Young Lovers Committed Suicide in Suryapet : రాష్ట్రవ్యాప్తంగా ఈ మధ్య కాలంలో వరుసగా జరుగుతున్న ఆత్మహత్యలు తీవ్రంగా కలచి వేస్తున్నాయి. అమ్మాయి ప్రేమించడం లేదనో, ప్రేమించిన అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లాడిందనో, పెద్దలు తమ ప్రేమను అంగీకరించడం లేదనో ఇలా ప్రేమ పేరుతో రకరకాల కారణాల వల్ల యువతీ యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది.
సమాజం, కట్టుబాట్ల గురించి ఆలోచించకుండా వారు ఒకరిని ఒకరు ఎంతగానో ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకొని నిండునూరేళ్లు సంతోషంగా బతకాలి అనుకున్నారు. కానీ కులం కారణంగా వారి జీవితం మధ్యలోనే ఆగిపోయింది. కులాలు వేరు కావడంతో తమ పెళ్లికి పెద్దలు నిరాకరించారు. దీంతో ఆ ప్రేమికులు ఒకరిని విడిచి ఒకరు ఉండలేక చావైనా బతుకైనా కలిసే ఉందామని భావించి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలంలో జరిగింది. ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో తమ పెళ్లిని అడ్డుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
Lovers suicide in Kamareddy : పెద్దలను ఎదిరించి.. జీవితంలో ఓడిపోయి.. ప్రేమికుల ఆత్మహత్య
పోలీసుల వివరాల ప్రకారం : గ్రామానికి చెందిన గుండగాని సంజయ్ (25), ఆ గ్రామ పంచాయతీ ఆవాస గ్రామమైన కృష్ణ సముద్రం గ్రామానికి చెందిన సల్లగుండ్ల నాగజ్యోతి (23) ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని గతంలోనే నాగజ్యోతి ఇంట్లో తెలుపగా ఆమె తండ్రి నిరాకరించాడు. అప్పటినుంచి వారిద్దరు కొన్ని రోజులుగా విడివిడిగా ఉంటూనే వీరి ప్రేమను ఎవరికీ తెలియకుండా కొనసాగిస్తున్నాయి.
నాగజ్యోతి ఇమాంపేటలోని ఓ కళాశాలలో బీఫార్మసీ పూర్తిచేసింది. ప్రస్తుతం సూర్యాపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తూ ఎం.ఫార్మసీ చదువుతోంది. సంజయ్ సూర్యాపేటలో ఉంటూ వాటర్ ప్లాంట్‌లో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. పెద్దలు వద్దన్నా ఈ జంట తరచూ కలుస్తున్నారన్న విషయం తెలుసుకున్న కొంతమంది గ్రామస్థులు నాగజ్యోతి తండ్రి సల్లగుండ్ల శ్రీనుకు వీరిపై లేనిపోని మాటలు చెప్పి ఇద్దరిని విడదీయాలని యత్నించారు. వారి మాటలు నమ్మిన శ్రీను పలుమార్లు తన కుమార్తెను కొట్టాడు. యువతి తరఫు బంధువులు కొందరు కొద్ది రోజుల క్రితం సంజయ్‌తో గొడవపడి దూషించి అతడిని కొట్టి ఇబ్బంది పెట్టారు.
దీంతో వారిద్దరు మనస్తాపానికి గురై శనివారం ఉదయం ఇంటి నుంచి వెళ్లి రాత్రి సమయంలో తుమ్మలపెన్‌పహాడ్ గ్రామ శివారులో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. తమ పెళ్లికి అడుగడుగునా అడ్డుపడి తమ చావుకు కారణమైన ఏడుగురు వ్యక్తుల పేర్లను సూచిస్తూ వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని రాసిన లేఖ మృతురాలి బ్యాగులో లభించిందని ఎస్సై తెలిపారు. మృతురాలి తల్లి దుర్గమ్మ ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు, మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశామని తెలిపారు.
పెళ్లి చేయరేమో అన్న భయంతో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
Lovers Suicide Siddipet : పెద్దలు ప్రేమకు 'నో' చెబుతారని.. మైనర్ ప్రేమజంట ఆత్మహత్య