Kodandaram on BRS Medigadda Tour : బీఆర్ఎస్ వైఖరి దొంగే దొంగ అన్నట్లుగా ఉందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టు పటిష్ఠంగా ఉందనటం విడ్డూరమని చెప్పారు. మూడు పిల్లర్లు మాత్రమే కుంగాయని భారత్ రాష్ట్ర సమితి వితండవాదం చేస్తోందని విమర్శించారు. కాళేశ్వరం తప్పిదాలపై బహిరంగ చర్చకు గులాబీ పార్టీ సిద్ధమా? అని సవాల్ విసిరారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
మిలియన్ మార్చ్ స్ఫూర్తితో మేడిగడ్డ ఘటనపై మార్చి 10వ తేదీన బీఆర్ఎస్ చర్చకు రావాలని కోదండరాం సవాల్ విసిరారు. ఊరూరా తిరిగి గులాబీ పార్టీ బండారం బట్టబయలు చేస్తామని చెప్పారు. కాళేశ్వరం కామధేను ఎట్లా అయితుందో కేసీఆర్ చెప్పాలని ప్రశ్నించారు. ఆ ప్రాజెక్టు కామధేను కాదని, తెలంగాణ పాలిట గుదిబండని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) మూడు రకాల సంక్షోభానికి కారణమైందని తెలిపారు. సాగునీరు, ఇంజినీరు వ్యవస్థ, నిధుల సంక్షోభానికి గురైందని వివరించారు. ఫాంహౌజ్ ప్రయోజనాల కోసమే కేసీఆర్ ఆ ప్రాజెక్టు చేపట్టారని కోదండరాం ఆరోపించారు.
బీఆర్ఎస్ నేతలు ఇంకా ఆ విషయం గుర్తించలేకపోతున్నారు : కోదండరాం
Kodandaram Comments on KCR : ఇంజినీర్లతో సంబంధం లేకుండా కేసీఆర్ డిజైన్లు మార్చారని కోదండరాం ఆరోపించారు. డిజైన్లను కూడా తరచూ మార్చుకుంటూ పోయారని, ఇందుకు కేంద్ర జలసంఘం అనుమతులు తీసుకోలేదని తెలిపారు. బ్యారేజీ నిర్మాణానికి మేడిగడ్డ (Medigadda Barrage Damage) సరైన ప్రదేశం కాదని సీడబ్ల్యూసీ చెప్పిందన్న కోదండారం సీడబ్ల్యూసీ హెచ్చరికను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని దుయ్యబట్టారు. పంప్‌హౌస్‌లు మునుగుతాయని హెచ్చరించినా పట్టించుకోలేదని ఆక్షేపించారు.
కేసీఆర్ అణిచివేత వల్లే తెలంగాణ ప్రజలు ఒక్కటయ్యారు : ప్రొ. కోదండరాం
Kodandaram on Kaleshwaram Project : దుర్మార్గమైన బీఆర్ఎస్ పాలనను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని భవిష్యత్‌లో కూడా చూడలేమని కోదండరాం వ్యాఖ్యానించారు. గత సర్కార్ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేసిందని ఆక్షేపించారు. కాళేశ్వరం మరమ్మతు చేయడమంటే గోదావరిలో పైసలు పోసినట్టే అని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డ సందర్శనకు వెళ్లడం అంటే తమ తప్పులను తామే అద్దంలో చూసుకోవడమేనని ఎద్దేవా చేశారు. భారత్ రాష్ట్ర సమితి చర్చకు తెర లేపిందని దీనికి టీజేఎస్ ముగింపు ఇస్తుందని కోదండరాం అన్నారు.
"కాళేశ్వరం మరమ్మతు చేయడమంటే గోదావరిలో పైసలు పోసినట్టే. ఇంజినీర్లతో సంబంధం లేకుండా కేసీఆర్ డిజైన్లు మార్చారు. మార్చిన డిజైన్లకు కేంద్ర జలసంఘం అనుమతులు తీసుకోలేదు. బ్యారేజీ నిర్మాణానికి మేడిగడ్డ సరైన ప్రదేశం కాదని సీడబ్ల్యూసీ చెప్పింది. సీడబ్ల్యూసీ హెచ్చరికను కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కేసీఆర్ దుర్మార్గమైన పాలన ఎప్పుడూ చూడలేదు. రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేశారు." - కోదండరాం, టీజేఎస్ అధ్యక్షుడు
అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అంటేనే వెట్టిచాకిరి - ఈ దుస్థితి మారాలి : కోదండరాం
'నాకు ఎమ్మెల్సీ ఇవ్వటం ఉద్యమకారులకు ఇచ్చిన గుర్తింపు - బీఆర్ఎస్ నేతల అసహనం అర్థం కావడం లేదు'