Mallu Nandini Applied For Khammam MP Seat : త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ టికెట్లకు పోటాపోటీ నెలకొంది. దరఖాస్తు చేసుకునేందుకు ఇవాళ చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఖమ్మం పార్లమెంట్ స్థానంపై ప్రముఖుల గురి పడటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే గాంధీ భవన్లో ఈరోజు ఖమ్మం పార్లమెంట్ స్థానం కోసం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని దరఖాస్తు చేసుకున్నారు.
Bhatti Nandini Press Meet in Gandhi Bhavan : ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఖమ్మం జిల్లా నుంచి పోటీ చేయాలని కోరామన్నారు. వాళ్లు పోటీ చేస్తే అందరం కలిసి కట్టుగా పని చేసి భారీ మెజారిటీతో గెలిపిస్తామని తెలిపారు. ఒకవేళ పార్టీ అగ్రనాయకులు ఖమ్మం నుంచి పోటీ చేయని పక్షంలో మాత్రం తనకే అవకాశం ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరుతున్నట్లు వివరించారు.
ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసేందుకు నేను సిద్ధం - నిర్ణయం అధిష్ఠానానిదే
తనకు ఛాన్స్ ఇస్తే భారీ మెజారిటీతో గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. దాదాపు 20 ఏళ్లుగా ఖమ్మం ప్రజలతో కలిసి పనిచేస్తున్నామని, వారి ఒత్తిడి మేరకే లోక్‌సభ స్థానానికి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. టికెట్ విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా, కట్టుబడి ఉంటానని భట్టి నందిని స్పష్టం చేశారు.
"కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలు మా ఖమ్మం జిల్లా నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని మేమంతా కోరుకుంటున్నాం. వారు పోటీ చేస్తే మేము భారీ మెజారిటీతో గెలిపించుకొని, పార్లమెంట్‌కు పంపిస్తాం. మా ఉద్దేశమంతా దేశ ప్రధానిగా రాహుల్ గాంధీనే చూడాలని ఉంది. అదేవిధంగా టికెట్ విషయంలో అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్న, దానికి మేము కట్టుబడి ఉంటాము.":-భట్టి నందిని, కాంగ్రెస్ నేత
రాష్ట్రంలోని అన్ని ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా దేశంలో రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావడం ఖాయమని పేర్కొన్నారు. మరోవైపు ఖమ్మం, మల్కాజ్‌గిరి, నల్గొండలో పార్టీ తప్పకుండా గెలుస్తుందని నమ్ముతున్న పలువురు నేతలు తమకే అవకాశం ఇవ్వాలంటూ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు.
Mallu Nandini Contesting From Khammam Parliament : ఖమ్మం పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీలో భారీ డిమాండ్ నెలకొంది. ఈ స్థానం నుంచి బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపిస్తున్న వారిలో భట్టి నందిని, మాజీ కేంద్రమంత్రి, రేణుక చౌదరి, మాజీ ఎంపీ వీహెచ్ ఉన్నారు. తాజాగా ఈరోజు ఖమ్మం పార్లమెంటు స్థానాన్ని ఆశిస్తూ ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క భార్య మల్లు నందిని దరఖాస్తు చేసుకునేందుకు 500 కార్లతో భారీ ర్యాలీ చేపట్టారు.
ప్రజలను రెచ్చగొడితే చూస్తూ ఊరుకోం : భట్టి విక్రమార్క
రాష్ట్రం చీకట్లో ఉండాలని కలలు కంటున్నారు - బీఆర్ఎస్పై భట్టి విక్రమార్క ఫైర్