ETV Bharat / state

" ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా ఎవరూ కూల్చాల్సిన పని లేదు- ఆ జిల్లా నాయకులే చాలు" - LOK SABHA ELECTIONS 2024 - LOK SABHA ELECTIONS 2024

KTR fires on Congress : కాంగ్రెస్ హయాంలో వ్యవసాయం బొక్కబోర్లా పడే పరిస్థితికి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దుయ్యబట్టారు. ప్రభుత్వంపై వంద రోజుల్లోనే తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. అధికారంలోకి రాాగానే అమలు చేస్తామన్న 2లక్షల రుణమాఫీ ఊసేలేదని, రుణమాఫీ పొందిన వారు కాంగ్రెస్​కి ఓటు వేయాలని, రాక మోసపోయిన వారు బీఆర్ఎస్‌కు ఓటు వేయాలని కేటీఆర్ సూచించారు.

NALGONDA BRS PARLIAMENTARY MEETING
KTR fires on Congress
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 1, 2024, 3:22 PM IST

Updated : Apr 1, 2024, 9:42 PM IST

KTR fires on Congress : సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ చేరికలపై పెట్టిన దృష్టి, రైతాంగం సమస్యల పైన పెట్టలేదని మాజీ మంత్రి బీఆర్ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌(KTR) అన్నారు. రాష్ట్రంలో వచ్చింది సహజ సిద్ధమైన కరువు కాదని, అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లే మొట్ట మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డేనని(CM Revanth) అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం తమకు లేదని, నల్గొండ, ఖమ్మం జిల్లాల నేతలే ప్రభుత్వాన్ని కూలుస్తారని, ఏక్‌నాథ్‌ శిందేలు కాంగ్రెస్‌లోనే ఉన్నారని కేటీఆర్‌ అన్నారు.

ఎండిపోతున్న పంటలను పరిశీలించే తీరిక కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు : కేటీఆర్‌ - KTR with Farmers on Crop Damage

KTR consoled the farmers of Mushampally : నల్గొండలో నిర్వహించిన బీఆర్ఎస్‌ పార్లమెంటరీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న కేటీఆర్, గత ఎన్నికల్లో జరిగిన తప్పిదాలను దృష్టిలో పెట్టుకుని పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించాలని క్యాడర్‌కి కేటీఆర్‌ దిశానిర్దేశం చేశారు. అనంతరం నల్గొండ జిల్లా ముషంపల్లికి చెందిన రైతు గన్నెబోయిన మల్లయ్య, బోర్లు వేసి నష్టపోయిన రాంరెడ్డిని పరామర్శించారు. రైతు మల్లయ్యకు లక్ష రూపాయల చెక్కును అందజేశారు. రైతులు గుండె చెదురొద్దని, ధైర్యంగా ఉండాలన్నారు.

Nalgonda BRS Parliamentary Meeting : కార్యకర్తల ఉత్సాహం చూస్తే ఎందుకు ఓడిపోయామో అర్థం కావట్లేదని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాటు మరోసారి జరగకుండా జాగ్రత్త పడాలని సూచించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని గొప్పలు చెబుతున్నారని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక్క నోటిఫికేషన్‌ కూడా విడుదల చేయకుండా ఉద్యోగాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ మాటలు విని మోసపోయామని వందరోజుల్లోనే ప్రజలు గ్రహించారన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ ఇంకా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. రుణమాఫీ జరిగితే కాంగ్రెస్‌కు ఓటు వేయాలని, రాకుండా మోసపోతే బీఆర్ఎస్‌కు ఓటు వేయాలన్నారు. కేసీఆర్ పర్యటనతో కదిలిన ప్రభుత్వం కాళేశ్వరం నుంచి సాగు నీరు విడుదల చేసిందన్నారు. రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పిన పొంకణాల పోతిరెడ్డి రేవంత్ రెడ్డి ఎక్కడ పోయిండని ప్రశ్నించారు.

ఉత్తంకుమార్ రెడ్డి ఎంత బుఖాయించిన వాస్తవాలు వాస్తవాలే గాని అబద్ధాలు కావన్నారు. రాష్ట్ర మంత్రులకు దమ్ము ధైర్యం ఉంటే కరెంటు కోతలు, సాగునీటి కొరత లేదని చెప్పాలన్నారు. ఇదే మాట ముషంపల్లికి వచ్చి రైతులతో చెప్పాలని మంత్రులకు కేటీఆర్ సవాలు విసిరారు. నీళ్లు లేక ఎండిపోయిన పంటలకు ఎకరానికి రూ. 25 వేల నష్టపరిహారం చెల్లించాలని, వెంటనే క్వింటాకి రూ.500 బోనస్ ఇవ్వాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

"కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా ఎవరూ కూల్చాల్సిన పని లేదు. నల్గొండ, ఖమ్మం జిల్లా నాయకులే కులుస్తారు. ఏక్​నాథ్‌ షిందేలు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఇచ్చిన హామీలను అమలులేదు. రైతులకు రుణమాఫీ లేదు. దమ్ముంటే మహిళలకు రూ. 2500 ఇవ్వండి". - కేటీఆర్, మాజీమంత్రి

"ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా ఎవరూ కూల్చాల్సిన పని లేదు- ఆ జిల్లా నాయకులే చాలు"

బీఆర్ఎస్ శ్రేణుల్లో ధైర్యం నింపేలా కేటీఆర్‌ ట్వీట్‌ - పోరాట పంథాలో కదం తొక్కుదామని పిలుపు - Lok Sabha Elections 2024

రంజిత్‌ రెడ్డి, మహేందర్‌ రెడ్డి ఆస్కార్‌ నటుల కంటే ఎక్కువగా నటించారు : కేటీఆర్‌ - BRS Chevella Parliamentary Meeting

Last Updated : Apr 1, 2024, 9:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.