ETV Bharat / state

ఉన్నత చదువులకు నోచుకోని పాలమూరు - ఎన్నికల హామీలుగా మిగిలిపోతున్న ప్రజల డిమాండ్లు - Need Of educational Institutions - NEED OF EDUCATIONAL INSTITUTIONS

Educational Institutions In Mahabubnagar : ఉమ్మడి పాలమూరు జిల్లాకు కేంద్ర విద్యాసంస్థలు రావాలన్న డిమాండ్లు చాలాకాలంగా ఉన్నా అవి ఎన్నికల హమీలుగానే మిగిలిపోతున్నాయే తప్ప అమలుకు నోచుకోవడం లేదు. ప్రతి లోక్‌సభ ఎన్నికలకు ముందు హామీలు ఇస్తున్న రాజకీయ పార్టీలు ఆ తర్వాత వాటిని పట్టించుకోవడం లేదు.

Need Of Educational Institutions In MBNR

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 26, 2024, 2:01 PM IST

కేంద్ర విద్యాసంస్థలకు నోచుకోని ఉమ్మడి పాలమూరు జిల్లా-ఎన్నికల హామీలుగా మిగిలిపోతున్న ప్రజల డిమాండ్లు

Educational Institutions In Mahbubnagar : రాష్ట్రవ్యాప్తంగా విద్యాపరంగా అత్యంత వెనకబడిన ప్రాంతం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా. ఇక్కడ జాతీయ విద్యాసంస్థల అవసరం, వాటిని ఏర్పాటు చేయాలనే డిమాండ్లు ఉన్నా ఏళ్లుగా అవి అమలుకు నోచుకోలేదు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటైన తర్వాత గత ప్రభుత్వ హాయాంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో 5 వైద్య కళాశాలలు, నర్సింగ్ కాలేజీలు, వనపర్తిలో జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల మంజూరయ్యాయి. వ్యవసాయ, ఉద్యాన కళాశాలలు అక్కడ ఉన్నాయి.

ఇటీవలే కొండగల్ నియోజకవర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంజినీరింగ్, మెడికల్, పశువైద్య కళాశాలలు సైతం మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ పరంగా విద్యాసంస్థలు ఏర్పాటు అవుతున్నా కేంద్ర విద్యాసంస్థలు మాత్రం ఇక్కడకు రావడం లేదు. రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో మాత్రమే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల ఉంది.

Mahabubnagar Locals Demand For NIT : మరో కళాశాలను విద్యాపరంగా వెనకబడిన మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉన్నా ఎవ్వరూ పట్టించుకొవడం లేదు. దీనిపై కేంద్రానికి వినతులు వెళ్లగా ఇటీవలే ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారికి ఆనుకుని ఎన్​ఐటీని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. కాగా వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలిచినా మహబూబ్‌నగర్‌ ఎన్​ఐటీని ఏర్పాటు కోసం కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని పాలమూరు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Central Govt Grants Rs.100cr : కాగా ప్రధానమంత్రి ఉచ్చత్తర్ శిక్షా అభియాన్ మల్టీ డిసిప్లీనరీ రీసెర్చ్ యూనివర్సిటీ విభాగం భాగం కింద హబూబ్‌నగర్‌లోని పాలమూరు విశ్వవిద్యాలయానికి కేంద్రం రూ.100కోట్లు మంజూరు చేసింది. కేంద్రానికి పంపిన ప్రతిపాదనల ప్రకారం ఈ గ్రాంట్‌లో ఎక్కువ భాగం దాదాపు 80 కోట్ల రూపాయలు కొత్త నిర్మాణాలకు, రూ.14 కోట్లు పరిశోధనా సౌకర్యాలకు,రూ.5 కోట్లు పునరుద్ధరణలకు, రూ. 3 కోట్లు సాఫ్ట్ కాంపోనెంట్‌లకు వినియోగించనున్నారు. కేంద్రం నుంచి ఈ నిధులు తప్ప మహబూబ్‌నగర్‌ జిల్లాకు ఎలాంటి విద్యాసంస్థలు రాలేదు.

రెండు చోట్లైనా కేవీలు ఏర్పాటు చేయాలి : పూర్వ మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తగా ఏర్పడిన 7జిల్లాల మధ్య విడిపోయింది. మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలు ఏర్పడ్డాయి. అన్ని జిల్లాలకు కలిపి కేంద్రీయ విద్యాలయం(కేవీలు) ఒక్కటే ఉంది. 5 జిల్లాల్లో ఒకటి, రెండు చోట్లైనా కేంద్రీయ విద్యాలయాలు రావాలని జనం కోరుతున్నారు. పదేళల్లో ఆ దిశగా అడుగులు పడకా జవహర్ నవోదయ విద్యాలయం నాగర్ కర్నూల్ జిల్లాలో మాత్రమే ఉంది. అక్షరాస్యత పరంగా వెనకబడిన జోగులాంబ గద్వాల, నారాయణపేట లాంటి జిల్లాల్లో వాటిని ఏర్పాటు చేస్తే. గ్రామీణ ప్రాంత నిరుపేద విద్యార్ధులకు ఉచిత విద్య అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది.

అమలుకునోచుకోని సైనిక్ స్కూల్ : ఇక నారాయణపేట జిల్లాకు గతంలో సైనిక్ స్కూల్ మంజూరైనా అమలుకు నోచుకోలేదు. ఈ పాఠశాలల్లో 6 నుంచి 12వ తరగతి వరకు సీబీఎస్ఈ సిలబస్‌తో ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తారు. వన్‌ స్కూల్‌- వన్‌ స్పోర్ట్స్‌ నినాదంతో ఏదైనా ఒక క్రీడలో విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్య అందుతుంది. కొత్తవిధానంలో ఏర్పాటైన సైనిక్ పాఠశాలల్లో చేరేవారికి మెరిట్‌ ఆధారంగా ఫీజులో 50శాతం కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇలాంటి బళ్లు నారాయణపేట, జోగులాంబ గద్వాల లాంటి జిల్లాల్లో విద్యారంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఉపయోగపడతాయని స్థానికులు వెల్లడించారు.

నైపుణ్య కేంద్రాల ఆవశ్యకత : ఉమ్మడి పాలమూరు జిల్లా చేనేత రంగానికి ప్రసిద్ధి. గద్వాల, నారాయణపేట చేనేత వస్త్రాలు అంతర్జాతీయ స్థాయిలో పేరుపొందింది. కాని ఆ రంగంపై ఆధారపడిన చేనేత కార్మికులు, వృత్తిదారులు మాత్రం సరైన ఆదాయం లేక ఆ వృత్తిని వదిలేస్తున్నారు. నేటితరం, భవిష్యత్తు తరాల పిల్లలు ఆ వృత్తిలో కొనసాగేందుకు ఆసక్తి చూపడం లేదు. గద్వాల, నారాయణపేట లాంటి పురాతన చేనేత రంగాన్ని సజీవంగా ఉంచాలంటే ఆధునికతను జోడించాల్సిన అవసరం ఉంది. ముందు తరాలకు గద్వాల, నారాయణపేట చేనేత మెళకువలు నేర్పాలంటే అందుకు ప్రత్యేకమైన నైపుణ్య కేంద్రాలు అవసరం.

Need Of IITs In Under Developed Areas : ఇండియన్ ఇస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ లాంటి కళాశాలల్ని ఈ ప్రాంతానికి తీసుకువస్తే చేనేత రంగానికి, ఆ రంగంపై ఆధారపడ్డ భవిషత్తు తరాలకీ మేలు జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇవే కాకుండా ట్రిపుల్ ఐటీ లాంటివి పాలమూరు జిల్లాకు తేవాలని ఇక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు అందుతున్నా అవి కాగితాలకే పరిమితం అవుతున్నాయే తప్ప కార్యరూపం దాల్చడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ చొరవ అవసరం : ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఈ అంశాలని తమ ప్రణాళికలో చేర్చుతున్న రాజకీయ పార్టీల నేతలు గెలిచిన తర్వాత వాటిని పట్టించుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాష్ట్రానికి రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం సైతం చొరవ చూపాల్సి ఉంటుంది. విద్యా సంస్థల ఏర్పాటుకు కావాల్సిన భూములు, నిధులు, ఇతర అవసరాల్లో తమ వంతు పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఆ దిశగా చర్యలు తీసుకోకపోతే ప్రజల డిమాండ్లు హామీలకే తప్ప అమలుకు నోచుకునే అవకాశం లేదు.

Mahbubnagar MVS Junior College Problems : సమస్యల వలయం.. @ ఎంవీఎస్ ప్రభుత్వ జూనియర్​ కళాశాల

Girls Gurukul College Problems in Mahabubnagar : శిథిలావస్థకు చేరిన గురుకులం.. బిక్కుబిక్కుమంటూ చదువులు సాగిస్తున్న విద్యార్థినులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.