ETV Bharat / state

తిరుపతిలో 'ప్రేమ​ కథా చిత్రం' యువకుడిపై కత్తితో దాడి - స్కెచ్ ఎవరిదంటే! - Attack on Student in Tirupati - ATTACK ON STUDENT IN TIRUPATI

Attack on Student in Tirupati : సినిమా థియేటర్‌లో లోకేశ్ అనే యువకుడిపై కత్తితో దాడి చేసిన ఘటన తిరుపతి పట్టణంలో చోటుచేసుకుంది. ఈ దాడికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ప్రేమించిన యువతియే, లోకేశ్​పై దాడి చేయించిందని అనుమానిస్తున్నారు. కత్తితో దాడి అనంతరం ఘటన స్థలం నుంచి యువతి పరారైంది.

ATTACK ON STUDENT IN CINEMA THEATER
Attack on Student in Tirupati (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 14, 2024, 5:29 PM IST

Attack on Student in Tirupati : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తిరుపతి పట్టణంలోని ఓ సినిమా థియేటర్​లో యువకుడిపై కత్తిపోట్ల ఘటన తీవ్రకలకలం రేపింది. కత్తిపోట్లకు గురైన యువకుడు యువతితో కలిసి సినిమా చూసేందుకు వెళ్లారు. సినిమా మొదలయ్యాక వెనుక సీటులో కూర్చున్న వ్యక్తి ముందు సీట్లో కూర్చున్న యువకుడిపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. కత్తి పోట్లకు గురైన యువకుడితో కలిసి సినిమాకు వచ్చిన యువతి, దాడికి పాల్పడిన యువకుడితో కలిసి పరారవ్వడం తీవ్ర అనుమానాలకు దారి తీస్తోంది.

సమాచారం తెలుసుకున్న తూర్పు పట్టణ పోలీసులు థియేటర్​కు చేరుకుని గాయపడిన యువకుడిని రుయా ఆస్పత్రికి తరలించారు. సినిమా థియేటర్లలోని సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించిన పోలీసులు, కత్తిపోట్లకు గురైన యువకుడు మోహన్‍ బాబు విశ్వవిద్యాలయ విద్యార్ధి లోకేశ్​గా గుర్తించారు. అతనితో పాటే యువతి సినిమాకు వచ్చింది. ఆ యువతి లోకేశ్​ సహ విద్యార్ధినిగా పోలీసుల విచారణలో తేలింది.

దాడికి పాల్పడిన వ్యక్తి కార్తీక్​గా పోలీసులు భావిస్తున్నారు. ముందస్తు ప్రణాళికతోనే కార్తీక్​తో కలిసి యువతి లోకేశ్​పై దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. లోకేశ్ కత్తిపోట్లకు గురైన ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కార్తీక్‍, యువతి మధ్య ప్రేమ వ్యవహరమే లోకేశ్​పై దాడికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

ఎంత కష్టం వచ్చిందో! - ఐదో ఫ్లోర్ నుంచి దూకి మహిళ ఆత్మహత్య - WOMAN JUMP TO DEATH 5TH FLOOR

భార్య సహకారంతో అత్యాచారం చేస్తాడు - ఆపై నిలువునా దోచేసి, క్రూరంగా హింసించి చంపేస్తాడు - Hyd Couple Given Life Sentence

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.