ETV Bharat / state

ఈ నగరానికి ఏమైంది? - కాంగ్రెస్ హయాంలో 'బ్రాండ్ హైదరాబాద్' ఎందుకు మసకబారుతోంది? - KTR ON CRIME RATE IN HYDERABAD - KTR ON CRIME RATE IN HYDERABAD

KTR Expressed Concern on Law And Order in Hyderabad : కాంగ్రెస్ పవర్​లోకి రాగానే సేఫ్ సిటీగా ఉన్న హైదరాబాద్​ మహానగరంలో క్రైమ్ రేటు ఎందుకు పెరుగుతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. ఈనాడు లాంటి ప్రముఖ పత్రికలు కూడా "ఈ నగరానికి ఏమైంది?" అని మొదటి పేజీలో వార్తలు రాస్తున్నాయంటే నగరంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని ఎక్స్​ ద్వారా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

KTR Raise Concern on Crime Rate in Telangana
KTR Raise Concern on Crime Rate in Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 11, 2024, 1:34 PM IST

KTR Raise Concern on Crime Rate in Telangana : పరిపాలనా అనుభవం లేని నాయకత్వం ఎలా ఉంటుందో హైదరాబాద్ నుంచి తెలంగాణ పల్లెటూరు వరకూ అంతటా కనిపిస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు. నగరంలో శాంతి భద్రతలపై పత్రికల్లో వచ్చిన కథనాలను ఎక్స్​లో పొందుపర్చిన ఆయన, ఈనాడు లాంటి ప్రముఖ పత్రికలు కూడా "ఈ నగరానికి ఏమైంది?" అని మొదటి పేజీలో వార్తలు రాస్తున్నాయంటే నగరంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని అర్థమవుతోందని అన్నారు.

"బ్రాండ్ హైదరాబాద్" ఎందుకు మసకబారుతోంది? విశ్వనగరంగా ఎదుగుతున్న వేళ ఎందుకింత కళ కోల్పోతోందని కేటీఆర్ ప్రశ్నించారు. సగటు హైదరాబాదీకి కలుగుతున్న భావన ఇదని, హైదరాబాద్​ను ప్రేమించే ప్రతి ఒక్కరిలో ఉన్న ఆవేదన ఇదని కేటీఆర్ పేర్కొన్నారు. పదేళ్లు ప్రశాంతంగా ఉన్న నగరంలో పెరిగిపోతున్న వరుస హత్యలు, పేట్రేగిపోతున్న అంతరాష్ట్ర ముఠాల కారణంగా రాజధాని హైదరాబాద్​లో శాంతి, నగర ప్రజల జీవితాలకు భద్రత లేదని ఆక్షేపించారు.

బల్లి పడిన టిఫిన్లు, ఎలుకలు తిరిగే చట్నీలతో - కాంగ్రెస్ పెద్ద మార్పే తెచ్చింది: కేటీఆర్ - KTR SLAMS CONGRESS OVER FOOD POISON

సీఎం స్వయంగా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్​కు వస్తున్నా, పోలీసింగ్​పై కమాండ్ ఏదని, క్షీణిస్తున్న శాంతిభద్రతలపై కంట్రోల్ ఏదని ప్రశ్నించారు. ఓవైపు కుప్పకూలిన స్థిరాస్థి రంగం పరిపాలనా వైఫల్యాన్ని వేలెత్తి చూపుతోందని కేటీఆర్ ఆరోపించారు. మరోవైపు పడగవిప్పిన హత్యల సంస్కృతి ప్రతి కుటుంబంలో వణుకు పుట్టిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకోవైపు తరలిపోతున్న పెట్టుబడుల పర్వం యువత ఉపాధి అవకాశాల్ని దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదేనా అధికారంలోకి వచ్చి చేసిన మార్పు : కాంగ్రెస్ పవర్​లోకి రాగానే గడియ గడియకు ఏమిటీ పవర్ కట్ అన్న ఆయన, సేఫ్ సిటీగా ఉన్న మహానగరంలో క్రైమ్​ రేటు ఎందుకు పెరుగుతోందని ప్రశ్నించారు. ఇదేనా మీరు తెస్తానన్న మార్పు అని అడిగారు. విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి పదేళ్లు కష్టపడి పునాదులు వేస్తే, అధికారంలోకి రాగానే ఆగం చేస్తే ఎలా అని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంతో పోటీపడే నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ ప్రగతికి అర్ధాంతరంగా బ్రేకులు వేస్తే ఎలా అన్న కేటీఆర్, దేశ రాజధాని చుట్టూ రాజకీయ చక్కర్లు కొట్టడంపై ఉన్న శ్రద్ధ, చిక్కుల్లో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర రాజధానిపై లేకపోతే ఎలా అని ప్రశ్నించారు.

యావత్ దేశానికి నష్టం : హైదరాబాద్ అంటే కేవలం రాజధాని కాదు "తెలంగాణ ఎకనామిక్ ఇంజిన్ " అని కేటీఆర్ పేర్కొన్నారు. ఇకనైనా కాంగ్రెస్ సర్కారు మేల్కొనకపోతే, మన హైదరాబాద్ దెబ్బతింటే రాష్ట్రానికి కష్టమే కాదు, యావత్ దేశానికి కూడా నష్టమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న వరుస హత్యలపై ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

నిధుల సమీకరణ కోసం ప్రమాదకరమైన మార్గం - ఇలాగైతే మన బిడ్డలకు కొలువులు వచ్చేదెలా? : కేటీఆర్ - KTR OPPOSED GOVT LANDS MORTGAGE

'సీఎంగా మీకు మోకా వస్తే, డీఎస్సీ అభ్యర్థులకు ఇంత ధోకా చేస్తారా' - రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్ ఫైర్ - KTR Fires on CM Revanth Reddy

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.