BRS Leader KTR on Medigadda Barrage : త్వరలోనే మేడిగడ్డ ఆనకట్టను సందర్శిస్తామని ప్రజలకు అన్ని వాస్తవాలను వివరిస్తామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. మేడిగడ్డ కొట్టుకుపోయిందని, కాళేశ్వరంలో రూ.లక్ష కోట్లు గంగపాలు అయిందంటూ చిల్లర ప్రచారం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు సిగ్గుతో తలదించుకోవాలని వ్యాఖ్యానించారు. అక్కడ జరిగిన చిన్న విషయంపై తప్పుడు ప్రచారం చేశారని ఆక్షేపించారు. ఇప్పుడు వరదను తట్టుకొని మేడిగడ్డ నిలబడిందని అదే కాళేశ్వరం గొప్పతనమని కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిలో..
— KTR (@KTRBRS) July 20, 2024
కాంగ్రెస్ కుట్రలే కొట్టుకుపోయాయి..
కానీ..
కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం..
సగర్వంగా తలెత్తుకుని సలాం చేస్తోంది..
పోటెత్తిన వరదకు దుష్టశక్తుల..
పన్నాగాలే పటాపంచలయ్యాయి..
కానీ..
కేసిఆర్ గారి సమున్నత సంకల్పం..
జై కొడుతోంది.. జల హారతి పడుతోంది...… pic.twitter.com/LcJDXn689C
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరిలో కాంగ్రెస్ కుట్రలే కొట్టుకుపోయాయని ఎక్స్ వేదికగా కేటీఆర్ ట్వీట్ చేశారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం సగర్వంగా తలెత్తుకుని సలాం చేస్తోందని అన్నారు. పోటెత్తిన వరదకు దుష్టశక్తుల పన్నాగాలే పటాపంచలయ్యాయని చెప్పారు. కానీ, కేసీఆర్ సమున్నత సంకల్పం జై కొడుతోంది, జల హారతి పడుతోందని పేర్కొన్నారు. లక్షల క్యూసెక్కుల గంగా ప్రవాహంలో లక్ష కోట్లు వృథా చేశారనే విమర్శలే గల్లంతయ్యాయని స్పష్టం చేశారు.
కానీ మేడిగడ్డ బ్యారేజీ మాత్రం మొక్కవోని దీక్షతో నిలబడిందని, కొండంత బలాన్ని చాటి చెబుతోందని కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుతంత్రాలు చేసినా దశాబ్దాలుగా దగాపడ్డ ఈ తెలంగాణ నేలకు ఇప్పటికీ, ఎప్పటికీ మేడిగడ్డే. మన రైతుల కష్టాలు తీర్చే మేడిగడ్డ అని వివరించారు. కాళేశ్వరమే కరవును పారదోలే కల్పతరువు అని కొనియాడారు. బురద రాజకీయాలను భూస్థాపితం చేసిన ఈ మానవ నిర్మిత అద్భుతానికి, కేసీఆర్కు తెలంగాణ సమాజం పక్షాన మరోసారి సెల్యూట్ అంటూ కేటీఆర్ ఎక్స్ వేదికగా తెలిపారు.
"ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిలో కాంగ్రెస్ కుట్రలే కొట్టుకుపోయాయి. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం సగర్వంగా తలెత్తుకుని సలాం చేస్తోంది. పోటెత్తిన వరదకు దుష్టశక్తుల పన్నాగాలే పటాపంచలయ్యాయి. కానీ కేసీఆర్ సమున్నత సంకల్పం జై కొడుతోంది. జల హారతి పడుతోంది. లక్షల క్యూసెక్కుల గంగా ప్రవాహంలో రూ. లక్ష కోట్లు వృధా చేశారనే విమర్శలే గల్లంతయ్యాయి. కానీ మేడిగడ్డ బ్యారేజీ మాత్రం మొక్కవోని దీక్షతో నిలబడింది. కొండంత బలాన్ని చాటిచెబుతోంది. ఎవరెన్ని కుతంత్రాలు చేసినా దశాబ్దాలుగా దగాపడ్డ ఈ తెలంగాణ నేలకు ఇప్పటికీ ఎప్పటికీ మేడిగడ్డే మన రైతుల కష్టాలు తీర్చే “మేటి”గడ్డ.!కాళేశ్వరమే కరవును పారదోలే “కల్పతరువు. బురద రాజకీయాలను భూస్థాపితం చేసిన ఈ మానవ నిర్మిత అద్భుతానికి తెలంగాణ సమాజం పక్షాన కేసీఆర్కు మరోసారి సెల్యూజ్." - కేటీఆర్, ట్వీట్
మేడిగడ్డకు పెరిగిన వరద ఉద్ధృతి - నిండు కుండలా మారిన బ్యారేజీ - Flood Water Reaches Medigadda
కేసీఆర్ జల సంకల్పాన్ని హేళన చేసిన వారు క్షమాపణలు చెప్పాలి : కేటీఆర్ - KTR Tweet on Medigadda Project