ETV Bharat / state

లోక్‌సభ ఎన్నికలయ్యాక రేవంత్‌రెడ్డి బీజేపీలోకి వెళ్లడం ఖాయం : కేటీఆర్ - ktr fires on revanth reddy

KTR Fires on Revanth Reddy : కాంగ్రెస్‌కు సార్వత్రిక ఎన్నికల్లో 40 సీట్లు కూడా రావని, లోక్‌సభ ఎన్నికలయ్యాక రేవంత్‌రెడ్డి బీజేపీలోకి వెళ్లడం ఖాయమని మాజీ మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మోదీ పాట పాడుతున్నారన్న కేటీఆర్‌, ఎన్నికల్లో బీఆర్ఎస్​ను అనేక ఇబ్బందులు పెట్టారని మండిపడ్డారు.

BRS KTR FIRES ON PM MODI
KTR Fires on Revanth Reddy
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 26, 2024, 3:13 PM IST

Updated : Mar 26, 2024, 4:21 PM IST

KTR Fires on Revanth Reddy : రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమా? బీజేపీ ప్రభుత్వమా? అని అర్థం కావడం లేదని మాజీ మంత్రి కేటీఆర్(KTR) పేర్కొన్నారు. తెలంగాణ భవన్ లో జరిగిన సికింద్రాబాద్ లోక్​సభ నియోజకవర్గ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం రేవంత్​రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోదీని చౌకీదార్ చోర్ అని రాహుల్ గాంధీ అంటుంటే, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం బడే భాయ్ అంటున్నారన్నారు.

ఆధారాలు లేకుండా ఫేక్ న్యూస్ రాస్తే ఊరుకునేది లేదు : కేటీఆర్​ - KTR Fires on CM Revanth

మోదీ చోటాభాయ్ రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) గుజరాత్ మోడల్​ను పొగుడుతున్నారని, బీజేపీ పాట పాడుతున్నారన్నారని మండిపడ్డారు. రాబోయే లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవదని, 40 సీట్లు కూడా రావని దుయ్యబట్టారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలోకి పోయే మొదటి నేత రేవంత్ రెడ్డేనని పేర్కొన్నారు. జీవితాంతం కాంగ్రెస్​లో ఉంటా అని రేవంత్ రెడ్డి ఎందుకు చెప్పడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు.

రేవంత్​రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయచేతగాక ఫోన్ ట్యాపింగ్ అని లీకులు ఇస్తున్నారని, విచారణ చేసి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, భయపడే వాళ్లు లేరని కేటీఆర్ అన్నారు. సామంత రాజులా దిల్లీకి 2500 కోట్లు కప్పం కట్టారని, ఇందుకోసం అందరినీ బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ పరిధిలో గత మూడు నెలలుగా భవన నిర్మాణ అనుమతులు ఎందుకు అపారని కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ, కిషన్ రెడ్డి(Kishan reddy) హైదరాబాద్​కు చేసిందేమీ లేదన్న కేటీఆర్, కేసీఆర్ కట్టిన 36 ఫ్లై ఓవర్లు, కేంద్రం చేపట్టిన అంబర్​పేట ఫ్లై ఓవర్లు గురించి మాట్లాడాలని కోరారు.

KTR Reacts on Kavitha Arrest : బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని దుష్ప్రచారం చేస్తే హైదరాబాద్​లో ఎవరూ నమ్మలేదని, దురదృష్టకరంగా కాంగ్రెస్ చిల్లర ప్రచారాన్ని కొందరు నమ్మారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కవితను అరెస్ట్ చేయలేదని బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని గతంలో కాంగ్రెస్ నేతలు అన్నారన్న కేటీఆర్, ఇవాళ పగపట్టి అరెస్ట్ చేశారని తెలిపారు. ఇద్దరు ముఖ్యమంత్రులను కూడా అరెస్ట్ చేశారని, ఇపుడు కాంగ్రెస్ ఏమంటుందని ప్రశ్నించారు.

బీజేపీ, మోదీని ఆపాలంటే కేసీఆర్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ లాంటి ప్రాంతీయ పార్టీల నేతలతోనే సాధ్యమని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్​లో 8 లక్షల కుటుంబాలకు మంచినీటి బిల్లుల భారం మోపారని, బీఆర్ఎస్ తరపున పోరాడతామని తెలిపారు. జైశ్రీరాం అనేందుకు ఎవరికీ అభ్యంతరం లేదన్న కేటీఆర్, రాముడిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం భావ్యం కాదన్నారు. లిక్కర్ స్కాంలో అన్ని బయట పెడతామని కిషన్ రెడ్డి అంటున్నారని, వాటిని కోర్టుకు ఇవ్వాలని ఎవరు వద్దన్నారని ప్రశ్నించారు.

రాజకీయాల్లో హత్యలు ఉండవు, అత్మహత్యలు మాత్రమే ఉంటాయని, పార్టీ మారిన దానం నాగేందర్ నిర్ణయం తప్పని కేటీఆర్ పేర్కొన్నారు. అధికారం కోసం ఆశపడి, గెలిపించిన ప్రజలకు ద్రోహం చేసి వెళ్లారని ఆయన ఆక్షేపించారు. ఖైరతాబాద్ ప్రజలు బీఆర్ఎస్​ను గెలిపించి, దానం నిర్ణయం తప్పని నిరూపిస్తారనే నమ్మకం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్​లో పద్మారావు గెలుపుతో బీఆర్ఎస్ జైత్రయాత్ర మళ్లీ ప్రారంభం కావాలని కేటీఆర్ కోరారు.

"ప్రధాని నరేంద్ర మోదీని చౌకీదార్ చోర్ అని రాహుల్ గాంధీ అంటుంటే, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం బడే భాయ్ అంటున్నారు. రేవంత్​రెడ్డి గుజరాత్ మోడల్​ను పొగుడుతున్నారు. రాబోయే లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవదు, 40 సీట్లు కూడా రావు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలోకి చేరడం ఖాయం". - కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్

లోక్‌సభ ఎన్నికలయ్యాక రేవంత్‌రెడ్డి బీజేపీలోకి వెళ్లడం ఖాయం కేటీఆర్

పార్టీ ఫిరాయింపులపై ఉన్న దృష్టి పంట నష్టంపై లేదు ఎందుకు? : కేటీఆర్

ధ్వంసమైన అడవులను కంటికి రెప్పలా కాపాడిన దార్శనికుడు కేసీఆర్ : కేటీఆర్ - KTR about Forest in Telangana

Last Updated : Mar 26, 2024, 4:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.