Kishan Reddy Rythu Deeksha in Hyderabad : తెలంగాణలో రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలను ఇంకా అమలు చేయట్లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy Slams Congress)ఆరోపించారు. అన్నదాతలకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో చెప్పి ఇంకా చేయలేదని విమర్శించారు. హామీలు ఎందుకు అమలు చేయట్లేదని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రైతులకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో ఉదయం చేపట్టిన దీక్ష, సాయంత్రం విరమించారు.
రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, రైతులకు ఇబ్బంది ఉంటే రాష్ట్ర పార్టీ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని సూచించారు. కిసాన్ సమ్మాన్ నిధులు జమకావడంలో ఏమైనా పొరపాట్లు జరిగితే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. తెలంగాణ రైతాంగానికి ఇబ్బందుల పరిష్కారానికి 9904119119 నెంబర్(Toll Free Number) అందుబాటులో ఉంచుతున్నామని వివరించారు.
రాష్ట్రంలో నిజమైన మార్పు రావాలంటే - కుటుంబ పార్టీలకు చరమగీతం పాడాలి : కిషన్ రెడ్డి
Kishan Reddy Fires on Congress : కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన గ్యారంటీల అమలుకు ప్రణాళిక ఉందా అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, రైతు కూలీలకు రూ.12,000, వరి పంటకు రూ.500 బోనస్, పంట నష్టపోయిన అన్నదాతలకు రూ.25,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. హస్తం పార్టీ ప్రభుత్వ తీరుతో కర్షకుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని కిషన్‌రెడ్డి ఆరోపించారు.
బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. గజదొంగలు పోయి ఇప్పుడు ఘరానా దొంగలు వచ్చారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం(KCR Family) పోయి సోనియా కుటుంబం రావటం తప్పితే రాష్ట్రంలో వచ్చిన మార్పేమిలేదని అన్నారు. కొత్తగా తీసుకున్న అప్పులను డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని రేవంత్‌రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. ఇంకా రుణమాఫీ ఎందుకు చేయలేదో ముఖ్యమంత్రి అన్నదాతలకు సమాధానం చెప్పాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
6 గ్యారంటీలు అమలు చేయమంటే, లోక్‌సభ ఎన్నికల్లో గెలిపించాలని అడగడం ఏంటి? : కిషన్‌రెడ్డి
"రేవంత్‌రెడ్డి మాట నమ్మి రైతులు రుణాలు తీసుకున్నారు. పంట కోత సమయంలో అన్నదాతల వద్ద డబ్బులు లేవు. రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. ధాన్యం కొనుగోళ్లులో కాంగ్రెస్ ప్రభుత్వానికి శ్రద్ధ లేదు. తెలంగాణలో వసూలు చేసి దిల్లీలో ఇవ్వడానికి సమయం ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చారు. ఇచ్చిన గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారో స్పష్టంగా చెప్పాలి. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నేతలను నిలదీయాలి." - కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటో సీఎం చెప్పాలి : ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. హామీల అమలుపై రాహుల్ గాంధీకి, (Kishan Reddy on Rahul Gandhi) రేవంత్‌కు సవాల్ చేస్తున్నానని అన్నారు. హస్తం ఇచ్చిన రైతుల డిక్లరేషన్ బోగస్ డిక్లరేషన్ అని విమర్శించారు. ఓట్ల కోసం వచ్చే ఆ పార్టీ నేతలను నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ప్రతి రైతుకూ కావాల్సినంత యూరియా అందుబాటులో ఉందని, యూరియా కొరతలేని భారతంగా మోదీ తీర్చిదిద్దారని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.