Kodi Kathi Srinu expressed gratitude: జనిపల్లి శ్రీను దళితుడు కాబట్టి కోడికత్తి శ్రీను అని పిలుస్తున్నారని, ఆదే సీఎం జగన్‌ను గొడ్డలి జగన్ అని ఎవరైనా పిలవగలరా అని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఫరూక్ షిబ్లి అన్నారు. తాము, సమత సైనిక్ దళ్ సహకారంతో ఒక ప్రణాళిక బద్దంగా ప్రయత్నం చేయడం వల్లే నేడు కోడికత్తి శ్రీనుకు బెయిల్ వచ్చిందన్నారు. ఈ కేసులో శ్రీనుకు న్యాయం జరిగేవరకూ తామంతా శ్రీను కుటుంబానికి అండగా ఉంటామన్నారు.
సహకరించిన వారికి ధన్యవాదాలు: తనకు బెయిల్ రావడంలో సహకరించిన మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఫరూక్ షిబ్లి, సమతా సైనిక్ దళ్ ప్రధాన కార్యదర్శి సురేంద్రబాబును కలిసిన కోడికత్తి శ్రీను, వారికి ధన్యవాదాలు తెలిపారు. విజయవాడలోని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి కార్యాలయానికి విచ్చేసిన జనిపల్లి శ్రీను, ఆయన కుటుంబ సభ్యులు ఫరూక్ షిబ్లికి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహన్ని బహుమతిగా అందించారు. తనకు బెయిల్ రావడం కోసం కృషి చేసిన వారంధరికి శ్రీను ధన్యావాదాలు తెలిపారు.
'జగన్ దళితుల మనిషి అయితే కోడికత్తి కేసులో కోర్టుకు ఎందుకు రావట్లేదు'
జగన్ ను గొడ్డలి జగన్ అనగలరా?: రాష్ట్రంలో దళిత, ముస్లింల ఐక్యతకు కోడి కత్తి శ్రీను పునాదిగా మారారని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఫరూక్ షిబ్లి తెలిపారు. సమత సైనిక్ దళ్ సహకారంతో ఒక ప్రణాళిక బద్దంగా ప్రయత్నం చేయడం వల్లే నేడు న్యాయస్థానం బెయిల్ ఇచ్చిందని ఫరూక్ షిబ్లి పేర్కొన్నారు. కోడి కత్తి శ్రీను దళితుడు కనుక అలా పిలుస్తున్నారు. అదే జగన్ ను గొడ్డలి జగన్ అని ఎవరైనా అనగలరా అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వల్ల చనిపోయిన డ్రైవర్ సుబ్రమణ్యం తల్లిదండ్రులు న్యాయం కోసం చూస్తున్నారని, వారి న్యాయం జరిగేలా తాము కృషి చేస్తామన్నారు.
ఐదేళ్లుగా జైళ్లో పెట్టి దళితులపై ప్రేమ ఉందంటే ఎలా? - జగన్‌పై మండిపడ్డ ఠాణేలంక
శ్రీను కుటుంబ సభ్యులు పేదలు కాదా?: గడిచిన 30 రోజుల్లో ఎవ్వరినీ కలిసినా, కోడికత్తి శ్రీను తల్లి పడుతున్న బాధను చూసి అందరూ అవేదన చెందారని సమతా సైనిక్ దళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేంద్రబాబు పేర్కొన్నారు. తాను క్రిస్టియన్ అని చెప్పుకునే జగన్, ఒక కరుడు గట్టిన రాయిలా వ్యవహరించారని మండిపడ్డారు. అందుకే అయన కనీసం న్యాయస్థానానికి వచ్చి సాక్ష్యం చెప్పలేదన్నారు.
ప్రతి సభలో పేదలు పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతోందని చెప్పే సీఎం జగన్ చెప్తున్నాడని, కోడికత్తి శ్రీను, ఆయన కుటుంబసభ్యులు పేదలు కాదా అని సురేంద్రబాబు ప్రశ్నించారు. కోడికత్తి శ్రీను కుటుంబానికి తాము పూర్తిగా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. జనిపల్లి శ్రీనుకు ఏమైనా జరిగితే అది ముఖ్యమంత్రి జగన్‌దే బాధ్యతన్నారు.