ETV Bharat / state

'నా లవ్​ను ఎందుకు యాక్సెప్ట్​ చేయట్లేదు' : పరీక్షలు రాసేందుకు వచ్చిన యువతిపై కత్తితో ప్రేమోన్మాది దాడి - LOVER ATTACK ON WOMAN WITH KNIFE

మెదక్‌ జిల్లాలో దారుణం - రెచ్చిపోయిన ప్రేమోన్మాది - కత్తితో యువతిపై దాడి - తీవ్ర గాయాలతో హైదరాబాద్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న యువతి

Lover Attack On Woman With Knife In Medak
Lover Attack On Woman With Knife In Medak (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 4, 2024, 11:40 AM IST

Updated : Nov 4, 2024, 12:26 PM IST

Lover Attack On Woman With Knife In Medak : ఇటీవల కాలంలో యువతులపై ప్రేమోన్మాదుల దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రేమించకపోయేసరికి లేదా వాళ్లను పట్టించుకోకపోయేసరికి కోపానికి గురై దాడులకు దిగుతున్నారు. క్షణికావేశంలో ప్రేమించిన మనిషి తనకు దక్కడం లేదని ఏకంగా వారి ప్రాణాలను తీయడానికీ వెనకాడటం లేదు. ఇలాంటి ఓ ఘటనే తాజాగా మెదక్​ జిల్లాలో వెలుగు చూసింది. తనను ప్రేమించడం లేదని ఓ ప్రేమోన్మాది యువతిపై తీవ్రంగా దాడి చేశాడు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లో చికిత్స పొందుతోంది.

మెదక్‌ మున్సిపాలిటీ పరిధిలోని అవుసులపల్లికి చెందిన దేవగుప్తుల దివ్య కృప స్థానిక గవర్నమెంట్‌ డిగ్రీ కాలేజ్‌లో ఓపెన్‌ డిగ్రీ బీఏ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్నారు. ఆమె సెకండ్‌ సెమిస్టర్ పరీక్షలు రాస్తున్నారు. సోమవారం చివరి పరీక్షకు హాజరయ్యేందుకు దివ్య ఉదయం 8.40 గంటల ప్రాంతంలో కాలేజీకి వచ్చారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన చేతన్‌ అలియాస్‌ కిరణ్‌ అనే యువకుడు కాలేజీ గేట్‌ ముందు దివ్యతో వాగ్వాదానికి దిగాడు.

ప్రేమకత్తికి మరో ప్రాణం బలి - ఉన్మాది దాడిలో యువతి మృతి - అనంతరం యువకుడి ఆత్మహత్యాయత్నం - HYDERABAD MAN KILLS EX GIRLFRIEND

నన్ను ప్రేమిస్తావా లేదా : దివ్యను ప్రేమిస్తున్నట్లు తెలిపాడు. 'నన్ను ప్రేమిస్తున్నావా లేదా' అని దివ్యను అడగ్గా ఆమె నిరాకరించింది. 'నా ప్రేమను యాక్సెప్ట్‌ చేయవా' అంటూ తన వెంట తెచ్చుకున్న కత్తితో దివ్య చేయి కోసి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడి రక్తస్రావం అవుతున్న దివ్యను స్థానికులు ఆటోలో జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. దివ్యపై దాడి చేసిన చేతన్‌ అలియాస్ కిరణ్‌ స్వస్థలం బెంగళూరు అని తెలిసింది. ఇన్స్​పెక్టర్ నాగరాజు, ఏఎస్ఐ రుక్సానా ఆసుపత్రికి చేరుకుని బాధితురాలు దివ్య కృపతో మాట్లాడి ఘటన వివరాలు సేకరించారు.

"నేను ఎగ్జామ్‌ కోసం వెళ్లాను. అక్కడే కూర్చోని చదువుకుంటున్నాను. ఆ అబ్బాయి వచ్చి నన్ను లవ్‌ చేస్తున్నానని చెప్పాడు. నేను వద్దు అన్నాను. తర్వాత నన్ను కొట్టి, నా చేయి కోసి వెళ్లిపోయాడు." - దివ్య, బాధితురాలు

స్నేహితుల ద్వారా పరిచయమై ప్రేమలో పడ్డారు - అలా తయారయ్యాడని దూరం పెట్టేసరికి!

ట్యూషన్​ టీచర్​తో మైనర్ ప్రేమాయణం​- దూరం పెట్టిందని 'క్యాష్​ ఆన్​ డెలివరీ' ఆర్డర్లతో రివెంజ్​​! అసలేం జరిగిందంటే? - Cash On Delivery Torture

Last Updated : Nov 4, 2024, 12:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.