ETV Bharat / state

అలాంటి యూట్యూబర్స్​, ట్రోలర్స్​కు మరోసారి 'మా' హెచ్చరిక - 200 ఛానల్స్​పై డీజీపీకి ఫిర్యాదు - MAA Warning to YouTubers - MAA WARNING TO YOUTUBERS

YouTubers and Trollers Warning : నటీనటుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా వ్యవహారించే ట్రోలర్స్​పై కఠిన చర్యలకు మా అసోసియేషన్ సిద్ధమైంది. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులతో కలిసి సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ కమిటీ ద్వారా నెగిటివ్ ట్రోలర్స్, యూట్యూబర్స్​ను గుర్తించి పూర్తిగా తొలగించనున్నారు. ఇందుకు సంబంధించి మా అసోసియేషన్ ప్రతినిధులు తెలంగాణ డీజీపీ జితేందర్​ను కలిసి పలువురు ట్రోలర్స్​పై ఫిర్యాదు చేయడమే కాకుండా పరిశ్రమ పట్ల తప్పుగా వ్యవహరిస్తోన్న 200కుపైగా యూట్యూబ్ ఛానల్స్ వివరాలను అందజేశారు.

YouTubers and Trollers Warning
YouTubers and Trollers Warning (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 18, 2024, 8:50 PM IST

MAA Association Warning to YouTubers and Trollers : ఇన్​ఫ్ల్యూయెనర్స్​, మీమర్స్​, యూట్యూబర్స్​కు ఇది చేదువార్త. ఇకపై నటీనటుల వ్యక్తిగత జీవితాల పట్ల తప్పుగా వీడియోలు ట్రోల్స్​ చేస్తే కటకటాలు లెక్కపెట్టాల్సిందే. ఆ దిశగా కఠిన చర్యలు తీసుకునేందుకు తెలుగు మూవీ ఆర్టిస్ట్​ అసోసియేషన్​ సిద్ధమైంది. ఇప్పటికే 25 యూట్యూబ్​ ఛానల్స్​ను పూర్తిగా టెర్మినేట్​ చేయించిన మా అసోసియేషన్​, మరో 200కు పైగా ఛానల్స్​ను గుర్తించినట్లు వెల్లడించింది. ఈ మేరకు ఆయా యూట్యూబర్స్​, ట్రోలర్స్​పై మా అసోసియేషన్​ తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేసింది. మా సభ్యులు, సీనియర్​ నటులు శివకృష్ణ, రాజీవ్​ కనకాల, శివబాలాజీ లక్డీకాపూల్​లోని డీజీపీ కార్యాలయంలో డీజీపీ జితేందర్​ను కలిసి ఫిర్యాదు చేశారు.

ఇటీవల హనుమంతు సంఘటనను ఉదాహరిస్తూ సినీ పరిశ్రమ నటీనటులపై, వారి కుటుంబ సభ్యులపై అనుచితంగా ప్రవర్తిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని వారు కోరారు. అలాగే మా అసోసియేషన్​లోని సోషల్​ మీడియా విభాగం గుర్తించిన 200కు పైగా యూట్యూబ్​ ఛానల్స్​ వివరాలను డీజీపీకి అందజేశారు. అనంతరం మా అసోసియేషన్​ ట్రెజరర్​ శివబాలాజీ మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేసే యూట్యూబర్స్​, ట్రోలర్స్​పై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.

"కొందరు యూట్యూబర్స్​ వల్ల ఏది తప్పు? ఏది కరెక్ట్ అనేది తెలియకుండా పోతుంది. ఈ విషయాన్ని చాలా సీరియస్​గా తీసుకున్నాం. ఇటీవల మా అసోసియేషన్​ తరఫున అధ్యక్షుడు మంచు విష్ణు కూడా ట్వీట్​ చేశారు. ఇప్పుడు చాలా మంది ఛానల్స్​ను డౌన్​ చేస్తున్నాం. 200 ట్రోలింగ్​ ఛానల్స్​ లిస్టును డీజీపీకి పంపించాం. సైబర్​ క్రైంలో మేము కూడా ఒక వింగ్​గా ఉండనున్నాం. వారితో కలిసి పని చేయనున్నాం. ఇప్పటివరకు 25 యూట్యూబ్​ ఛానల్స్​ను టెర్మినేట్​ చేశాం." - శివబాలాజీ, మా అసోసియేషన్​ ట్రెజరర్​

ట్రోలర్స్​ను ఉపేక్షించేది లేదు : ఇప్పటికే మా అధ్యక్షుడు మంచు విష్ణు ఈ విషయంపై యూట్యూబర్స్​ను హెచ్చరించినా పెడచెవిన పెట్టడంతో మా కఠిన చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ట్రోలర్స్​ను ఉపేక్షించేదే లేదని స్పష్టం చేసింది. ముఖ్యంగా నటీమణుల విషయంలో అసభ్యకరంగా వ్యవహరిస్తున్న ట్రోలర్స్​తో పాటు సినిమా ప్రాజెక్టులను దిగజార్చేలా వ్యాఖ్యానిస్తున్న వారిపై కూడా చర్యలు తప్పవని సూచించింది. ఇందుకోసం ప్రత్యేకంగా సైబర్​ క్రైం పోలీసులతో కలిసి త్వరలోనే కో ఆర్డినేషన్​ కమిటీని ఏర్పాటు చేయబోతుంది.

కొంతమంది యూట్యూబర్స్​ తీరుపై సీనియర్​ నటులు శివకృష్ణ, రాజీవ్​ కనకాల అసహనం వ్యక్తం చేశారు. సినిమా వాళ్లను ట్రోలింగ్​ చేస్తూ పైశాచికత్వానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ట్రోల్స్​, మీమ్స్​ శ్రుతిమించిపోయాయని, అది సినీ పరిశ్రమకు, ప్రజలకు మంచిది కాదని రాజీవ్​ కనకాల హితవు పలికారు. నెగిటివ్​ ట్రోల్స్​ మానేయాలని విజ్ఞప్తి చేశారు. నటీనటుల కోసమే కాకుండా సమాజ శ్రేయస్సు కోసం ఇకపై కఠినంగా వ్యవహరించనున్నట్లు తెలిపారు.

ఆ ఐదు యూట్యూబ్​ ఛానళ్లు రద్దు చేసిన 'మా' - అవేంటో తెలుసా? - Five YouTube Channels Terminated

ఇట్స్ నాట్ ఫన్!! అది నోరా డ్రైనేజా? - యూట్యూబర్​పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు - YouTuber P Hanumanthu Controversy

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.