ETV Bharat / state

ప్రజాపాలన అంటే ప్రశ్నించే వాళ్ల గొంతు నొక్కటమేనా? : కొణతం దిలీప్​ అరెస్ట్​పై కేటీఆర్ ఫైర్ - Konatham Dileep Arrested

Konatham Dileep Arrested : డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్​ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వ అసమర్థచేతగాని తనాన్ని దిలీప్ ప్రశ్నించటాన్ని రేవంత్ సర్కార్ తట్టుకోలేక అరెస్టు చేశారని ఆయన దుయ్యబట్టారు.

KTR on Konatham Dileep Arrest
Konatham Dileep Arrested (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 5, 2024, 7:35 PM IST

Updated : Sep 5, 2024, 8:05 PM IST

KTR on Konatham Dileep Arrest : రాష్ట్ర డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్​ అరెస్టుపై బీఆర్ఎస్​ కార్యనిర్వహక అధ్యక్షుడు ఎక్స్​వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణవాది కొణతం దిలీప్​ను పోలీసులు అక్రమ కేసులు బనాయించి అదుపులోకి తీసుకున్నారని ఆయన దుయ్యబట్టారు. గత కొంతకాలంగా ప్రభుత్వ చేతగాని తనాన్ని దిలీప్ ప్రశ్నించటాన్ని రేవంత్ సర్కార్ తట్టుకోలేకపోతోందని కేటీఆర్ విమర్శించారు.

కొన్ని రోజుల క్రితం కూడా కొణతం దిలీప్​ను రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు కేసులో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తే హైకోర్టు చీవాట్లు పెట్టిందని కేటీఆర్ దుయ్యబట్టారు. అయినా ప్రభుత్వానికి బుద్ధి రాలేదని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎలాగైనా దిలీప్ గొంతు నొక్కాలన్న ఉద్దేశంతో మరోసారి అక్రమంగా అదుపులోకి తీసుకున్నారన్న కేటీఆర్, కనీస సమాచారం కూడా ఇవ్వకుండా, ఏ కేసులో అదుపులోకి తీసుకుంటున్నారో కూడా చెప్పకుండా పోలీసులు అరెస్ట్ చేయడం దుర్మార్గమని కేటీఆర్ ఆక్షేపించారు.

ప్రజాపాలన అంటే ప్రశ్నించే వాళ్ల గొంతు నొక్కడమేనా అని కేటీఆర్ నిలదీశారు. అక్రమ అరెస్ట్​లు, నిర్బంధాలతో పాలన కొనసాగించవచ్చనుకుంటే అది భ్రమే అన్న ఆయన, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ నిర్భందాలు చేసినా ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్లు మరింతగా పుట్టుకొస్తారని అన్నారు. అక్రమంగా దిలీప్​ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తొమ్మిది నెలలుగా తెలంగాణలో వాక్ స్వాతంత్రం లేదని, నిరంకుశ పాలన సాగుతోందని కేటీఆర్ ఆరోపించారు.

అసలేం జరిగిందంటే : విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రచారం చేశాడనే ఆరోపణల నేపథ్యంలో కొణతం దిలీప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. కొణతం దిలీప్ అరెస్టుపై బీఆర్​ఎస్ నేతలు మాజీమంత్రి జగదీశ్​రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్​కుమార్​, దాసోజ్​ శ్రవణ్ మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతోనే అతణ్ని అక్రమంగా అరెస్టు చేశారని జగదీశ్​రెడ్డి దుయ్యబట్టారు. దిలీప్​ వల్ల శాంతిభద్రతలకు ఎక్కడ భంగం జరిగిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్ఎస్​కు తెలుగు స్త్రైబ్‌కు ఎలాంటి సంబంధలేదని స్పష్టంచేశారు. సీఎం ఆదేశాల మేరకే పోలీసులు దిలీప్​ను కిడ్నాప్ చేశారని మాజీమంత్రి తెలిపారు.

"ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతోనే కొణతం దిలీప్​ను అక్రమంగా అరెస్టు చేశారు. దిలీప్​ వల్ల శాంతిభద్రతలకు ఎక్కడ భంగం జరిగిందో చెప్పాలి. సీఎం ఆదేశాల మేరకే పోలీసులు దిలీప్​ను అరెస్టు చేశారు. తక్షణమే దిలీప్​ను విడుదల చేయాలి". - జగదీశ్​రెడ్డి, మాజీమంత్రి

'రూ.5 లక్షలు కాదు రూ. 25 లక్షలు ఇవ్వాలి' - వరద బాధితుల నష్టపరిహారంపై కేటీఆర్​ ట్వీట్​ - KTR Tweet Latest

తెలంగాణను మరో "బుల్డోజర్ రాజ్" కానివద్దు - కూల్చివేతలపై ఖర్గేకు కేటీఆర్ విజ్ఞప్తి - KTR REACT ON POOR HOUSES DEMOLITION

Last Updated : Sep 5, 2024, 8:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.