ETV Bharat / state

'పేదవాళ్లు డబ్బులు ఇవ్వలేకపోయినా - వైద్యం చేయడమే మా సూత్రం' : అదే LVP సక్సెస్ మంత్ర - dr nageswara rao interview - DR NAGESWARA RAO INTERVIEW

LV Prasad Eye Institute in Hyderabad : దేశంలో కంటి వైద్యానికి కొత్త రూపు ఇచ్చిన సంస్థ ఎల్‌వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌. తక్కువ ఖర్చుతో పేద, ధనిక అనే భేదం లేకుండా కంటి చూపును ప్రసాదిస్తారు. ఇప్పటివరకు 50 వేల కార్నియాలు మార్పిడి చేసి, ప్రపంచంలోనే మొదటి సంస్థగా రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఆ సంస్థ పనితీరుపై సంస్థ వ్యవస్థాపకులు గుళ్లపల్లి నాగేశ్వరరావు, సంస్థ ఎగ్జిక్యూటివ్​ ఛైర్మన్​ ప్రశాంత్​ గార్గ్​, సంస్థలో భాగమైన శాంతిలాల్​ సంఘ్వీ, కార్నియా ఇన్​స్టిట్యూట్​ డైరెక్టర్​ డాక్టర్​ ప్రవీణ్​ వడ్డపల్లితో ఈటీవీ భారత్ ప్రత్యేకంగా ముచ్చటించింది.

LV Prasad Eye Institute in Hyderabad
LV Prasad Eye Institute in Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 12, 2024, 9:30 AM IST

LV Prasad Eye Institute Done 50000 Cornea Transplant Treatment : ఎల్​వీ ప్రసాద్​ ఐ ఇన్​స్టిట్యూట్​. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలోనూ ఎవ్వరిని అడిగినా చెబుతారు. కంటి వైద్యానికి కొత్త రూపు తీసుకువచ్చింది ఈ సంస్థ. ధనిక, పేద అనే భేదం లేకుండా ఆసుపత్రికి వచ్చిన ప్రతి ఒక్కరికీ, ఎంత ఖర్చయినా కంటి వైద్యం అందించాలన్నది వారి లక్ష్యం. ఆ ఆశయంతో మూడున్నర దశాబ్దాల క్రితం హైదరాబాద్​లో ఏర్పాటైన ఈ సంస్థ, 50 వేల కార్నియా మార్పిడి చికిత్సలు చేసి వారందరికీ చూపును ప్రసాదించింది. ఈ ఘనత అందుకున్న ప్రపంచంలోనే మొదటి సంస్థగా రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో సంస్థ వ్యవస్థాపకులు గుళ్లపల్లి నాగేశ్వరరావు, సంస్థ ఎగ్జిక్యూటివ్​ ఛైర్మన్​ ప్రశాంత్​ గార్గ్​, సంస్థలో భాగమైన శాంతిలాల్​ సంఘ్వీ, కార్నియా ఇన్​స్టిట్యూట్​ డైరెక్టర్​ డాక్టర్​ ప్రవీణ్​ వడ్డపల్లితో ఈటీవీ భారత్ ప్రత్యేకంగా ముచ్చటించింది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం.

LV Prasad Eye Institute in Hyderabad
గుళ్లపల్లి నాగేశ్వరరావు (ETV Bharat)

గుళ్లపల్లి నాగేశ్వరరావు :

ప్రశ్న : 50 వేల కార్నియా ట్రాన్స్‌ప్లాంటేషన్ల ప్రయాణం ఎలా సాగింది?

జవాబు : సంస్థ ఈ స్థాయికి చేరడం చాలా సంతోషంగా ఉంది. సున్నా నుంచి ప్రారంభించి ఇక్కడికి చేరాం. కార్నియల్‌ స్పెషలిస్ట్‌ అయిన నేను మన దేశంలో సంస్థను ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. పలువురు వారించారు. ఇక్కడ ఎవరూ నేత్రదానం చేయరు. కార్నియల్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ వద్దని క్యాటరాక్ట్‌లు చేసుకోమని చెప్పారు. అయినా మా ప్రయాణం కొనసాగించాం. కార్నియల్‌ మార్పిడి మొదటి సంవత్సరం నుంచే మొదలుపెట్టాం. అప్పట్లో అహ్మదాబాద్‌లో గౌతమ్‌ అనే న్యాయవాది ఐ బ్యాంకు పెట్టి కార్నియాలు పంపేవారు. దూరం నుంచి కార్నియాలు రావడం ఇబ్బందిగా ఉండటంతో ఇక్కడే ఐ బ్యాంకు ఉండాలని నిర్ణయించుకున్నాం. పలువురి సహకారంతో 1989లో మొదటి ఐ బ్యాంకు పెట్టాం.

ప్రశ్న : నేత్రదానం దిశగా ప్రజలను ఆలోచింపజేసిన గ్రీఫ్‌ కౌన్సెలింగ్‌ గురించి చెప్పండి?

జవాబు : ఐ బ్యాంకు పెట్టిన మొదటి మూడు నాలుగేళ్లు నేత్రదానం ఎక్కువగా జరగలేదు. అప్పటికే అమెరికాలో అవలంబించిన ‘హాస్పిటల్‌ కార్నియా రిట్రీవల్‌ ప్రోగ్రాం’పై దృష్టిపెట్టాం. అక్కడ గ్రీఫ్‌ కౌన్సెలర్లు ఆసుపత్రికి వచ్చే కుటుంబాలతో మాట్లాడి నేత్రదానానికి అంగీకరింపచేసేవారు. మన వద్ద కూడా గ్రీఫ్‌ కౌన్సెలింగ్‌ నిర్ణయంతో మొదట నిమ్స్‌కు వెళ్లగా అప్పటి డైరెక్టర్‌ కాకర్ల సుబ్బారావు సహకరించారు. హైదరాబాద్‌లో మొట్టమొదట నేత్రదానం చేసింది పాతబస్తీలోని ఒక గుజరాతీ కుటుంబం. వారే నేత్రదానానికి పిలిచారు. నేనే వెళ్లి కళ్లను తీసుకువచ్చా. టెక్నీషియన్‌లకు శిక్షణ, ఆసుపత్రి గ్రీఫ్‌కౌన్సెలింగ్‌ విధానంతో నేత్రదానం రూపే మారిపోయింది. ఇక్కడ విజయవంతమయ్యాక దేశవ్యాప్తంగా విస్తరించింది. ఆ ఒక్క అడుగే విప్లవం అయింది. ఇప్పుడు అత్యధిక ఆసుపత్రుల్లో గ్రీఫ్‌ కౌన్సెలర్లు ఉన్నారు.

ప్రశ్న : మన దేశంలో కార్నియాల లభ్యత ఎలా ఉంది?

జవాబు : మొదట్లో దేశం మొత్తంలో ఏడాదికి 6-7 వేల కార్నియాలు దానం చేసేవారు. ఇప్పుడు 60 వేల వరకూ వస్తున్నాయి. కనీసం 2 లక్షలకు పైగా కార్నియాలు కావాలి. గత పది సంవత్సరాలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాల్లో కార్నియాకు వెయిటింగ్‌ లిస్ట్‌ లేదు ఎవరికి కార్నియా కావాలన్నా 48 గంటల్లోపు సమకూరుస్తాం. ప్రభుత్వం, ఛారిటబుల్‌ ఆసుపత్రులకైతే ఉచితంగానే ఇస్తాం. గతేడాది 12 వేల కార్నియాలు సేకరించాం. 8 వేల ట్రాన్స్‌ప్లాంట్‌లు జరిగాయి. ఎల్‌వీ ప్రసాద్‌లోనే 3 వేల ట్రాన్స్‌ప్లాంట్‌లు జరిగాయి. మిగిలినవి ఇతరులకు ఇచ్చాం.

ప్రశ్న : కంటి వైద్యంలో మీకు స్ఫూర్తిగా నిలిచిన అంశాలు?

జవాబు : అమెరికా నుంచి మన దేశానికి తిరిగి వచ్చినప్పుడు అనుకున్నది ఒక్కటే. మన వద్దకు వచ్చే ప్రతి ఒక్కరికి వైద్యం అందాలి. డబ్బులు ఇవ్వగలిగినా లేకపోయినా, ఎంత ఖర్చయినా వైద్యం చేయడం మా సూత్రం. ఆరంభంలో పల్లెటూళ్ల నుంచి ఎంతోమంది కంటి వైద్యం కోసం వస్తుండేవారు. దీన్ని చూసిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులోకి తేవాలని భావించాం. నిర్మల్‌ జిల్లాలోని ముథోల్‌లో మొదటి ద్వితీయ శ్రేణి కేంద్రాన్ని ప్రారంభించాం. అక్కడ 7 వేల మందికి ఆపరేషన్లు చేశాం. ఇప్పుడు మూడు రాష్ట్రాల్లో 22 కేంద్రాలు ఉన్నాయి. ఇంకో మూడు అందుబాటులోకి వస్తాయి.

ప్రశ్న : విజన్‌ సెంటర్లతో అందుకున్న విజయాలు ఏంటి?

జవాబు : ద్వితీయ శ్రేణి కేంద్రాలతో లక్ష్యం పూర్తిగా నెరవేరడంలేదని, మారుమూల గిరిజన ప్రాంతాలకు వెళ్లలేకపోతున్నామని భావించాం. పరిష్కారంగా వచ్చిన ఆలోచనే విజన్‌ సెంటర్ల ఏర్పాటు. ఇది అద్భుత ఫలితాలు ఇచ్చింది. ఇంటర్‌ పాసైనవారికి శిక్షణ ఇచ్చి టెక్నీషియన్‌లా తయారు చేసి వారికి విజన్‌ సెంటర్ల బాధ్యత అప్పగించాం. ఈ రోజు ఇది ప్రపంచం మొత్తానికి ఒక మోడల్‌గా ఉంది. అమెరికాలో వాల్‌మార్ట్‌ కంపెనీ కూడా విజన్‌సెంటర్లు పెట్టింది. ఆ దేశంలో ప్రతి మాల్‌లో ఉన్నాయి. ఆఫ్రికాలోని వెనుకబడిన దేశాల్లో ఈ సెంటర్లు కీలకంగా ఉన్నాయి.

ప్రశ్న : భవిష్యత్‌ కార్యాచరణ?

జవాబు : కార్నియాతో బాధపడేవాళ్లు ట్రాన్స్‌ప్లాంట్‌ అవకాశం ఉందని గుర్తించాలి. నేత్రదానం చేసేవారికి కృతజ్ఞతలు. వారి దాతృత్వం సఫలం అవుతోంది. మూడు రాష్ట్రాల్లో మరింత విస్తృతంగా సేవలు అందించడంతో పాటు పరిశోధనలతో కంటివైద్యంలో అనేక మోడళ్లను అందుబాటులోకి తేవడం, వాటిని అనుసరించేవారికి పూర్తిసహకారం ఇవ్వడం, ఇతర కంటి ఆసుపత్రులు, సంస్థలకు తోడ్పాటు ఇవ్వడం, వెనుకబడిన దేశాలకు కంటివైద్యంలో సహకరించడం, మారుమూల ప్రాంతాలనుంచి వచ్చినవారికి కూడా చూపు ఇవ్వగలిగితే అంతకంటే సంతృప్తి మరొకటి ఉండదు.

LV Prasad Eye Institute in Hyderabad
డాక్టర్ ప్రవీణ్​ వడ్డపల్లి (ETV Bharat)

డాక్టర్ ప్రవీణ్​ వడ్డపల్లి

ప్రశ్న : కంటి వైద్యంలో ఎల్‌వీపీఈఐ పరిశోధనలు ఎలా ఉన్నాయి?

జవాబు : ఎల్‌వీ ప్రసాద్‌లో ఏడాదికి 15 శాతం నిధులు పరిశోధనపై వ్యయం చేస్తాం. ప్రస్తుతం కార్నియాలో స్టెమ్​సెల్స్​పై పరిశోధన జరుగుతోంది. ఆ కణాలను ప్రయోగశాలలో అభివృద్ధి చేయడం, వాటిని ట్రాన్స్​ప్లాంట్​ చేయడంపై దృష్టి సారించాం.

కృత్రిమ కార్నియాను సృష్టించాం : గత ఏడాది మా పరిశోధన బృందం ప్రయోగశాలలో త్రీడీ ప్రింటింగ్‌ చేసి కృత్రిమ (ఆర్టిఫిషియల్‌) కార్నియాను సృష్టించింది. భవిష్యత్‌లో క్లినికల్‌ ట్రయల్స్‌ చేస్తాం.

కార్నియా మొత్తం ట్రాన్స్‌ప్లాంట్‌ అవసరంలేదు : ప్రస్తుతం కార్నియా మొత్తం ట్రాన్స్‌ప్లాంట్‌ చేయాల్సిన అవసరంలేకుండా కొత్త టెక్నిక్‌లు అందుబాటులోకి వచ్చాయి. కార్నియాలో ఐదు లేయర్‌లు ఉంటాయి. ఏ లేయర్‌కు అవసరమైతే ఆ లేయర్‌ వరకే ట్రాన్స్‌ప్లాంట్‌ చేస్తాం. కార్నియా మార్పిడి తర్వాత ఫాలోఅప్‌కు రాలేకపోతున్నవారి కోసం టెలీ కన్సల్టేషన్‌ అందుబాటులోకి తెచ్చాం.

LV Prasad Eye Institute in Hyderabad
ప్రశాంత్​ గార్గ్​ : (ETV Bharat)

ప్రశాంత్​ గార్గ్​ :

ప్రస్తుతం పిల్లల్లో మయోపియా ఎక్కువవుతోంది : పిల్లల్లో కంటి చూపునకు సంబంధించి మయోపియా సమస్య ఎక్కువ అవుతోంది. బాగా దగ్గరగా చూడటం, తగినంత వెలుతురు లేకుండా చదవడం, పూర్తిగా గదులకే పరిమితం కావడం దీనిని తీవ్రతరం చేస్తోంది. 2050 నాటికి ప్రపంచంలో సగం మంది మయోపిక్స్‌ అవుతారని అంచనా. ఈ సమస్యను వేగంగా గుర్తించేందుకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజన్స్‌ మోడళ్లను అభివృద్ధి చేస్తున్నాం.

ప్రశ్న : కార్నియా ఇవ్వడంలో ప్రాధాన్యాలు ఏమిటి?

జవాబు : కార్నియా ట్రాన్స్‌ప్లాంట్‌లో జాప్యం జరిగితే నష్టం జరుగుతుందనే కేసులకు ముందు ఇస్తాం. పూర్తిగా ఆరోగ్యవంతమైన కార్నియాను మాత్రమే ఇస్తాం. కార్నియా ట్రాన్స్‌ప్లాంట్‌ చేయించుకున్న వారికి కార్నియా ఇచ్చినవారి వ్యాధులు సంక్రమించకుండా అన్ని వైద్య పరీక్షలు చేస్తాం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.