ETV Bharat / state

సిద్దిపేటలో దారుణం - ఆడిస్తానని తీసుకెళ్లి మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం - Three Year old Girl Raped - THREE YEAR OLD GIRL RAPED

Girl Raped in Siddipet : సిద్దిపేట పట్టణంలో దారుణం జరిగింది. మూడేళ్ల చిన్నారిని ఆడిపిస్తానని చెప్పి, యూపీకి చెందిన ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని 24 గంటల్లోనే పట్టుకున్న పోలీసులు, పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు.

Three year Old Girl Raped in Siddipet
Girl Raped in Siddipet (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 21, 2024, 7:52 PM IST

Three year Old Girl Raped in Siddipet : సిద్దిపేట పట్టణంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ముక్కుపచ్చలారని మూడేళ్ల చిన్నారిపై యూపీకి చెందిన ఓ కామాంధుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. సిద్దిపేట త్రీటౌన్ సీఐ విద్యాసాగర్ తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న బిల్డింగ్​లో నేపాల్​కు చెందిన ఓ వ్యక్తి వాచ్​మెన్​గా పనిచేస్తూ తన కుటుంబంతో అక్కడే నివసిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మూడేళ్ల చిన్నారి తన నాయనమ్మ, తాతల వద్ద ఆడుకుంటూ బిల్డింగ్​లో ఉంటోంది.

ఈ క్రమంలో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ పెయింటింగ్ వర్క్స్​ కోసం యూపీకి చెందిన అజయ్ కూడా వచ్చి భవనంలోనే నివసిస్తున్నాడు. ఈ నేపథ్యంలో నిందితుడు చిన్నారిని ఆడిపిస్తానని తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు యూపీకి పారిపోతుండగా పోలీసులు 24 గంటల్లోనే సిద్దిపేట పట్టణంలో గాలించి పట్టుకున్నారు. నిందితుడిపై అత్యాచారం, పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, రిమాండ్ తరలించినట్లు సీఐ విద్యాసాగర్ తెలిపారు. చిన్నారిని ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు.

'సిద్దిపేటలో నూతనంగా నిర్మిస్తున్న బిల్డింగ్​లో నేపాల్​కు చెందిన ఓ కుటుంబం వాచ్​మెన్​గా పనిచేస్తున్నారు. వాచ్​మెన్​ తన కుటుంబ సభ్యులతో కలిసి బిల్డింగ్​లోనే ఉంటున్నాడు. తన మూడేళ్ల మనవరాలు తమ వద్ద ఆడుకుంటూ ఉంది. అదే బిల్డింగ్​లో పెయింటింగ్ వర్క్ కోసం యూపీకి చెందిన అజయ్ అనే యువకుడు వచ్చాడు. ఈ క్రమంలో చిన్నారిని ఆడిపిస్తానని చెప్పి అత్యాచారం చేశాడు. నిందితుడు పారిపోతుండగా సిద్దిపేటలోనే పట్టుకున్నాం'- విద్యాసాగర్, సీఐ

కఠిన శిక్షలు విధిస్తున్నా : దేశవ్యాప్తంగా వైద్యరాలి హత్యాచార ఘటనపై నిరసనలు జరుగతున్నా కొన్ని మానవ మృగాలు తమ తీరును మార్చుకోవడం లేదు. నెలల పసిపాప నుంచి వృద్ధురాల వరకు భద్రత లేకపోతే కామాంధులు విరుచుకుపడుతున్నారు. రోజుకు ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి కేసుల్లో నిందితులకు సత్వర శిక్ష పడేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సామాన్యులు కోరుతున్నారు.

నిజామాబాద్​లో దారుణం - అయిదేళ్ల చిన్నారిపై అత్యాచారం

చాక్లెట్ ఆశచూపి ఐదేళ్ల బాలికపై అత్యాచారం ఆపై హత్య - దోషికి ఉరిశిక్ష - TG HC DEATH SENTENCE IN RAPE CASE

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.