ETV Bharat / state

అధ్వాన్నంగా భూపాలపల్లి జూనియర్​ కళాశాల పరిస్థితి - వసతుల్లేక విద్యార్థుల విలవిల - Lack Of Facilities In Bhupalapalli Junior College - LACK OF FACILITIES IN BHUPALAPALLI JUNIOR COLLEGE

Lack Of Facilities In Bhupalpally Govt Jr College : భూపాలపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మౌలిక వసతుల కొరత వేధిస్తోంది. తరగతి గదులు, తాగు నీటి సమస్య, పరిశుభ్రత లేమితో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. జీతాల్లేక తాత్కాలిక సిబ్బంది కూడా అవస్థలు పడుతున్నారు. సమస్యలను గుర్తించి పరిష్కరించాలని కళాశాల సిబ్బంది ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

LACK OF FACILITIES IN BHUPALAPALLI JUNIOR COLLEGE
LACK OF FACILITIES IN BHUPALAPALLI JUNIOR COLLEGE (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 6, 2024, 2:10 PM IST

అధ్వాన్నంగా భూపాలపల్లి జూనియర్​ కళాశాల - వసతుల్లేక విద్యార్థుల విలవిల (Lack Of Facilities In Bhupalpally Govt Jr College)

Lack Of Facilities In Bhupalpally Junior College : ప్రభుత్వ కళాశాలల్లో పేద, మధ్య తరగతి విద్యార్థులే ఎక్కువగా చదువుతుంటారు. భూపాలపల్లి జిల్లాలోని 5 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మౌలిక సౌకర్యాలు కరవయ్యాయి. గదుల కొరత వేధిస్తోంది. మరుగుదొడ్లకు నీళ్ల సరఫరా లేదు. సిబ్బందే బకెట్లతో నీళ్లు మోసుకెళ్తున్నారు. ఎంత కష్టపడినా జీతాలు సమయానికి ఇవ్వడం లేదని పారిశుద్ధ్య సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెక్కాడితే గానీ తిండి దొరకని పరి‌స్థితి ఉందని, జీతాలు ఇచ్చి తమను ఆదుకోవాలని కన్నీరు పెట్టుకుంటున్నారు.

Lack Of Water Facilities In College : భూపాలపల్లి కృష్ణా కాలనీ సమీపంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో తాగునీటి బోరు ఉంది. కానీ పైపులైన్ సౌకర్యం లేక కొన్నేళ్లుగా నిరుపయోగంగా ఉంటోంది. మూత్రశాలలు బాలికలు, బాలురకు వేరుగా ఉన్నా, వాటికి నీటి సౌకర్యం లేదు. నల్లాలు ధ్వంసమయ్యాయి. మరుగుదొడ్లు పూర్తిగా శిథిలావస్థలో ఉండటంతో విద్యార్థులతో పాటు లెక్చరర్లు కూడా అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.

సమస్యలపై అధికారులు స్పందించాలని కోరుతున్న లెక్చరర్లు : కళాశాలలో కొద్ది నెలల క్రితం ఆర్వో ప్లాంట్ పాడవ్వడంతో స్వచ్ఛమైన తాగునీరు అందడం లేదు. సమస్యలు తిష్ట వేయడం వల్లే ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ఆదరణ తగ్గుతోందని అధ్యాపకులు చెబుతున్నారు. సమస్యలపై పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా, పట్టించుకోలేదని లెక్చరర్లు వాపోతున్నారు. జూనియర్‌ కళాశాలల్లో సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని వారు కోరుతున్నారు. అధికారులు స్పందించి కళాశాల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపించాలని విద్యార్థులు కోరుతున్నారు.

"జిల్లా కేంద్రం కావడం వల్ల మారుమూల గ్రామాల నుంచి వచ్చి ఈ కళాశాలలో చదువుకునే విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. ఇక్కడ అనేక సమస్యలు విద్యార్థులను వేధిస్తున్నాయి. సంబంధిత అధికారులు సమస్యలపై దృష్టి సారించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరుతున్నాం. ఈ కళాశాలలో క్లాస్​రూమ్​లు ఉన్నాయి. కానీ ప్రయోగశాలలు లేవు. అందువల్ల వీటిని ఏర్పాటు చేస్తే విద్యార్థులకు సౌలభ్యంగా ఉంటుంది." - అధ్యాపక సిబ్బంది

'తప్పతాగి మా గది తలుపులు కొడుతున్నారు - మాకు రక్షణ కల్పించండి'

రోడ్డుపై బైఠాయించిన నిజాం కళాశాల విద్యార్థినులు - వసతి గృహంలో సదుపాయాలు కల్పించాలని డిమాండ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.