ETV Bharat / state

భద్రాద్రిలో పోటెత్తిన వరద - చిక్కుకున్న 28 మంది కూలీలు - రక్షించిన ఎన్ఢీఆర్ఎఫ్‌ సిబ్బంది - Labourer TRAPPED IN BHADRADRI FLOOD - LABOURER TRAPPED IN BHADRADRI FLOOD

Labourer Trapped Bhadradri Floods : భద్రాద్రిలో వరదలో 28 మంది కూలీలు చిక్కుకున్నారు. పెద్దవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగి కూలీలు చిక్కుకోగా, తక్షణమే స్పందించిన అధికార యంత్రాంగం, అందరినీ సురక్షితంగా కాపాడారు.

20 People Trapped in Bhadradri Floods
20 People Trapped in Bhadradri Floods (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 18, 2024, 5:38 PM IST

Updated : Jul 18, 2024, 9:51 PM IST

28 People Trapped in Bhadradri Floods : ఒక్కసారిగా పోటెత్తిన వరద, చుట్టుముట్టిన వర్షఫు నీరు, ఒక్కసారిగా ఊహించని విధంగా వరదల్లో చిక్కుకున్న 28 మంది బాధితులు ఎట్టకేలకు సురక్షితంగా బయటపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారాయణపురం కట్టమైసమ్మ ఆలయం సమీపంలో రహదారికి నాలుగు వైపులా వరద ప్రవాహం చుట్టేడయంతో మధ్యాహ్నం పలువురు రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రయాణికులు చిక్కుకున్నారు.

పొలం పనులకు వెళ్లిన వారు వరద తీవ్రత పెరగడంతో బయటపడేందుకు ప్రయత్నించినా ప్రవాహం పెరిగి భారీగా వరద చుట్టుముట్టింది. దీంతో 21 మంది ఒకచోట, ఆరుగురు ఇంకోచోట, మరో వ్యక్తి మరొకచోట ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. పశువుల కాపరులు ఆరుగురు చెట్లు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. డీసీసీబీ డైరెక్టర్ పుల్లారావు వరదల్లో చిక్కుకుని చెట్టుపై తలదాచుకున్నారు. రహదారిపై నుంచి వరద ప్రవాహం పెరిగి ఆందోళనకర పరిస్థితి తలెత్తింది. అయినా బాధితులంతా ఒక్కచోటే ఒకరిసాయంతో ఇంకొకరు కదలకుండా నిలబడ్డారు.

దీనికి తోడు పెద్దవాగు ప్రాజెక్టు గతంలో ఎన్నడూ లేని రీతిలో వరద ఉద్ధృతి ఒకేసారి పోటెత్తింది. ఏపీలోని బుట్టాయిగూడెం మండలంలో కొన్ని చెరువులు తెగిపోవడంతో ఆ వరద కూడా పెద్దవాగుకు రావడంతో వరద ఉద్ధృతి మరింత తీవ్రమైంది. ఈ పరిస్థితుల్లో వరద తీవ్రత అంతకంతకూ పెరిగి బాధితులు హాహాకారాలు చేశారు. బాధితులతో పాటు వరదల్లో చిక్కుకున్న వేలేరుపాడు వైద్యాధికారిణి అనూష ఏలూరు కలెక్టర్, పోలవరం ఎమ్మెల్యేకు సమాచారం చేరవేశారు. స్థానికుల ద్వారా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సమాచారం చేరవేశారు.

తక్షణం స్పందించిన మంత్రి తుమ్మల : రుణమాఫీ ప్రారంభ కార్యక్రమంలో ఉండగా మంత్రి తుమ్మలకు సమాచారం అందడంతో వెంటనే సీఎం కార్యదర్శి శేషాద్రితో ఆయన మాట్లాడారు. ఏపీ సీఎస్​తో మాట్లాడి వెంటనే హెలికాప్టర్ పంపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంత్రి పొంగులేటి సైతం ఏపీ సీఎస్ నీరబ్ కుమార్​తో మాట్లాడి బాధితులను సురక్షితంగా కాపాడాలని అన్నారు. మంత్రులిద్దరూ భద్రాద్రి జిల్లా కలెక్టర్​, ఎస్పీలతో మాట్లాడి తక్షణమే చేరుకుని సహాయక చర్యలు అందించాలని ఆదేశించారు.

సురక్షితంగా 28 మంది బయటకు : అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆది నారాయణ, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సంఘటనా స్థలంలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం వరకు బాధితులు గంటల తరబడి వరదల్లోనే ఉండాల్సి వచ్చింది. తెలంగాణ, ఏపీ నుంచి రెండు హెలికాప్టర్లు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. మూడు దఫాలుగా మొత్తం 22 మంది బాధితుల్ని నారాయణపురంలోని సురక్షిత ప్రాంతానికి చేర్చారు. బచ్చవారిగూడెం సమీపంలో వంతెనపై చిక్కుకున్న మరో ఆరుగురు బాధితులను ఎన్డీఆర్​ఎఫ్ బృందం పడవల ద్వారా సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. వరద ప్రవాహంలో 20 మేకలు, రెండు ఎద్దులు గల్లంతయ్యాయి. కారు, ఆటో, పది ద్విచక్రవాహనాలు చిక్కుకున్నాయి.

Bhadrachalam Godavari river has accumulated silt : భద్రాద్రి స్నానఘట్టాల వద్ద పేరుకుపోయిన బురద.. భక్తులకు తీవ్ర ఇబ్బందులు..

Warangal Vignana Peetham submerged : నీట మునిగిన విజ్ఞాన పీఠం.. వరదపాలైన విలువైన సంపద

Last Updated : Jul 18, 2024, 9:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.