KTR Latest Tweet on Multi Level Car Parking in Nampally : హైదరాబాద్‌లో త్వరలో ప్రారంభం కానున్న మల్టీ లెవల్ పార్కింగ్ నిర్మాణం పూర్తి చేసినందుకు సంతోషంగా ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తన ఎక్స్ అధికార ఖాతాలో ట్వీట్ చేశారు. ఈ భారీ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్‌ను తాము మొదలుపెట్టామని గుర్తు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.
Multi Level Car Parking Complex at Nampally : నాంపల్లిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం 2016-17 సంవత్సరంలో దీనిని ప్రారంభించామని కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కారు పార్కింగ్‌కు అనుకోని అవంతరాల వల్ల కాస్త ఆలస్యమైందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి వాటితో పాటు తాము చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా కొనసాగించాలని ఆయన సూచించారు. ఈ పార్కింగ్‌కి సంబంధించి కొన్ని చిత్రాలను కూడా ట్వీట్ చేశారు.
Multi Level Car Parking Details : నాంపల్లిలో నిర్మించిన మల్టీ లెవల్ కారు పార్కింగ్‌కు ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామంతో సుమారు రూ.80 కోట్లు కేటాయించారు. దేశంలోనే మొదటిసారిగా జర్మన్ పాలిస్ పార్కింగ్ విధానంలో తక్కువ స్థలంలో ఎక్కువ వాహనాలు పార్క్ చేసేలా ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించారు. అర ఎకరంలో 15 అంతస్థుల నిర్మాణం జరిగింది. అందులో 10 అంతస్థుల్లో వాహనాల పార్కింగ్, మిగిలిన 5 అంతస్థుల్లో వాణిజ్య దుకాణాలు, రెండు తెరలతో ఒక సినిమా హాల్‌ను రూపొందించారు. అత్యాధునిక వసతులతో ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా నిర్మించారు. పార్కింగ్ ప్రదేశాల్లో 250 కార్లు, 250 బైక్‌లు పార్క్ చేసే అవకాశం ఉంది. దీన్ని పీపీపీ విధానంలో మెస్సర్స్ భారీ ఇన్ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ కట్టింది.
KTR on Multi Level Car Parking : మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్‌లోని గ్రౌండ్ ఫ్లోర్లో నాలుగు లోపలకి, బయటకు వెళ్లే టెర్మినల్స్ పెట్టారు. వాహనాల నిలుపుదల కోసం టర్న్ టేబుల్స్ అమర్చారు. వీటిపై వాహనదారుడు తమ వాహనాలు పెట్టవచ్చు. వాహనం సైజు ఆధారంగా కంప్యూటరైజ్డ్ పార్కింగ్ సిస్టమ్ ద్వారా వాహనాలను వర్గీకరణ చేయనున్నారు. ఇందులో పార్కింగ్ చేసేందుకు కేవలం ఒక నిమిషం కంటే తక్కువ, తిరిగి తీసుకునేందుకు 2 నిమిషాలకు పొందడం విశేషం.