ETV Bharat / state

దానం విషయంలో ఆదివారంలోగా నిర్ణయం తీసుకోవాలి - లేదంటే హైకోర్టుకే : కేటీఆర్ - KTR ON DANAM

KTR on Danam Nagender : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అభ్యర్థిత్వంపై సభాపతి ఆదివారం వరకు నిర్ణయం తీసుకోవాలని కేటీఆర్ పేర్కొన్నారు. లేదంటే హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.

KTR ON DANAM NAGENDAR
KTR ON DANAM NAGENDER
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 3, 2024, 2:12 PM IST

KTR on Danam Nagender : గులాబీ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్​ కండువా కప్పుకున్న ఖైరాతాబాద్​ ఎమ్మెల్యే దానం నాగేందర్​పై వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే సభాపతిని కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని కోరిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే విషయంపై భారత్ రాష్ట్ర సమితి కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై హస్తం పార్టీ లోక్​సభ అభ్యర్థిగా ప్రకటించిన దానం నాగేందర్ వ్యవహారంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదివారం వరకు నిర్ణయం తీసుకోవాలని అన్నారు. లేదంటే హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. హైదరాబాద్​ తెలంగాణ భవన్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

అనర్హతా పిటిషన్లను మూడు నెలల్లో తేల్చాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని కేటీఆర్ గుర్తు చేశారు. దానం నాగేందర్​పై ఇప్పటికే అనర్హతా పిటిషన్ వేయడంతో పాటు అనుబంధ అఫిడవిట్ కూడా దాఖలు చేసినట్లు వివరించారు. దానం నాగేందర్, కడియం శ్రీహరిల శాసనసభ్యత్వాలు రద్దవుతాయని, అలాగే ఉపఎన్నికలు రావడం ఖాయమని అన్నారు. ఒక పార్టీలో ఎన్నికై మరో పార్టీలో చేరిన వారిని రాళ్లతో కొట్టాలని గతంలో రేవంత్​రెడ్డి అన్నారని, ఇప్పుడు ఇతర పార్టీల వారిని చేర్చుకుంటున్న ఎవరిని రాళ్లతో కొట్టాలన్న మందకృష్ణ మాదిగ ప్రశ్నకు సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

హీరోయిన్లను బెదిరించాల్సిన ఖర్మ నాకు పట్టలేదు: కేటీఆర్‌ - Phone Tapping issue

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.