ETV Bharat / state

నల్గొండలో దారుణం - నీటిట్యాంకులో పది రోజులుగా శవం - Man Dead Body in Water Tank

Man Dead Body in Water Tank : నల్గొండ జిల్లా కేంద్రంలోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్​లో ఓ మృతదేహం లభ్యం కావడంతో పట్టణ వాసులు భయాందోళన గురయ్యారు. అవే నీళ్లు గత పది రోజులుగా తాగుతుండటంతో ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. తాగునీరు తేడా ఉండటంతో మున్సిపాలిటీ సిబ్బందితో కలిసి వాటర్ ట్యాంకును పరిశీలించగా అందులో ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. నీళ్లు అందించే విషయంలో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని సంబంధిత సిబ్బందిపై పట్టణ వాసులు మండిపడుతున్నారు.

Dead Body Found in Water Tank
Man Dead Body in Water Tank (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 3, 2024, 5:30 PM IST

Updated : Jun 3, 2024, 9:45 PM IST

Man Dead Body in Water Tank at Nalgonda : నల్గొండ పట్టణంలోని పాతబస్తీ హిందూపూర్ వాటర్ ట్యాంకులో మృతదేహం కలకలం రేపింది. గత పదిరోజులుగా పలు వార్డుల ప్రజలు అదే నీళ్లను తాగడంతో ఆందోళన నెలకొంది. తాగునీరు తేడాగా ఉండడంతో 11వార్డు ప్రజలు అధికారుల్ని నిలదీయడంతో, పురపాలక సిబ్బంది తనిఖీలు చేయడంతో మృతదేహం లభ్యమైంది.

ఈ మృతదేహం హనుమాన్‌నగర్‌కు చెందిన ఆవుల వంశీ కృష్ణగా గుర్తించారు. అతను గత నెల 24 నుంచి కనిపించడం లేదని, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మున్సిపాలిటీ సిబ్బందిపై స్థానికులు మండిపడ్డారు. నీళ్లను అందించే విషయంలో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలే నాగార్జున సాగర్​లోని మంచి నీళ్ల ట్యాంకలో 30 కోతులు పడి చనిపోయిన ఘటన మరువక ముందే ఈ ఘటన జరగడంతో సంబంధిత అధికారుల తీరుపై పట్టణవాసులు ఫైర్ అవుతున్నారు.

తాగునీరు సరఫరా అవుతున్న 50 ఇళ్లను పరిశీలించాం : ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌ దాసరి హరిచందన స్పందించారు. విచారణ అధికారిగా అదనపు కలెక్టర్ పూర్ణచంద్రను నియమించారు. ఈ ఉదంతంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అంతకముందు ఘటన స్థలానికి చేరుకున్న ఎస్పీ చందనా దీప్తి మృతికి గల కారణాలపైన ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ చెప్పారు. కాగా వాటర్‌ ట్యాంకు ద్వారా తాగునీరు సరఫరా అవుతున్న 50 ఇళ్లను అధికారులు పరిశీలించారు. ఇప్పటివరకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని తెలిపారు.

KTR Tweet on Dead Body Issue : రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు తీరు మారకపోతే, జనం తరిమికొట్టడం ఖాయం అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇది ప్రజాపాలన కాదు, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పాలన అని ఆక్షేపించారు. కోతల్లేని కరెంట్ ఇవ్వలేరు సరికదా, కోతకొచ్చిన పంటకు సాగు నీళ్లు కూడా ఇవ్వలేరన్నారు. అలానే కోతులు పడి చనిపోయినా వాటర్ ట్యాంకులను పట్టించుకోరంటూ ఎద్దేవా చేశారు. చివరికి, నల్గొండలోని నీటిట్యాంకులో పది రోజులుగా శవం ఉన్నా నిద్రలేవరని మండిపడ్డారు.

సాగర్ ఘటన స్మృతిపథం నుంచి చెరిగిపోకముందే, కాంగ్రెస్ సర్కారులో మళ్లీ అదే నిర్లక్ష్యం, అదే నిర్లిప్తత కనిపిస్తోందంటూ ఆయన "ఎక్స్" వేదికగా ధ్వజమెత్తారు. సురక్షిత మంచినీళ్లు కూడా ఇవ్వలేని సర్కారిదని, ప్రజారోగ్యాన్ని పూర్తిగా గాలికొదిలేసిన గలీజు పాలన ఇది అని మండిపడ్డారు. మిషన్ భగీరథ పథకం ద్వారా దశాబ్దాల తాగు నీటి తండ్లాటను తీరిస్తే, కనీసం నీటి ట్యాంకుల నిర్వహణ కూడా చేతకాని అసమర్థ ప్రభుత్వమిది అని ఆరోపించారు. గుర్తుంచుకోండని, జలమే జగతికి మూలమని కేటీఆర్ పేర్కొన్నారు.

నీటి ట్యాంకులో పడి 30 వానరాల మృత్యువాత - దుర్వాసన రావడంతో గుర్తింపు - భయాందోళనలో స్థానికులు - Monkeys Died in Drinking Water Tank

సాధారణ హిందువులను దహనం చేస్తారు - ఆ హిందువులనే పూడ్చేస్తారు! - తేడా ఏంటో తెలుసా?

Last Updated : Jun 3, 2024, 9:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.