Krishna Ella Attend ISB Graduation Celebration : ప్రపంచంలో భారత్ అతిపెద్ద ఇన్నోవేషన్ హబ్‌గా మారుతోందని, ఆవిష్కరణల గురించి తరగతి గదుల్లో బోధించరని సొంతంగా ఆలోచించాలని భారత్ బయోటెక్ ఛైర్మన్ కృష్ణ ఎల్లా అన్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ISB) లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేషన్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫోన్లో సోషల్ మీడియా పోస్టులు చూస్తూ ఉండకుండా లక్ష్యం నిర్ణయించుకుని దానికోసం కృషి చేయాలని చెప్పారు.
ఎంటర్ ప్రెన్యూర్ షిప్, ఇన్నోవేషన్ , లీడర్ షిప్. ఇవి 3 ముఖ్య విషయాలని, ఇక్కడ కోర్సు పూర్తి చేసుకున్న వారు వీటిని అమలు చేస్తే విజేతలవుతారని కృష్ణా ఎల్లా అన్నారు. కొవాగ్జిన్ తయారీ సమయంలో రాజకీయ నాయకులతో(Politicians) పాటు శాస్త్రవేత్తలు ఎన్నో విమర్శలు చేసినా తాము లక్ష్యం పైనే దృష్టి పెట్టామని చెప్పారు. ఫలితంగా 100 బిలియన్ డాలర్లకు పైగా వ్యాపారం చేసి సత్తా చాటామన్నారు.
IIT Hyderabad Foundation Day: 'మన ఆచారాలు, వ్యవహారాల్లోనే సైన్స్ దాగి ఉంది'
"గడిచిన మూడు దశాబ్దాల నాటి నా జీవితంలో కీలక అంశాలు మీతో పంచుకుంటున్నాను. నా ఆలోచనల్లో ఎప్పుడూ మూడు అంశాలు ఉంటాయి. అవి ఒకటి ఎంటర్ ప్రెన్యూర్ షిప్, రెండోది ఇన్నోవేషన్, మూడోది లీడర్ షిప్. ఇప్పటివరకు నేను వీటితోనే ముందుకు సాగాను. నా విజయానికి సైతం ఇవే ఎంతగానో దోహదపడ్డాయి. అలానే భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ హబ్‌గా మారబోతోంది. ఆవిష్కరణల గురించి తరగతి గదుల్లో ఎవరూ బోధించరు. యువతే సొంతంగా ఆలోచించి ముందుకు సాగాలి."-కృష్ణ ఎల్లా, భారత్ బయోటెక్ ఛైర్మన్
Bharat Biotech Chairman Krishna Ella Comments on Youth : అత్యంత ప్రభావ శీల వ్యక్తుల్ని ఐఎస్బీ దేశానికి అందిస్తోందని, ఇక్కడ చదివినవారు వందలాది యూనికార్న్ సంస్థలు ఏర్పాటు చేశారని, కొందరు వెంచర్ క్యాపిటలిస్టులుగా(Capitalists) కూడా మారారని డీన్ ప్రొఫెసర్ మదన్ అన్నారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె కూడా ఇక్కడే కోర్సు పూర్తి చేయడంతో ఆయన ఈ కార్యక్రమానికి వచ్చారు. కోర్సు సమయంలో తాము పడిన కష్టాలను విద్యార్థులు పంచుకున్నారు. అనంతరం విద్యార్థులకు పట్టాలు పంపిణీ చేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి స్కాలర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డులు అందజేశారు.
వెంకయ్య నాయుడిని కలిసిన భారత్ బయోటెక్ ఛైర్మన్ కృష్ణ ఎల్లా దంపతులు
పెట్టుబడులను ఆకర్షించాలంటే స్పెషాలిటీ కెమికల్స్‌పై దృష్టి పెట్టాలి : కృష్ణ ఎల్ల