ETV Bharat / state

కోనసీమ లంక గ్రామాలను ముంచేసిన గోదావరి - వర్షం తగ్గినా కొనసాగుతున్న వరద ఉద్ధృతి - Konaseema Flooded Villages - KONASEEMA FLOODED VILLAGES

Konaseema Lanka Villages Flooded by Godavari: గోదారి ఉగ్రరూపంతో కోనసీమలోని లంక గ్రామాలు బిక్కుబిక్కుమంటున్నాయి. వర్షం తగ్గినా వారం రోజులుగా వరద నీటిలోనే నానుతున్నాయి. రహదారులు పూర్తిగా మునిగిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అల్లూరి జిల్లాలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది భారీ వర్షాలతో వాగులు ఉప్పొంగి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.

konaseema_flooded_villages
konaseema_flooded_villages (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 29, 2024, 7:48 PM IST

Konaseema Lanka Villages Flooded by Godavari: వర్షం తగ్గినా గోదారి ఉద్ధృతి కొనసాగుతుంది. ఉగ్రరూపంతో ఉరకలెత్తి కోనసీమ లంక గ్రామాలను ముంచేసింది. పి.గన్నవరం నియోజకవర్గంలోని అయినవిల్లి లంక, వీరవల్లి పాలెం, అద్దంకి వారి లంక, పల్లపు లంక, ముమ్మిడివరం నియోజకవర్గంలోని తానే లంక, కూన లంక పూర్తిగా నీట మునిగాయి. ఇళ్లు, రహదారులు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రాకపోకలు సాగించేందుకు పడవలను ఆశ్రయించాల్సి వస్తుంది. మరోవైపు వరద ధాటికి గౌతమి గోదావరి తీరంలోని ఉద్యానవన పంటలన్నీ నీట మునిగాయి. దీంతో భారీగా నష్టపోయామంటూ రైతులు లబోదిబోమంటున్నారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ప్రభుత్వం సాయం అందించింది. బియ్యం సహా పలు నిత్యావసర సరకులు పంపిణీ చేసిందని వరద బాధితులు తెలిపారు. వరదల కోసం ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి శివశంకర ప్రసాద్‌ లంక గ్రామాల్లో పర్యటించారు. రెవెన్యూ, పంచాయతీ రాజ్‌, వైద్యారోగ్య, ఫిషరీస్‌, జలవనరుల శాఖలన్నీ కలిసి అందరం కలిసి బాధితులకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు ముమ్మడివరం నియోజవర్గం పరిధిలో ఏడు గ్రామాలు ముంపు బారిన పడ్డాయని తెలిపారు. 950 మంది బాధితులను గుర్తించడం జరిగిందని వీరందరికీ నిత్యవసర సరుకులు, త్రాగునీరు అందించడం జరిగిందని అధికారులు తెలిపారు. లంక గ్రామాల ప్రజలు ప్రయాణించేందుకు 13 నాటు పడవలు, లైఫ్ జాకెట్లతో సిద్ధంగా ఉన్నాయన్నారు. అదేవిధంగా వారి కొరకు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామన్నారు.

పులుల సంరక్షణ చర్యలపై పవన్ కల్యాణ్ సమీక్ష- అటవీ అధికారులకు పలు సూచనలు - PK Review on Tiger Conservation

రహదారులన్నీ జలమయం: అల్లూరి జిల్లా రంపచోడవరం మన్యంలో గత 15 రోజులుగా కురుస్తున్న వర్షాలు నేటికీ తగ్గలేదు. సీతపల్లి వాగు, మడేరు వాగు, బొడ్లంక వాగు ఉద్ధృతంగా పొంగి పొర్లుతున్నాయి. రహదారులన్నీ జలమయమై రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దేవీపట్నం మండలం పాము గండికి వెళ్లేదారిలో ఆటో నీటిలో నిలిచిపోయింది. ప్రయాణీకులు ఆటోను వాగు దాటించేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

పోలవరం ప్రాజెక్ట్ వెనక జలాలతో కూనవరం, ఎటపాక మండలాలు ముంపునకు గురయ్యాయి. ఏటపాక మండలంలో రెండు పంచాయతీలు పూర్తిగా మునిగిపోయాయి. పంటలు మునిగిపోయి, ఇల్లు కూలిపోయి తీవ్ర ఇబ్బందులుపడుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాసిత ప్యాకేజీ ఇచ్చి వేరే ప్రాంతాలకు తమను తరలించాలని బాధితులు కోరతున్నారు.

ఆంధ్రప్రదేశ్​ తూర్పు కనుమల్లో అరుదైన కప్పలు - దేశంలోనే తొలిసారి - Rare Frogs Found in Eastern Ghats

నిత్యాన్నదాత డొక్కా సీతమ్మ - మధ్యాహ్న భోజన పథకానికి స్ఫూర్తి ప్రదాత పేరు - Dokka Seethamma Mid Day Meal Scheme

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.