KTR fires on Congress : ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి ఉంటే వారికి ఇవ్వాల్సిన పంట బోనస్, నష్టపరిహారంపై ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) డిమాండ్ చేశారు. సిరిసిల్లలోని రైతు దీక్షలో పాల్గొన్న కేటీఆర్, రైతుల పట్ల రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. నెరవేర్చలేని హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, రుణమాఫీ గురించి అడిగితే సీరియస్‌గా తీసుకోవద్దని సీఎం అంటున్నారని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్‌లో చేరిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి : కేటీఆర్ - MLA KTR Tweet
రైతుబంధు రూ.15 వేలు ఇస్తామన్నారు ఇచ్చారా? అని కేటీఆర్ ప్రజలను ప్రశ్నించారు. రాష్ట్రంలో పంటలు ఎండితే కొనే అవసరం లేదని, బోనస్ ఇవ్వాల్సిన అవసరం లేదనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ ఆలోచన చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. కేసీఆర్(KCR) అవినీతి చేశారని చదువురానివాడు కూడా యూట్యూబ్‌లో వీడియోలు చేస్తున్నారని, యూట్యూబ్ వీడియోలు కాదు, కళ్ల ముందు కనిపిస్తున్న నిజాలను నమ్మాలని ఆయన ప్రజలను కోరారు.
రుణమాఫీ, పంటల బోనస్‌పై రాష్ట్ర ప్రభుత్వం మాటమార్చింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చావు కబురు చల్లగా చెబుతున్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ రావడం పంటల బోనస్, నష్టపరిహారం ఇవ్వడానికి అడ్డంకిగా మారిందంటున్నారు. పాలన మా చేతిలో లేదు. ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉందని ఏవేవో కుంటిసాకులు మాట్లాడుతున్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయండి. అవసరమైతే బీఆర్ఎస్ కూడా ఎన్నికల కమిషన్‌కు లేఖ రాస్తాము. - కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
BRS Raithu Deekshalu : రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా రైతు దీక్షలు చేపట్టారు. ఎండిన పంటలకు నష్ట పరిహారం ఇవ్వాలని, 500 రూపాయల బోనస్‌తో పంటలు కొనుగోలు చేయాలన్న డిమాండ్‌తో జిల్లాలో గులాబీ నేతలు దీక్షలకు దిగారు. జనగాం, సూర్యాపేట జిల్లాల పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు, ఇవాళ రైతుదీక్షల పేరిట నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ సిరిసిల్లలో, హరీశ్‌రావు సంగారెడ్డిలో మిగిలిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు ఆయా జిల్లాల్లో జరిగే రైతుదీక్ష నిరసనల్లో పాల్గొన్నారు.
కాంగ్రెస్ నేతలు, మీడియా సంస్థలకు కేటీఆర్ లీగల్ నోటీసులు - KTR sent legal notices