KTR Tweet on BRS Leaders Migration : తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్‌కు (BRS Leaders Migration in Telangana) వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటి వరకు అవకాశం రాదని నిర్ణయించుకొని కాంగ్రెస్, బీజేపీలో చేరుతున్నారు. భారత్ రాష్ట్ర సమితి వలసలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ క్రమంలోనే తాజా పరిణామాలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
Lok Sabha Elections 2024 : శూన్యం నుంచి సునామీ సృష్టించి, అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి కేసీఆర్ అని కేటీఆర్ గుర్తుచేశారు. ఒక్కడుగా బయల్దేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేశారని చెప్పారు. ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలన్నింటిని ఛేదించిన వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని తెలిపారు. అలాంటి ధీరుడిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బ తీయాలనుకునే రాజకీయ నేతలకు రాష్ట్ర ప్రజలే జవాబు చెబుతారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ప్రజాశీర్వాదం, మద్దతుతో 14 సంవత్సరాలు పోరాడి ఉద్యమ పార్టీగా కేసీఆర్ తెలంగాణ సాధించారని కేటీఆర్ అన్నారు. అదేవిధంగా రాష్ట్ర దశను, దిశను మార్చి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన ఆయణ్ను, బీఆర్ఎస్ పార్టీని, ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు నికార్సైన కొత్తతరం నాయకత్వం తయారు చేస్తామని, పోరాట పంథాలో కదం తొక్కుదామని కేటీఆర్ ఎక్స్ వేదికగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఎన్నికల ప్రచార జోరు పెంచనున్న కారు - కార్యాచరణపై గులాబీ నేతల కసరత్తు - BRS Strategy on MP Elections
ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు ఎదురు దెబ్బలు : సార్వత్రిక ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు భారీ ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటి వరకు అవకాశం రాదని నిర్ణయించుకున్న సిట్టింగ్ ఎంపీలు, సీనియర్ నేతలు పార్టీని వీడుతున్నారు. ఎంపీలు రంజిత్‌రెడ్డి, పసునూరి దయాకర్, వెంకటేశ్ నేత, ఎమ్మెల్యే దానం నాగేందర్ హస్తం పార్టీలో చేరారు. మరో ఎంపీ పోతుగంటి రాములు బీజేపీలో చేరారు. తాజాగా గులాబీ పార్టీ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు (KK To Join Congress) కూడా షాక్ ఇచ్చారు. ఆయన తన కుమార్తె, జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మితో కలిసి శనివారం హస్తం పార్టీలో చేరనున్నారు.
BRS Leaders Join to Congress and BJP : అదేవిధంగా స్టేషన్‌ఘన్‌పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, తన కుమార్తె కావ్యతో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఆయనతో మంతనాలు జరిపిన హస్తం పార్టీ నేతలు కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ఇప్పించేలా హామీ ఇచ్చారు. ఈ పరిణామాలతో గులాబీ పార్టీ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇటు పార్టీ నేతలను, అటు శ్రేణులను కాపాడుకునేందుకు వ్యూహాలను రచిస్తోంది. మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు భారత్ రాష్ట్ర సమితి ప్రణాళికలు రూపొందిస్తోంది.
ఏప్రిల్ 13న చేవెళ్లలో కేసీఆర్ బహిరంగ సభ : కేటీఆర్ - KCR CHEVELLA PUBLIC MEETING