ETV Bharat / state

ఆరు గ్యారంటీల హామీ ఇచ్చారు - మా ఆరుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తీసుకెళ్లారు : కేటీఆర్ - KTR SLAMS CONGRESS OVER DEFECTION

KTR Slams On Congress Over Party Defections : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది కాంగ్రెస్సే అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ ఏర్పడకముందు 9 సార్లు కాంగ్రెస్​కు అధికారం ఇచ్చారని వారు చేసిన అన్యాయానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు ఉద్యమించారని గుర్తు చేశారు.

KTR Fires On Congress
KTR Fires On Congress (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 9, 2024, 12:39 PM IST

Updated : Jul 9, 2024, 7:48 PM IST

KTR Slams On Congress Over Party Defections : ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులను ప్రొత్సహించింది కాంగ్రెస్సే అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీ రామారావు అన్నారు. ఆయారాం గయారాం సంస్కృతికి శ్రీకారం చుట్టిందే హస్తం పార్టీ అని ధ్వజమెత్తారు. 2014కు ముుందు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్​కు 9 సార్లు అధికారమిచ్చారు, కానీ ఆ పార్టీ చేసిన అన్యాయానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు ఉద్యమించారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ ఫలితంగా కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం సిద్ధించిందని తెలిపారు. రాష్ట్రంలో మొదటి పదేళ్లు కేసీఆర్ నేతృత్వంలో మంచి పాలన అందిందని పేర్కొన్నారు.

"అసెంబ్లీ ఎన్నికల సమయంలో వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంతకంతో హామీ ఇచ్చారు. సోనియా, రాహుల్​ గాంధీ, మల్లికార్జున ఖర్గే ముందు తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 7నెలలు పూర్తి అవుతుంది. కానీ ఇప్పటివరకు ఒక్క హామీని కూడా పూర్తి చేయలేదు. ఆరు గ్యారంటీలను మరిచిపోయింది. కానీ మా ఆరుగురు ఎమ్మెల్యేలను మాత్రం తీసుకుంది. ఆరుగురు ఎమ్మెల్సీలను, ఒక రాజ్యసభ ఎంపీలను కూడా తీసుకున్నారు." - కేటీఆర్​, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్

ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోమంటే ఇంత నిర్బంధమా ? : కేటీఆర్ - KTR Fires on Congress Assurances

KTR On Party Defections in Telangana : 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 4లక్షల ఓట్లతోనే అధికారం కోల్పోయినట్లు కేటీఆర్ తెలిపారు. సీఎం రేవంత్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంతకాలతో 6 గ్యారంటీల పత్రాన్ని తయారు చేశారని, ఏడాదిలో 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వాటి జాడ ఎటు పోయిందని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్​ క్యాలెండర్​ విడుదల చేస్తామన్నారు కానీ ఇంకా చేయలేదని మండిపడ్డారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని బీఆర్ఎస్​కు చెందిన ఆరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తీసుకెళ్లిపోయారని ధ్వజమెత్తారు. ఇచ్చిన గ్యారంటీలను మరిచి ఆరుగురు ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కాంగ్రెస్​లోకి తీసుకెళ్లారని మండిపడ్డారు.

చిరుద్యోగులపై ఇంత పగా? - పీర్జాదిగూడలో పేదల ఇళ్ల కూల్చివేతపై భగ్గుమన్న విపక్షాలు - Peerzadiguda Houses Demolition

రాహుల్​ గాంధీ రాజ్యాంగ స్ఫూర్తిని నిలపడంలో విఫలమయ్యారు : కేటీఆర్​ - KTR Fires On Rahul Gandhi

Last Updated : Jul 9, 2024, 7:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.