చేస్తోందని ఇద్దరు మధ్య గొడవలు జరిగేవి. పైగా ఎవరితో చనువుగా ఉంటోందని భర్త అనుమానం పెంచుకున్నాడు.
ఈనెల 4న భర్తతో గొడవ పడిన మధుస్మిత ఆ రోజు నుంచి ఇంట్లో వంట చేయడం మానేసింది. కుమార్తెకు తెచ్చిన బిస్కెట్లు, బ్రెడ్ తింటూ ఆకలి తీర్చుకుంది. ఈనెల 7న రాత్రి ఆకలితో ఇంటికి వచ్చిన భర్త మందలించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం ముదిరింది. విసిగెత్తిన భర్త చపాతి కర్రతో భార్య తలపై కొట్టాడు. చున్నీతో మెడకు బిగించి హత్య చేశాడు.
రెండేళ్ల కుతూరిని రైల్వే స్టేషన్లో వదిలేసి : భార్య హత్య అనంతరం ప్రదీప్ తప్పించుకునేందుకు ఉపాయం పన్నాడు. భార్య మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి బాత్‌రూంలో పడేశాడు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లి పాపను ఓ ప్రయాణికునికి ఇచ్చి ఇప్పుడే వస్తానని పరారయ్యాడు. బేగంపేటలోని స్నేహితుని వద్ద తలదాచుకున్నాడు. ఈ నెల 12న భరత్‌నగర్‌లో మృత దేహాన్ని గుర్తించి ఇంటి యజమాని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. పోలీసులు 24 గంటల్లోనే బేగంపేటలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.
తల్లిపై అసహనంతో నేలకేసి బాది హత్య చేసిన కుమారుడు
అత్తతో వివాహేతర సంబంధం - మేనమామను హత్య చేసిన మైనర్ బాలుడు - Nephew Killed to Uncle