ETV Bharat / state

బల్లి పడిన టిఫిన్లు, ఎలుకలు తిరిగే చట్నీలతో - కాంగ్రెస్ పెద్ద మార్పే తెచ్చింది: కేటీఆర్ - KTR SLAMS CONGRESS OVER FOOD POISON

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 10, 2024, 2:50 PM IST

KTR Slams Congress Govt On Food Poison : మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అన్న రేవంత్ ప్రభుత్వం రాష్ట్రంలో పెద్ద మార్పే తీసుకువచ్చిందని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఎద్దేవా చేశారు. బల్లిపడిన టిఫిన్లు – చిట్టెలుకలు తిరిగే చట్నీలతో విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు.

KTR Accuses Congress Govt
KTR Accuses Congress Govt

KTR Slams Congress Govt On Hostel Conditions : మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్ద మార్పే తెచ్చిందని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆనాటి కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ హాస్టళ్లలో పురుగుల అన్నం, నీళ్ల చారు ఉంటే నేడు బల్లిపడిన టిఫిన్లు, చిట్టెలుకలు తిరిగే చట్నీలు దర్శనమిస్తున్నాయని అన్నారు. సుల్తాన్​పూర్ జేఎన్టీయూ హాస్టల్​లో చట్నీలో ఎలుక దర్శనం ఇవ్వడం, పలు హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్​పై ఎక్స్ ద్వారా కేటీఆర్ స్పందించారు.

ప్రజలు మార్పు రావాలి కాంగ్రెస్ కావాలని కోరుకుంటే మొత్తానికి కాంగ్రెసోళ్లు వచ్చాి, పెద్ద మార్పే తెచ్చారని కేటీఆర్ అన్నారు. భువనగిరి సాంఘిక సంక్షేమ పాఠశాలలో, కలుషిత ఆహారం తిన్న విద్యార్థి జీవితం విషాదాంతం గుర్తుచేశారు. కోమటిపల్లి హాస్టల్​లో ఉప్మాలో బల్లి పడి 20 మంది విద్యార్థులకు వాంతులు చేసుకున్నారనే వార్తలు షాక్​కు గురి చేశాయని పేర్కొన్నారు. సుల్తాన్ పూర్ జేఎన్టీయూ హాస్టల్​లో చట్నీలో చిట్టెలుక దర్శనంతో విద్యార్థులు బెంబేలెత్తి పోయారని మండిపడ్డారు. ఈ విషాహారం తింటే, విద్యార్థుల ప్రాణాలకు గ్యారెంటీ ఎవరని కేటీఆర్ ప్రశ్నించారు.

అల్లారుముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులకు భరోసా ఎక్కడ ఉందని నిలదీశారు. కలుషిత ఆహారం వల్ల, పిల్లలు ఆడుకోవాల్సిన వయసులో ఆసుపత్రుల పాలవుతున్నారని దుయ్యబట్టారు. అస్తవ్యస్థంగా మారిన ప్రభుత్వ వ్యవస్థ వల్లే, విద్యార్థులకు ఈ అవస్థలు వచ్చాయని పేర్కొన్నారు. ఇకనైనా కాంగ్రెస్ సర్కారు కళ్లు తెరవాలని లేకపోతే భావిభారత పౌరుల నిండు ప్రాణాలకే ప్రమాదమని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ ఈ వైఫల్యాలను సరిచేయకపోతే ఊహించని విషాదం ముంచుకొస్తొంది అంటూ ఆగ్రహం చెందారు.

'సీఎంగా మీకు మోకా వస్తే, డీఎస్సీ అభ్యర్థులకు ఇంత ధోకా చేస్తారా' - రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్ ఫైర్ - KTR Fires on CM Revanth Reddy

ఇకో పార్క్ పనులపై స్పందించిన కేటీఆర్ : మరోవైపు దేశంలోనే అతిపెద్ద ఏవియరీ, అక్వేరియం, బోర్డ్ వాక్ సౌకర్యాలతో పచ్చదనం కనువిందు చేసేలా సుందరమైన ల్యాండ్ స్కేప్ లతో బీఆర్ఎస్ సర్కారు చేపట్టిందని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తచేశారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇకో పార్క్ పనులు ప్రస్తుతం నిలిచిపోయాయని తమ దృష్టికి వచ్చినట్టు ఎక్స్ వేదికగా కేటీఆర్ పేర్కొన్నారు.

హిమాయత్ సాగర్ లేక్ ఫ్రంట్ లో వారాంతాల్లో క్యాంపింగ్ సైతం ఉండేలా 2022 అక్టోబర్ లో అప్పటి బీఆర్ఎస్ సర్కారు ఇకో పార్క్ ప్రాజెక్టును చేపట్టింది. అయితే, తాము అధికారంలో ఉన్నత వరకు ఆ పార్క్ పనులు సవ్యంగానే సాగినప్పటికీ, గత కొంత కాలంగా సరైన మద్దతు లేక పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయినట్టు కేటీఆర్ తెలిపారు. కొన్ని ఫోటోలను సైతం ఎక్స్​లో పంచుకున్నారు. తక్షణం ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకువెళ్లేందుకు సీఎంఓ చర్యలు చేపట్టాలని కేటీఆర్ ఎక్స్ వేదికగా కోరారు.

నిధుల సమీకరణ కోసం ప్రమాదకరమైన మార్గం - ఇలాగైతే మన బిడ్డలకు కొలువులు వచ్చేదెలా? : కేటీఆర్ - KTR OPPOSED GOVT LANDS MORTGAGE

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.