ETV Bharat / state

ప్రియురాలి హత్యకు ప్రియుడి ప్లాన్‌ - చివరికి ప్రేమికుడే సజీవ దహనం - అసలేమైందంటే? - Man Suicide Love Failure in ap - MAN SUICIDE LOVE FAILURE IN AP

Man Commits Suicide Due To Love Failure In Kadapa District : ప్రేమ పెళ్లి! దీనికి ప్రేమికుల ఇద్దరి మద్దతు కాదు వారి కుటుంబం సైతం అంగీకారం తెలపాలి. కొందరు ప్రేమికులు పెళ్లితో వాళ్ల బంధానికి ముగింపు పలికితో మరికొందరు పెద్దలను ఎదిరించో, బెదిరించో చివరకు వాళ్లని విడిచిపెట్టో వారు ప్రేమించిన వారితో బతుకుతారు. కానీ కొందరు ప్రేమికులు ఈ దశలో చాలా పైశాచికంగా ప్రవర్తించి ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఏపీలోని ఉమ్మడి కడప జిల్లాలో జరిగింది.

Man Suicide Due to Love Failure
Man Suicide Due to Love Failure (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 14, 2024, 3:19 PM IST

Updated : Jun 14, 2024, 3:27 PM IST

ప్రియురాలి హత్యకు ప్రియుడు ఫ్లాన్‌ - చివరికి ప్రేమికుడే సజీవ దహనం - ఎక్కడో తెలుసా? (ETV Bharat)

Man Commits Suicide Due To Love Failure In Kadapa District Badvel : చిన్న చిన్న సమస్యలకు ప్రాణాలు తీసుకోవడమే పరిష్కారం అనుకుంటున్నారు కొందరు. ప్రియురాలిని పెళ్లి చేసుకోవాలని కలలు కన్న వ్యక్తి ఏకంగా తన ప్రాణాలు తీసుకుని కన్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాడు. ఈ ఘటన ఏపీలోని అన్నమయ్య జిల్లాలోని బద్వేల్‌లో జరిగింది. అతడి తొందరపాటే ఈ ఘోరానికి కారణమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వైఎస్సాఆర్‌ జిల్లా బద్వేల్‌లోని కలసపాడు మండలానికి చెందిన సాయికుమార్‌ రెడ్డి 108 వాహనం డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అదే మండలానికి చెందిన ఓయువతిని ప్రేమించాడు. వీరి పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో ఇద్దరూ కొన్నాళ్లు దూరంగా ఉన్నారు. అది జీర్ణించుకోలేని సాయికుమార్‌ యువతిపై పెట్రోల్‌ పోసి తాను పోసుకుని సజీవ దహనమవ్వాలని పథకం వేశాడు. ఇంట్లో యువతి ఒంటరిగా ఉన్నట్లు గుర్తించిన యువకుడు ఇంటికి వెళ్లాడు.

కుటుంబ కలహాలతో ప్రేమ వివాహం చేసుకున్న జంట ఆత్మహత్య

యువతికి నిప్పు : తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. ఆమె నిరాకరించటంతో తనపై పెట్రోల్‌ పోసి తానూ పోసుకున్నాడు. లైటర్‌ వెలిగించటానికి ప్రయత్నించేలోపు యువతి తప్పించుకుని పారిపోయింది. దీంతో ఆ యువకుడు బద్వేల్‌లో నివాసం ఉంటున్న తన సోదరి ఇంటికి వెళ్లి నిప్పు అంటించుకున్నాడు. ఇంట్లో దట్టమైన పొగ రావటంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

Andhra Pradesh Crime News : అప్పటికే ఆ మంటల్లో ఒక వ్యక్తి చిక్కుకున్నాడనే విషయాన్ని అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు. ఆ మంటల్లో ఆ యువకుడు పూర్తిగా కాలిపోయాడు. అతడితో పాటే ఇంట్లోని సామగ్రి, ఇతర వస్తువులు పూర్తిగా దగ్దమయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు బద్వేల్‌ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చేతికందిన కుమారుడు ఇలా సజీవదహనం కావడంతో యువకుని కుటుంబ సభ్యులు తీవ్ర శోకంలో మునిగిపోయారు. ఆ యువతి పెళ్లికి అంగీకరించలేదని తెలిసి ఆమెపై పెట్రోల్‌ పోసి తాను కూడా నిప్పు అంటించుకోవాలని అనుకుని చివరికి తానే ఆ మంటల్లో సజీవ దహనం అయ్యాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

భార్యను కొట్టిన భర్త- భయంతో కాసేపటికే ఆత్మహత్య!

'అదంతా నిజమని నమ్మా - ప్రేమించి మోసపోయా' - 6 పేజీల లేఖ రాసి యువతి ఆత్మహత్య - young woman committed suicide

Last Updated : Jun 14, 2024, 3:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.