ETV Bharat / state

కరెంట్ కష్టాలు : ఆ కాలనీలో 300 ఇళ్లకు ఒక్కటే మీటర్- మరి బిల్లు ఎంతో తెలుసా? - Lack of electricity distribution

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 29, 2024, 4:37 PM IST

Updated : Jul 29, 2024, 5:00 PM IST

Electricity Problems in Mahabubabad : ఆ కాలనీలో 300 ఇళ్లు ఉన్నాయి. అయినా విద్యుత్‌ స్తంభాలు మాత్రం లేవు. ఒక్కగానొక్క మీటరుతోనే కరెంటు కష్టాలు తీర్చుకుంటున్నారు అక్కడి ప్రజలు. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతంలో అనుకుంటే పొరపాటే, జిల్లా కేంద్రమైన మహబూబాబాద్‌లోని కాలనీ పరిస్థితి. ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యంతో తమ ప్రాంతంలో మౌలిక సౌకర్యాలు కల్పించడంలేదని కాలనీవాసులు వాపోతున్నారు.

LACK OF ELECTRICITY DISTRIBUTION
Electricity Problems in Mahabubabad : (ETV Bharat)

Electricity Problems in Mahabubabad : మహబూబాబాద్ జిల్లా 26వ వార్డు సమీపంలోని మందకొమురమ్మనగర్‌ కాలనీవాసులు మౌలిక వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ స్థలంలో ఇళ్లు కట్టుకున్నారంటూ అధికారులు ఆ కాలనీలో విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటుచేయలేదు. దీంతో పరిశ్రమ కోసం ఆ ప్రాంతంలో ఒకరు తీసుకున్న మీటరే ఆ కాలనీలోని కొందరి కరెంటు కష్టాలు తీరుస్తోంది. అక్కడ గృహాలు నిర్మించుకున్నవారిలో 136 మందికి గత ప్రభుత్వం పట్టాలిచ్చింది.

దినదిన గండం : శిథిలావస్థకు చేరిన నర్సంపేట ఎమ్మార్వో కార్యాలయం - Narsampet Registration Office

ఒక్కటే మీటరు : వారిలో 115 మందికి పురపాలక సంఘం ఇంటి నంబర్లను కేటాయించింది. అయినా అధికారులు మాత్రం కాలనీలో విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు చేయలేదు, వీధిదీపాలు బిగించలేదు. దీంతో వారంతా కర్రలు, చెట్లకొమ్మలే ఊతంగా సర్వీసు తీగల నుంచి వైర్లు ఏర్పాటుచేసుకుని విద్యుద్దీపాలు బిగించుకుంటున్నారు. ఉన్న ఒక్కగానొక్క మీటరుకు ప్రతినెలా రూ.50 వేల నుంచి రూ.65 వేల వరకు బిల్లు వస్తుండగా, ఇంటికి కొంత చెల్లిస్తున్నారు.

అధికారుల నిర్లక్ష్యం : అయితే, ప్రభుత్వం పేదలకు విద్యుత్‌ రాయితీ ఇస్తుంటే, తామెందుకు బిల్లులు చెల్లించాలంటూ 4 నెలలుగా వాటిని చెల్లించడంలేదు. ఆ బిల్లు రూ.2.65 లక్షలకు పేరుకుపోయింది. విద్యుత్‌శాఖ అధికారులు స్తంభాలు ఏర్పాటు చేయకపోవడం, పురపాలక సంఘం అధికారులు పూర్తిస్థాయిలో ఇళ్ల నంబర్లను కేటాయించకపోవడంతో మీటర్లకు దరఖాస్తు చేసుకోలేదని కాలనీవాసులు చెబుతున్నారు.

పురపాలక సంఘం ఖర్చులను భరిస్తే కాలనీలో స్తంభాలు ఏర్పాటు చేసి, మీటర్లు బిగిస్తామని ఎన్‌పీడీసీఎల్‌ మహబూబాబాద్‌ డీఈఈ విజయ్‌ తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ కాలనీలో విద్యుత్తు స్తంభాలు ఏర్పాటు చేసి, మౌలిక సౌకర్యాలు కల్పించాలని కాలనీవాసులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

మా కాలనీలో విద్యుత్​ సౌకర్యం లేదు. అక్కడ ఉన్న ఒక్క మీటరుకు అందరం కనెక్షన్​ తీసుకుని వాడుకుంటున్నాం. మా కాలనీలో రోడ్లు కూాడా వేయలేదు. ప్రభుత్వ అధికారులు మా ఇళ్లకు నెంబర్లు కేటాయించి విద్యుత్ కనెక్షన్ కల్పించాలని కోరుతున్నాము. - సోమన్న, కాలనీవాసి

మేము మంద కొమురమ్మనగర్ కాలనీవాసులం. మా కాలనీలో విద్యుత్​ సౌకర్యం కల్పించలేదు. డ్రైనేజీ, రోడ్లు వేయలేదు. గతంలో అధికారులు ఇళ్లకు నెంబర్లు కేటాయించారు. కానీ విద్యుత్ సౌకర్యం కల్పించలేదు. ప్రభుత్వం మా కాలనీ వాసులకు గృహజ్యోతి పథకం కల్పించాలి. మా కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలి. - సరిత, కాలనీవాసి

దిల్లీ సివిల్స్ అభ్యర్థుల మృతి ఘటన - హైదరాబాద్​లోనూ అలాంటి కోచింగ్ సెంటర్లు బోలెడు - HYDERABAD COACHING CENTRES ISSUES

రేపే రుణమాఫీ రెండో విడత ప్రారంభం - రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు మాఫీ - Crop Loan Waiver in Telangana

Last Updated : Jul 29, 2024, 5:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.