ETV Bharat / state

డిసెంబర్​లో రైల్వే గుర్తింపు సంఘం ఎన్నికలు - హోరాహోరీగా కార్మిక సంఘాల ప్రచారం - RAILWAY RECOGNITION BOARD ELECTIONS

దేశవ్యాప్తంగా డిసెంబరు 4, 5, 6వ తేదీల్లో రైల్వే గుర్తింపు సంఘం ఎన్నికలు - నాంపల్లి రైల్వే స్టేషన్​లో ప్రచారం నిర్వహించిన సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ నాయకులు

Railway Recognition Board Elections 2024
Campaigning for Railway Recognition Board Elections (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 12, 2024, 11:59 AM IST

Campaigning for Railway Recognition Board Elections : రైల్వే గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికలు వేడి పుట్టిస్తున్నాయి. దేశవ్యాప్తంగా డిసెంబర్ 4, 5, 6వ తేదీల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. బరిలో నిలిచిన కార్మిక సంఘాలు హోరాహోరీగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ప్రచారంలో భాగంగా నాంపల్లి రైల్వే స్టేషన్​లో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ నాయకులు సోమవారం ప్రచారం నిర్వహించారు. ఇంజిన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని సంఘ్ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య, సంఘ్ సంయుక్త ప్రధాన కార్యదర్శి భరణి భాను ప్రసాద్, డివిజనల్ కార్యదర్శి ప్రభు రాజు, జోనల్ మహిళా నాయకురాలు సత్యవాణి ఓటర్లను అభ్యర్థించారు.

దేశవ్యాప్తంగా డిసెంబర్ 4, 5, 6 తేదీల్లో రైల్వే గుర్తింపు ఎన్నికలు జరుగుతున్నాయి. హైదరాబాద్​లో ఎన్నికల ప్రచారానికి వచ్చాం. ప్రతి కార్మికుడు మర్రి రాఘవయ్య ఇంజిన్ గుర్తుకు ఓటు వేసి సౌత్ సెంట్రల్ రైల్వే సంఘాన్ని గెలిపించుకోవాలి. రైల్వే కార్మికులకు ఏవైనా పనులు జరిగాయంటే అది కేవలం సౌత్ సెంట్రల్ రైల్వే వల్లే. ఈసారి జరిగే ఎన్నికల్లో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ సంఘ్​కు​ ఓట్లు వేసి గెలిపించాలి. - భరణి భాను ప్రసాద్, సౌత్ సెంట్రల్ లైల్వే సంఘ్ సంయుక్త ప్రధాన కార్యదర్శి

రైల్వే కార్మిక సంఘాల ఎన్నికలు : సంఘ్ సంయుక్త ప్రధాన కార్యదర్శి భరణి భాను ప్రసాద్ మాట్లాడుతూ, రైల్వే కార్మికులకు ఏమైనా పనులు జరిగాయంటే అది కేవలం సౌత్ సెంట్రల్ లైల్వే ఎంప్లాయిస్ సంఘ్ వల్లే జరిగాయని అన్నారు. 2013లో జరిగిన సీక్రెట్ బ్యాలెట్ ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని అందించారని, ఈ ఎన్నికల్లో కూడా మర్రి రాఘవయ్యకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. రైల్వే ఆసుపత్రి నుంచి భారీ ర్యాలీ చేపట్టారు. ఆటపాటలతో డాన్స్​లు చేస్తూ ఇంజిన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేశారు. ప్రచారంలో భాగంగా ట్రిప్ షెడ్డు ఇంజినీరింగ్, ఆపరేటింగ్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కార్మికులతో పాటు సీఎండబ్ల్యూ, ఏసీ అండ్ ఎలక్ట్రికల్ కార్మికులను కలిసి మర్రి రాఘవయ్యను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సంఘ్ నాయకులు కోరారు.

రైల్వే ప్రయాణికుల కోసం 'సూపర్ యాప్'- అన్ని సౌకర్యాలు ఒకే చోట- ఇక నో టెన్షన్ బాస్..!

ముంబయి వైపు నాలుగు లైన్ల రైలు మార్గం - కీలకదశలో మూడు ప్రతిపాదిత రైల్వే ప్రాజెక్టులు !

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.