ETV Bharat / state

బీఆర్​ఎస్​ చేసిన అభివృద్ధిపై కాంగ్రెస్​ పాలకులు తప్పుడు ప్రచారాలు మానుకోవాలి : కేటీఆర్ - KTR TWEET ON TELANGANA SUCCESS

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 21, 2024, 1:15 PM IST

KTR Tweet Today : ప్రపంచ ప్రఖ్యాత మ్యాగజైన్లు సైతం తెలంగాణ పదేళ్ల ప్రగతి ప్రస్తావిస్తూ గొప్పగా కొనియాడుతున్నాయని బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ తెలిపారు. ఇకనైనా కాంగ్రెస్​ పాలకులు బీఆర్​ఎస్​ చేసిన అభివృద్ధిపై తప్పుడు ప్రచారాలు నిలిపివేస్తారని ఆశిస్తున్నానంటూ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రగతి, సక్సెస్​ఫుల్​ మోడల్​పై ది ఎకనమిస్ట్​ మ్యాగజైన్​ కథనంపై కేటీఆర్​ ఎక్స్​ వేదికగా ట్వీట్​ చేశారు.

KTR Tweet
KTR Tweet (ETV Bharat)

KTR Tweet on The Economist Magazine Article : రాష్ట్ర ప్రగతి, సక్సెస్​ఫుల్​ మోడల్​పై 'ది ఎకనమిస్ట్​ మ్యాగజైన్​ కథనం'పై బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. ఇప్పటికైనా పదేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానంపైన బురద జల్లడం మానుకోవాలని సూచించారు. అభివృద్ధి యజ్ఞాన్ని ముందుకు తీసుకుపోవాలని కాంగ్రెస్​ ప్రభుత్వానికి కేటీఆర్​ సూచనలు చేశారు. ఈ మేరకు ఎక్స్​ వేదికగా ట్వీట్​ చేశారు.

ప్రపంచ ప్రఖ్యాత మ్యాగజైన్లు సైతం తెలంగాణ పదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని గొప్పగా కొనియాడుతున్న నేపథ్యంలో, ఇకనైనా కాంగ్రెస్​ పాలకులు బీఆర్​ఎస్​ చేసిన అభివృద్ధిపై తప్పుడు ప్రచారాలు నిలిపివేస్తారని ఆశిస్తున్నానంటూ కేటీఆర్​ తెలిపారు. బీఆర్​ఎస్​ సాధించిన అభివృద్ధిని ఎలాంటి అడ్డంకులు లేకుండా కాంగ్రెస్​ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని ఆశిస్తున్నానంటూ పేర్కొన్నారు.

"ఇప్పటికైనా పదేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం పైన బురద జల్లడం మానుకోవాలి. అభివృద్ధి యజ్ఞాన్ని ముందుకు తీసుకుపోవాలని కాంగ్రెస్​ ప్రభుత్వానికి సూచన. ప్రపంచ ప్రఖ్యాత మ్యాగజైన్లు సైతం తెలంగాణ పదేళ్ల ప్రగతి ప్రస్తానాన్ని గొప్పగా కొనియాడుతున్న నేపథ్యంలో, ఇకనైనా కాంగ్రెస్​ పాలకులు బీఆర్​ఎస్​ చేసిన అభివృద్ధిపై తప్పుడు ప్రచారాలు నిలిపివేస్తారని ఆశిస్తున్నాను. బీఆర్​ఎస్​ సాధించిన అభివృద్ధిని ఎలాంటి ఆటంకం లేకుండా ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నాను." - కేటీఆర్ ట్వీట్

తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయాలను పొందుపర్చిన మ్యాగజైన్ : కొత్త రాష్ట్రమైన తెలంగాణ పదేళ్లలో అద్భుతమైన ప్రగతిని సాధించి మరిన్ని కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసేందుకు ఒక సక్సెస్​ ఫుల్​ మోడల్​ అయిందంటూ ఎకనమిస్ట్​ కథనం పేర్కొంది. దీనికి తెలంగాణ సాధించిన విజయాల గణాంకాలను ఉదహరించింది. తెలంగాణ ఏర్పడిన నాటికి స్థాపిత విద్యుత్​ సామర్థ్యం 7.8 గిగావాట్ల నుంచి 19.3 గిగావాట్లకు పెరిగింది. ఐటీ ఎగుమతులు 2014 నుంచి 2023 వరకు 9 ఏళ్లలో నాలుగు రెట్లు పెరిగాయి. ఐటీ ఉద్యోగాలు దాదాపు మూడు రెట్లు పెరిగి తొమ్మిది లక్షలకు చేరుకున్నాయి. రాష్ట్రం ఏర్పడిన 10 సంవత్సరాల లోపు దేశ జీడీపీ 4.1 నుంచి 4.9 శాతానికి తెలంగాణ వాటా పెరిగిందని ఎకానమిస్ట్​ ఒక కథనంలో తెలిపింది.

ఆయనేం కేంద్రమంత్రయ్యా బాబు - కొత్త ప్రాజెక్టులు తేవాల్సిందిపోయి ఉన్నవి అమ్మేస్తున్నారు : కేటీఆర్ - KTR ON SINGARENI COAL MINES AUCTION

నీట్‌పై ఎన్డీయే ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది?: కేటీఆర్ - KTR Tweet On NEET Exam

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.