KTR about Industries Investmensts in Telangana : తెలంగాణ నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయని మాజీ ఐటీ శాఖ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్(BRS) హయాంలో రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకొచ్చేందుకు తాము చేసిన కృషి నిష్ఫలం అవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సెమీ కండక్టర్ రంగంలో కీలకమైన పెట్టుబడిగా భావిస్తున్న కేన్స్ సెమికాన్ సంస్థ(Kaynes Semicon Company)తెలంగాణ నుంచి గుజరాత్‌కు తరలిపోతున్నట్లు వచ్చిన వార్తలపై ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందించారు. ఇదే కంపెనీ గతంలో కర్ణాటక రాష్ట్రానికి వెళ్లేందుకు సిద్ధమైనప్పుడు ఎన్నో ప్రయత్నాలు చేసి, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా ఒప్పించామని గుర్తు చేశారు.
KTR about Kaynes Semicon Company : కొంగరకలాన్‌లోని ఫాక్స్‌కాన్(Foxconn) పరిశ్రమకు దగ్గరగా భూమి కేటాయింపు కావాలంటే కేవలం పది రోజుల్లోపే అవసరమైన భూమిని కేటాయించి, కంపెనీని ఒప్పించినట్లు కేటీఆర్ వివరించారు. కేన్స్ కంపెనీ (OSAT) యూనిట్ ఏర్పాటు, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంతో పాటు సెమీ కండక్టర్ పరిశ్రమ ఈకో సిస్టమ్‌కు అత్యంత కీలకమైనదని, పరిశ్రమ వస్తే రెండు రంగాల్లో తెలంగాణ రాష్ట్రం మరింత పురోగతి సాధించే అవకాశం ఉంటుందని అన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కంపెనీ యాజమాన్యాన్ని సంప్రదించి, వారితో చర్చలు జరిపి తెలంగాణ రాష్ట్రంలోనే పెట్టుబడులను కొనసాగించేలా ఒప్పించాలని కేటీఆర్ సూచించారు.
Farmer Viral Video about Agriculture to KCR : ఇదికాగా మరోవైపు పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన ఓ రైతు వీడియోపై కేటీఆర్ స్పందించారు. మళ్లీ కేసీఆర్ గెలిస్తేనే తమకు బుక్కెడు బువ్వ అన్న నల్గొండ జిల్లా ముశంపల్లికి చెందిన మల్లయ్య అనే రైతును తాను త్వరలోనే వెళ్లి కలుస్తానని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. మల్లయ్య అనే రైతు మాట్లాడిన మాటలను ఓ వ్యక్తి రికార్డు చేసి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కేసీఆర్ వచ్చిన తర్వాతనే బుక్కెడు బువ్వ తిన్నామన్న మల్లయ్య, ఇవాళ పొలాలు ఎండిపోతున్నాయి, మేకలు మేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఎక్కడున్నా ఆయనకే ఓట్లు వేస్తామన్న ఆయన, తనతో పాటు మరో పది మందితో ఓటు వేయిస్తానని చెప్పారు.
తనకు రైతుబంధు కూడా రావడం లేదని, ఇప్పుడు తాను అప్పుల పాలు అయ్యానని మల్లయ్య పేర్కొన్నారు. మల్లయ్య వీడియోపై స్పందించిన కేటీఆర్, ఆ రైతు ఆవేదన తనను కదిలించిందని అన్నారు. త్వరలోనే ముశంపల్లి గ్రామానికి వెళ్లి మల్లయ్యతో పాటు బోర్ల రామిరెడ్డిని కలుస్తానని కేటీఆర్ తెలిపారు.
గత 30 ఏళ్లలో పూర్తికాని ప్రాజెక్టులను కేసీఆర్ పాలనలో నాలుగేళ్లలోనే పూర్తి చేశాం : హరీశ్‌రావు