ETV Bharat / state

ఎంజీఎం ఆస్పత్రిలో పవర్​ కట్​ - ఈ ఘటనకు బాధ్యత ఎవరు వహిస్తారు? : కేటీఆర్ - KTR React on Warangal MGMH Issue - KTR REACT ON WARANGAL MGMH ISSUE

KTR Tweet on Warangal MGMH Issue : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంపై బీఆర్ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. అస్పత్రిలో మంగళవారం రాత్రి కరెంట్​ లేక రోగులు పడుతున్న దీన పరిస్థితిని తెలియజేస్తూ ఈనాడు పత్రికలో వచ్చిన వార్తను తన ఎక్స్​ ఖాతాలో షేర్​ చేశారు. ఈ ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

KTR Tweet on Power Cuts in Warangal Hospital
KTR Tweet on Warangal MGMH Issue (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 22, 2024, 1:04 PM IST

KTR Tweet on Warangal MGMH Issue : వరంగల్​ ఆస్పత్రిలో మంగళవారం రాత్రి విద్యుత్​ సరఫరాకు అంతరాయం కలిగి రోగులు ఆరు బయటే చికిత్స పొందడంపై బీఆర్ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. ఆస్పత్రిలో రోగుల దీనావస్థను ఈనాడు పత్రికలో ప్రచురితమైన కథనం ద్వారా ఆయన తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఆ పేపర్ కట్​ను ఎక్స్ వేదికగా పోస్టు చేసి ఈ ఘటనపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

KTR Reaction on Warangal Power Cut Issue : వరంగల్​ ఎంజీఎం ఆస్పత్రిలో సుమారు 5 గంటల పాటు విద్యుత్​ సరఫరాకు అంతరాయం కలిగిందని కేటీఆర్ తెలిపారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న చిన్నారులు, వృద్దులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న ఆస్పత్రులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా నిర్వహించలేకపోతోందని మండిపడ్డారు. కరెంట్​ కోతలు లేవని పదే పదే చెబుతున్న కాంగ్రెస్​ నాయకులు ఈ ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలని నిలదీశారు. ఆస్పత్రిలో మంగళవారం రాత్రి చీకటిలో చికిత్స పొందుతున్న మహిళ ఫొటోను షేర్ చేశారు.

నాంపల్లి మల్టీలెవల్​ కారు పార్కింగ్​ను కాంగ్రెస్​ పూర్తి చేయడం సంతోషకరం : కేటీఆర్ - KTR Tweet Multi Level Car Parking

అసలు ఏమి జరిగిందంటే : ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కైన వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో మంగళవారం సాయంత్రం సుమారు అయిదు గంటలపాటు విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలిగింది. ఆసుపత్రిలోని అత్యవసర వైద్యవిభాగం ఏఎంసీ, ఆర్‌ఐసీయూ, నవజాత శిశువుల వార్డుల్లో వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్న రోగులు, చిన్నారులు ఊపిరాడక తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఆసుపత్రిలో నాలుగు జనరేటర్లు ఉండగా అందులో ఒకటి మాత్రమే పనిచేస్తోంది. దీనివల్ల విద్యుత్​ ఆగిపోతే ఒక్క జనరేటర్​తో ఆస్పత్రి మొత్తానికి కరెంట్​ సరఫరా​ సాధ్యం కాదు. విద్యుత్​ ఆగిపోవడంతో వెనువెంటనే ఒక్క జనరేటర్​కు మరమ్మతు చేశారు. దీంతో ఐసీయూ రోగులకు ప్రాణాపాయం తప్పింది.

విద్యుత్​ సరఫరా ఎందుకు ఆగిపోయిందని కారణాలు వెతకగా ఆసుపత్రిలోని నర్సింగ్​ స్కూల్​ వసతి గృహం వెనక ఉన్న విద్యుత్ స్తంభంపై తీగలకు గాలిపటం దారం తగలడంతో అంతరాయం కలిగిందని అధికారులు భావించారు. దానికి మరమ్మతులు చేసినా విద్యుత్​ సరఫరా అవ్వలేదు. తర్వాత సబ్​స్టేషన్​ నుంచి ఆసుపత్రిలో వచ్చే విద్యుత్​ దగ్గరే లోపం ఉందని గుర్తించి మరమ్మతు చేశారు. చివరికి విద్యుత్​ వచ్చింది. సుమారు సాయంత్రం 4.30 గంటలకు పోయిన కరెంట్​ రాత్రి 9.30 గంటలకు పునరుద్ధరించారు.

కేసీఆర్ పాలన సాక్షిగా 'ఇది తెలంగాణ దశాబ్ది' - వెయ్యేళ్లయినా చెక్కు చెదరని పునాది : కేటీఆర్ - KTR TWEET ON TS DECADE DEVELOPMENT

కాంగ్రెస్‌ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చింది : కేటీఆర్‌ - MLC Election KTR Campaign

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.