KTR Comments on Lok Sabha Elections 2024 : బీఆర్ఎస్ ఇంకో ఏడెనిమిది స్థానాలు అదనంగా గెలిచి ఉంటే రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడేదని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా ఇవాళ మల్కాజిగిరి బీఆర్ఎస్ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మల్కాజిగిరి పరిధిలోని ప్రజాప్రతినిధులు, మాజీలు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో దొంగ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ విమర్శించారు. 200 యూనిట్లలోపు విద్యుత్ బిల్లులు కట్టొద్దని రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి చెప్పిన విషయాన్నే తాను గుర్తుచేశానని స్పష్టం చేశారు. నిజాలు చెబితే విధ్వంసకర వ్యాఖ్యలంటూ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారని కేటీఆర్ అన్నారు. నిరుద్యోగ భృతిపై కాంగ్రెస్ తప్పించుకున్నట్లే, పాలమూరు - రంగారెడ్డికి జాతీయ హోదాపై మాట మార్చిందని దుయ్యబట్టారు. దిల్లీలో తెలంగాణ గొంతుక వినబడాలంటే బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేదాకా విడిచి పెట్టం : కేటీఆర్
KTR On Free Current Bill Scheme : 'కరెంట్ బిల్లులను సోనియాకే పంపుదాం. 3 నెలలకు ఒకసారి అన్ని కమిటీలతో సమావేశం నిర్వహిస్తాం. కారు కేవలం సర్వీసింగ్‌కు వెళ్లింది, మళ్లీ రెట్టింపు వేగంతో వస్తాం. దిల్లీలో తెలంగాణ గొంతుక వినబడాలంటే బీఆర్ఎస్ గెలవాలి. అదానీ, మోదీ ఒక్కటేనని దిల్లీలో కాంగ్రెస్ విమర్శిస్తుంది. దావోస్‌లో అదానీతో పెట్టుబడులు ఒప్పందం కుదుర్చుకున్నారు.' అని కేటీఆర్ అన్నారు.
KTR Fires on Congress Govt : కష్టపడి పనిచేస్తే మల్కాజిగిరిలో ఈ సారి విజయం తమదేనంటూ కేటీఆర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. హామీల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ప్రజా కోర్డులేనే సాధికారికంగా ఎండగట్టాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు సమాచార హక్కు చట్టాన్ని కూడా కార్యకర్తలు సమర్థంగా వాడుకోవాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని ఉద్దేశించి మాట్లాడుతూ కారు కేవలం సర్వీసింగ్‌కు వెళ్లిందని లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ రెట్టింపు వేగంతో జోరు చూపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ నెల నుంచి ఎవరు కరెంట్ బిల్లు కట్టవద్దు : కేటీఆర్
"మనం పాలన మీదే దృష్టి పెట్టి యూట్యూబ్ ఛానళ్లలో వచ్చిన అడ్డగోలు దుష్ప్రచారాన్ని సమర్ధంగా తిప్పికొట్ట లేక పోయాం. ప్రగతి భవన్‌లో విలాస వంతమైన సౌకర్యాలూ అంటూ దుష్ప్రచారం చేశారు ఇప్పుడు భట్టి అందులోనే ఉంటున్నారు, విలాసాలు ఉంటే భట్టి ఇప్పటికే టాంటాం చేయక పోయేవారా? పార్టీ కమిటీలు పూర్తిగా వేయక పోవడం వల్ల నష్టం జరిగింది ఇక ముందు ఆలా జరగదుమూడు నెలలకోమారు అన్ని కమిటీల సమావేశం నిర్వహించుకుందాం." -కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు
KTR On CM Revanth Reddy Davos Tour : మోదీకి, రేవంత్ రెడ్డికి భయపడే పార్టీ బీఆర్‌ఎస్ కాదని కేటీఆర్ అన్నారు. ఎట్టి పనికైనా, మట్టి పనికైనా తెలంగాణ ఏకైక గొంతుక బీఆర్ఎస్ అని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి తెలంగాణ గొంతుక బీఆర్‌ఎస్‌ను ఖతం చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. అదానీ, మోదీ ఒక్కటేనని దిల్లీలో విమర్శించే కాంగ్రెస్, దావోస్‌లో అదే అదానీతో పెట్టుబడుల ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పారు. దీన్నిబట్టి చూస్తే బీఆర్ఎస్- బీజేపీ టీం కాదు, బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేననే విషయం స్పష్టంగా తెలుస్తోందని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్ని అమలు చేసేదాకా విడిచి పెట్టం : కేటీఆర్
హైదరాబాద్ బీఆర్ఎస్ నేతల్లో వర్గపోరు - ప్రాధాన్యం లేకుండా ఎన్నాళ్లు పనిచేయాలంటూ అసహనం
కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేదాకా విడిచి పెట్టం : కేటీఆర్